Jhanvi Kapoor Home Tour : దివికేగిన దేవ కన్య శ్రీదేవి ఇష్టంతో చెన్నైలో కట్టించుకున్న ఇంటిని కూతురు జాన్వీ కపూర్ తాజాగా వీడియో ద్వారా చూపించింది. అమ్మ ఎంతో ఇష్టంతో ఈ ఇంటిని కట్టించిందని జాన్వీ కపూర్ హోమ్ టూర్ వీడియో చేసింది. ఎంట్రెన్స్ గేట నుంచి హాల్, తండ్రి బోణి కపూర్ ఆఫీస్, పెయింటింగ్ రూం, జిమ్, డైనింగ్ హాల్, బెడ్ రూం ఇలా ఇంటిని మొత్తం హోమ్ టూర్ చేసి చూపించింది జాన్వీ కపూర్. నిన్నే ఈ వీడియో అప్లోడ్ కావడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది.
జన్వీ కపూర్ చేసిన హోమ్ టూర్‌లో ఆ ఇంట్లో తల్లి శ్రీదేవితో కలిసి ఉన్న మధురానుభూతులను పంచుకుంది. లాక్‌డౌన్ సమయంలో అదే ఇంట్లో ఉన్నామని, సోదరి ఖుషి కపూర్ జన్మదిన వేడుకలను అదే ఇంట్లో ఘనంగా నిర్వహించుకున్నట్లు అప్పటి జ్ఞాపకాలను పంచుకుంది జాన్వీ కపూర్. శ్రీదేవి చిన్నప్పటి ఫోటోలు, ఫిలిం కెరీర్ స్టార్టింగ్‌లో దిగిన ఫోటోలు, కపూర్ ఫ్యామిలీ ఫోటోస్ ఇలా ఫోటోలను సంబంధించిన ప్రత్యేక వాల్‌ను చూపించింది.
అదే ఇంట్లో ప్రముఖ నిర్మాత బోణికపూర్ ఆఫీస్ ఉండటంతో, ఆ ఆఫీస్‌ను కూడా చూపించింది. ఇంట్లో తనకు బాత్‌రూం అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చి బాత్‌రూం విజువల్స్ కూడా చూపించింది. జిమ్, టీవీ వాచ్ చేసే లివింగ్ రూమ్, ఇలా చెన్నైలో శ్రీదేవి ఇష్టంతో కట్టించుకున్న ఇంటిని చూపించింది జాన్వీ కపూర్.