EPAPER

Japan Movie Review : జపాన్ రివ్యూ.. దీపావళి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందా ?

Japan Movie Review : జపాన్ రివ్యూ.. దీపావళి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందా ?

Japan Movie Review : పండుగల సీజన్ లో పెద్దహీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్. దసరా, సంక్రాంతి సీజన్లలో సినిమాల రిలీజ్ ల హడావిడి ఎక్కువ ఉంటుంది. అందుకే కార్తి.. ఎలాంటి హడావిడి లేని దీపావళిలో తన సినిమా విడుదలకు ఎంపిక చేసుకున్నాడు. కార్తి 25వ చిత్రంగా జపాన్ నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా ? దీపావళి బ్లాక్ బస్టర్ అవుతుందా ? చూద్దాం.


సినిమా : జపాన్
నటీనటులు : కార్తీ, అను ఇమాన్యుయెల్, సునీల్, కేఎస్ రవి కుమార్ తదితరులు
దర్శకుడు – రాజ్ మురుగన్
నిర్మాణ సంస్థ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు : ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు
సంగీతం : జీవీ ప్రకాష్
సినిమాటోగ్రఫీ : ఎస్ రవివర్మన్
ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్
విడుదల తేదీ : 10.11.2023

కథ


జపాన్ ముని (కార్తీ) భారత్ లోనే పేరుమోసిన గజదొంగ. బంగారాన్నే ఎక్కువ దొంగిలిస్తుంటాడు. ఒక రోజు హైదరాబాద్ లో ఉన్న రాయల్ జ్యూవెలర్స్ లో రూ.200 కోట్ల విలువ చేసే బంగారం దోపిడీ జరుగుతుంది. రంగంలోకి దిగిన పోలీసులకు జపాన్ మునికి సంబంధించిన క్లూస్ దొరకడంతో.. అతడినే దొంగగా భావించి వెతకడం మొదలుపెడతారు. ఇదే సమయంలో జపాన్ తనవద్ద ఉన్న గోల్డ్ తో ఎంజాయ్ చేస్తూ.. కష్టాల్లో ఉన్నవారికి తనకు తోచిన సహాయం చేస్తూ హ్యాపీగా గడిపేస్తుంటాడు.

అప్పటికే తనను ప్రేమించి, బ్రేకప్ చేసుకున్న అమ్మాయి (అను ఇమ్మాన్యుయేల్) కోసం వెళ్తే.. పోలీసులు జపాన్ ను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత జపాన్ ఈ దొంగతనం చేయలేదని తేలుతుంది. మరి 200 కోట్ల విలువైన బంగారాన్ని కొట్టేసిందెవరు? జపాన్ ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు. ప్రేయసితో బ్రేకప్ ఎందుకు అయింది అనే విషయాలు తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

డైరెక్టర్ సినిమా స్టోరీని జపాన్ అనే క్యారెక్టర్ కోసమే రాసుకున్నట్లు ఉంటుంది. సినిమా మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. కార్తీ ఒక డిఫరెంట్ మేనరిజంతో కనిపిస్తాడు. అక్కడక్కడా కార్తీ మార్క్ కామెడీ నవ్వులు పూయిస్తుంది.ఫస్టాఫ్ పర్లేదనిపించినా.. సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో కార్తీ దొంగతనాలు ఎందుకు చేశాడన్నది రివీల్ చేస్తాడు. ఇక్కడ ఎమోషన్ పండింది. కార్తీ నటనే సినిమాకు ప్లస్ పాయింట్ గా కనిపిస్తుంది. జపాన్ క్యారెక్టర్ లో కార్తీ నటన, మాట కామెడీగా ఉంటాయి. ఇక సునీల్.. పుష్ప తర్వాత ఈ సినిమాలో మరోసారి నెగిటివ్ రోల్ లో కనిపించి సక్సెస్ అయ్యాడు.

టెక్నికల్ విలువలు

జపాన్ టెక్నీషియన్ టీమ్ విషయానికొస్తే.. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం బాగుంది. కొన్ని పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. రవివర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంటుంది. కార్తీ కాస్ట్యూమ్స్ ఇంప్రెస్ చేస్తాయి. డైరెక్టర్ పనితీరును గమనిస్తే.. కార్తీ కోసం సృష్టించిన జపాన్ క్యారెక్టర్ మినహా.. పెద్దగా ఆకట్టుకునే అంశాలను ప్రజెంట్ చేయలేదు. డైరెక్టర్ ఇంకాస్త హార్డ్ వర్క్ చేసి ఉంటే.. సినిమా ఇంకా బాగుండేదని సాటి ప్రేక్షకుడికి అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

  • కార్తీ నటన
  • అక్కడక్కడా నవ్వించే కామెడీ
  • క్లైమాక్స్ ఎమోషన్
  • జీవీ ప్రకాష్ సంగీతం

మైనస్ పాయింట్స్

  • సెకండాఫ్ సాగదీతగా ఉండటం
  • ఎక్కడా కనిపించని ట్విస్టులు
  • పెద్దగా స్కోప్ లేని హీరోయిన్ పాత్ర

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×