EPAPER
Kirrak Couples Episode 1

Janhvi Kapoor : సపోర్టింగ్ క్యారెక్టర్ కు ఎక్కువ, ఐటం గర్ల్ కి తక్కువ… ఈమాత్రం దానికే అంత బిల్డప్ ఇచ్చారా?

Janhvi Kapoor : సపోర్టింగ్ క్యారెక్టర్ కు ఎక్కువ, ఐటం గర్ల్ కి తక్కువ… ఈమాత్రం దానికే అంత బిల్డప్ ఇచ్చారా?

Janhvi Kapoor : ఇన్నాళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ ఎట్టకేలకు థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమాలో ఆమె పాత్రను చూశాక విమర్శకులే కాదు అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ మాత్రం దానికే సినిమా రిలీజ్ కి ముందు అంత బిల్డప్ కొట్టారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు సినిమాలో జాన్వి కపూర్ పాత్ర ఎలా ఉంది? ఎందుకు ఆమె ఫ్యాన్స్ ఇంతగా డిసప్పాయింట్ అయ్యారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


అప్పుడే తేడా కొట్టింది 

‘దేవర’ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది అంటూ వార్తలు వచ్చినప్పటి నుంచే సినిమాపై మరింతగా బజ్ పెరిగింది. ఎప్పటి నుంచో జాన్వి కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అంటూ వస్తున్న వార్తలను ‘దేవర’తో ఈ బ్యూటీ నిజం చేసింది. ఇక యంగ్ టైగర్ లాంటి తెలుగు స్టార్ హీరో తో ఈ అమ్మడు మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆసక్తిని పెంచేసింది. అలాగే ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా మరింత బజ్ క్రియేట్ చేసింది. కానీ ‘దేవర’ నుంచి ‘చుట్టమల్లె చుట్టేసావే’ పాట రిలీజ్ అయ్యాక సినిమాలో ఆమె పాత్ర గురించి అనుమానాలు మొదలయ్యాయి. ట్రైలర్ లో కూడా పెద్దగా ఆమె పాత్రకు స్కోప్ ఉన్నట్టుగా చూపించలేదు మేకర్స్. దీంతో ఈ బాలీవుడ్ బ్యూటీని కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారా? అనే  అనుమానాలు తెరపైకి వచ్చాయి. సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందు నుంచే సినిమాలో జాన్వి చేస్తున్న రోల్ నిడివి చాలా తక్కువగా ఉంటుంది అంటూ రూమర్లు మొదలయ్యాయి. ఇక తాజాగా తెరపై అదే నిజం అని తేలిపోయింది.


హీరోయిన్ కి తక్కువ సైడ్ క్యారెక్టర్ కి ఎక్కువ

‘దేవర’ మూవీలో జాన్వి కపూర్ పాత్ర పట్టుమని 10 నిమిషాలు కూడా లేకపోవడం ఆమె అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. అసలు జాన్వికి కథతో సంబంధం లేదు, హీరోతో లవ్ ట్రాక్ లేదు.. కేవలం ఒకే ఒక్క సాంగ్ కోసం ఆమెను తీసుకున్నట్టుగా ఉంది. సినిమాను చూసి బయటకు వచ్చాక మూవీ లవర్స్ అంటున్న మాట ఒక్కటే..  ఈ సినిమాలో జాన్వి కపూర్ పాత్ర హీరోయిన్ కి తక్కువ సైడ్ క్యారెక్టర్ కి ఎక్కువ. నిజానికి జాన్వి అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుంది అనే హోప్స్ పెంచారు ‘దేవర’ మేకర్స్. దీంతో జాన్వికి ‘దేవర’ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తడం ఖాయం అని టాక్ నడిచింది. కానీ సినిమాని చూశాక ఆమె కేవలం పారితోషికం కోసం మాత్రమే ఈ సినిమా చేసిందా అనే డౌట్ వస్తోంది. ఇలాగైతే జాన్వి పాన్ ఇండియా కాదు కదా బాలీవుడ్ లో కూడా ఎక్కువ కాలం కొనసాగదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఆమెకు హిందీలో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు. దానికి కారణం ఆమె ఇలా ప్రాధాన్యత లేని పాత్రలను ఎంచుకోవడమే అనే మాట వినిపిస్తోంది. మరి ఈ సినిమా తర్వాత జాన్వికాపూర్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. Big Tv తో జానీ మాస్టర్ భార్య అయేషా..

Nag Ashwin : ‘కల్కి 2’ తర్వాత ఆ స్టార్ హీరోతో నాగీ సినిమా?

Young Heroine: ఒక్క అవకాశం కోసం 5 మంది.. భరించలేకపోయా..?

Namrata shirodkar: ఏంటీ.. మహేష్ కంటే ముందు నమ్రత ఇంకొకరిని ప్రేమించిందా.. అతని పరిస్థితి తెలిస్తే కన్నీళ్లాగవ్..!

Trisha : విజయ్ తో త్రిష ఎఫైర్ నిజమేనా?.. ఒక్క ఫోటోతో అడ్డంగా దొరికేసిందే..

Emergency : ఆ సీన్లు కట్ చేస్తేనే ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికెట్… కంగనాకు ఎదురు దెబ్బ

Big Stories

×