EPAPER

Janaka Aithe Ganaka OTT : ‘ జనక అయితే గనక ‘ ఓటీటీ డేట్ లీక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Janaka Aithe Ganaka OTT :  ‘ జనక అయితే గనక ‘ ఓటీటీ డేట్ లీక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Janaka Aithe Ganaka OTT : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ‘ జనక అయితే గనక ‘.. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ నుంచి నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సందీప్ బండ్ల దర్శకత్వం వహించగా.. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పతాకం మీద శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మిస్తున్నారు. బలగం తర్వాత ఆ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ డీల్ కు ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం..


హీరో సుహాస్ ఈ ఏడాది అర డజనుకు పైగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో చివరగా విడుదలైన మూడు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. కానీ ఈ సినిమా పై దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. దసరా రోజు విడుదల కాబోతున్న ఈ మూవీ కి అదే రెస్పాన్స్ ఉంటుందేమో చూడాలి.. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కంటే రెండు రోజుల ముందు పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. అవి చూసిన ఆడియన్స్ నుంచి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. పండక్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడం ఖాయంగా కనబడుతోంది..

ఇక ఈ మూవీ ఓటీటీ డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు డీల్ కుదిరినట్లు తెలుస్తుంది. ‘జనక అయితే గనక’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సొంతం చేసుకుంది. సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి అంటే ముందు ఓటీటీ రైట్స్ ‘ఆహా’కు ఇచ్చేసింది ‘దిల్’ రాజు కాంపౌండ్. థియేటర్లలో స్పందన బట్టి ఓటీటీ విడుదల తేదీ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది.. ప్రభాస్ సలార్ రైటర్ సందీప్ బండ్ల ఈ మూవీకి డైరెక్టర్. ఇది కుటుంబ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో కాన్సెప్ట్ చూసి హాయిగా నవ్వుకునేలా ఉంటుందని పెయిడ్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులతో పాటు ఈ మూవీ టీమ్ కూడా చెబుతున్నారు. ఈ చిత్రానికి విజయ బుల్గానిన్ సంగీత దర్శకుడు. సినిమా విడుదలకు ముందు ఆయన స్వరపరిచిన పాటలు ప్రేక్షకులలోకి వెళ్లాయి.. ఇక సుహాస్ కు జోడిగా సంగీర్తన కథానాయికగా నటించగా… ఇతర కీలక పాత్రలలో మురళీ శర్మ, గోపరాజు రమణ, ‘వెన్నెల’ కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..


Related News

Vettaiyan Twitter Review: వేట్ట‌య‌న్ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్.. హిట్ కొట్టినట్లేనా?

Maa Nanna Superhero Review :’మా నాన్న సూపర్ హీరో’ మూవీ రివ్యూ

Star Hero : గర్ల్ ఫ్రెండ్ బెడ్ రూమ్ లో అడ్డంగా బుక్కయిన స్టార్ హీరో.. కానీ చివరిలో ట్విస్ట్..

Dhanush: ధనుష్- ఐశ్వర్య విడాకులు రద్దు.. ఆయన కోసమేనా.. ?

Samantha: చిన్మయి కూతురితో సమంత.. క్యూట్ వీడియో వైరల్

SSMB29: మహేష్ కాబట్టే కథ లేట్ అయ్యింది.. విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×