EPAPER

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు అవతార్ డైరెక్టర్ ఫిదా.. రెండుసార్లు చూసిన కామెరూన్.. గాల్లో తేలిపోతున్న జక్కన్న..

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు అవతార్ డైరెక్టర్ ఫిదా.. రెండుసార్లు చూసిన కామెరూన్.. గాల్లో తేలిపోతున్న జక్కన్న..

RRR: జేమ్స్ కామెరూన్. పేరు కాదిది హాలీవుడ్ బ్రాండ్. ఆయన సినిమా తీశారంటే.. ప్రపంచ రికార్డులు బద్దలు కావాల్సిందే. లేట్ గా సినిమాలు తీసినా.. లేటెస్ట్ గా తీస్తుంటారు. ఇటీవలి అవతార్ మూవీ కామెరూన్ చెక్కిన శిల్పమే. అంతటి ఆయన.. మన జక్కన్న సినిమాకు ఫిదా అయిపోయారు. RRR చిత్రాన్ని చూసిన జేమ్స్ కామెరూన్ కు ఆ మూవీ తెగ నచ్చేసిందట. ఎంతగా నచ్చిందంటే.. సినిమా చూసొచ్చాక తన భార్యతో కలిసి మరోసారి సినిమా చూసేంతగా. RRRను కామెరూన్ రెండుసార్లు చూశారంటే మాటలా.


ఓ హాలీవుడ్ వేడుకలో వాళ్లిద్దరూ కలిశారు. కాసేపు మాట్లాడుకున్నారు. ఆర్ఆర్ఆర్ ను రాజమౌళి తెరకెక్కించిన తీరును జేమ్స్ కామెరూన్ ప్రశంసించారు. కామెరూన్ అంతటివాడే తన సినిమాను పొగడంతో రాజమౌళి గాల్లో తేలిపోతున్నారు. ఆ అనుభూతిని ట్విటర్ లో పంచుకున్నారు. ఫోటోలు షేర్ చేశారు.

‘‘ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూశారు. ఆయనకు ఈ సినిమా ఎంతో నచ్చింది. తన భార్యను కూడా ఈ చిత్రాన్ని చూడాలని ఆయన కోరారు. ఆమెతో కలిసి మరోసారి సినిమా చూశారు’’ అని తెలిపిన రాజమౌళి తన ఆనందానికి హద్దులు లేవంటూ ట్వీట్ చేశారు.


‘‘మీరు మాతో 10 నిమిషాలు గడిపారంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను విశ్లేషించి చెప్పడాన్ని జీవితంలో మర్చిపోలేను’’ అంటూ ట్విటర్ లో థ్యాంక్స్ చెప్పారు రాజమౌళి.

ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్.. మరో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకుంది. ఉత్తమ విదేశీ భాష చిత్రంగా క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డు వరించింది.

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×