EPAPER

Jagapathi Babu: లెజెండ్ ను వాడుకోలేకపోయాను.. కొన్ని తప్పులు.. ఆశఎక్కువై.. డబ్బు కోసం

Jagapathi Babu: లెజెండ్ ను వాడుకోలేకపోయాను.. కొన్ని తప్పులు.. ఆశఎక్కువై.. డబ్బు కోసం


Jagapathi Babu: ఇప్పుడంటే జగపతి బాబు విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో చూస్తున్నాం కానీ, ఒకప్పుడు ఆయన సినిమాలు వస్తున్నాయి అని తెలిస్తే ఇంట్లో భర్తలను వదిలేసి మరీ థియేటర్ కు పరిగెత్తేవారు ఆడవాళ్లు. అంతలా లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో జగపతి బాబు. ఫ్యామిలీ కథలకు బ్రాండ్ అంబాసిడర్. ఎన్నో మంచి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అందించిన ఆయన ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. హీరో నుంచి విలన్ గా మారాడు. లెజెండ్ సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యింది. ఈ సినిమాలో జగపతి బాబు నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బాలయ్యకు ధీటుగా జగ్గూభాయ్ నటనను చూసి.. ఈ హీరోలో ఇంత విలనిజం ఉందా అని షాక్ అయ్యారు.

ఇక లెజెండ్ తరువాత జగ్గు భాయ్ లైఫ్ టర్న్ అయ్యింది. వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. టాలీవుడ్ కు ఒక ధీటైన విలన్ దొరికాడని అనుకున్నారు. అయితే జగ్గుభాయ్ ఆ పేరును కొనసాగించలేకపోయాడు. ఈ విషయాన్నీ ఆయన కూడా ఒప్పుకున్నాడు. లెజెండ్ సక్సెస్ ను సరిగ్గా వాడుకోలేకపోయాను అని జగ్గూభాయ్ అసహనం వ్యక్తం చేశాడు. ఆ సినిమా తరువాత దాదాపు 90 సినిమాలు చేస్తే అందులో.. కేవలం 5, 6 సినిమాలు మాత్రమే గుర్తు ఉన్నట్లు తెలిపాడు.


తాజాగా ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ.. ” సినిమాల కోసం ఇంట్లో కూర్చొని ఎదురుచూస్తున్నాను.. ఆ సమయంలోనే నాకు ఒక కాల్ వచ్చింది. లెజెండ్ లో యాంటీ హీరోగా చేస్తారా.. ? అని, బేసిక్ గా వాళ్లకు తెలియదు నేను ఆ టైమ్ లో ఏ మైండ్ లో ఉన్నానో అని, చేస్తాడా..? చేయడా..? అనే ఆలోచనలో వాళ్లు ఉన్నారు.. అరేయ్ రండిరా బాబు.. ఏదో ఒక సినిమా చేయాలి.. అనే మైండ్ లో నేను ఉన్నాను. ఆ టైమ్ లో చేసిన సినిమా లెజెండ్. కానీ, ఆ సినిమా సక్సెస్ ను నేను సరిగ్గా వాడుకోలేకపోయాను. నాకు వచ్చిన అవకాశాల విషయంలో నేను ఇంకొంచెం జాగ్రత్తపడి ఉంటే.. చాలా మంచి క్యారెక్టర్స్, చాలా మంచి సినిమాలు పడేవి. ఎన్నో కారణాల వలన నేను ఎంచుకున్న సినిమాలు తప్పు. కొన్ని సినిమాలు మిస్ ఫైర్ అయ్యాయి.. కొన్ని సినిమాలు ఆశఎక్కువై.. డబ్బు కోసం చేశాను. ఇవన్నీ కూడా నా కెరీర్ కు దెబ్బ కొట్టాయి. లేకపోతే నా కెరీర్ ఇంకా ఫాస్ట్ గా ఉండేది. నేను బ్యాడ్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే.. ఆ తరువాత.. నేను 80, 90 సినిమాలు చేశాను.. కానీ అందులో నాకు గుర్తుఉన్నవి ఆరు. శ్రీమంతుడు, రంగస్థలం, అరవింద సమేత.. ఇలా కౌంట్ చేస్తే 6 సినిమాలు మాత్రమే గుర్తు ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం జగపతి బాబు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

Related News

Aay Movie: ఆయ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నామండీ

Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

Faria Abdullah: మన చిట్టిలో ఇంత టాలెంట్ ఉందా.. అదిరిపోయింది బంగారం

Viran Muttemshetty: అల్లు అర్జున్ కజిన్ హీరోగా గిల్ట్.. ఫస్ట్ లుక్ చూశారా..?

Sri Sri Sri Rajavaru: ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విచ్చేస్తున్నారు.. నేషనల్ అవార్డ్ దర్శకుడితో నార్నే నితిన్ సినిమా

Devara Trailer: పండగ సందర్భంగా ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nandamuri Balakrishna: బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో.. జనాలను చంపేద్దామనుకుంటున్నారా.. ?

Big Stories

×