EPAPER

Jagapathi Babu: చిన్న కూతురికి అలాంటి సలహా.. షాక్ లో ఫ్యాన్స్..!

Jagapathi Babu: చిన్న కూతురికి అలాంటి సలహా.. షాక్ లో ఫ్యాన్స్..!

Jagapathi Babu: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న జగపతిబాబు (Jagapathi babu) హీరోగా ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ను , మహిళా అభిమానులను సొంతం చేసుకున్న ఈయన, బాలకృష్ణ (Balakrishna )హీరోగా నటించిన లెజెండ్ ( Legend) సినిమాతో విలన్ గా మారి తనలోని మరో యాంగిల్ ను అభిమానులకు చూపించారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా విలన్ పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నారు జగపతి బాబు. ఇకపోతే ప్రతి ఒక్కరితో చాలా ఫ్రెండ్లీగా , సరదాగా కనిపించే ఈయన తన కూతుర్లతో కూడా అలాగే ఉంటారని ఎన్నో సందర్భాలలో నిరూపించారు కూడా.. ఈ క్రమంలోనే తన చిన్న కూతురుకి పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


రాంగోపాల్ వర్మ బాటలో జగపతి బాబు..

జగపతిబాబు.. ఈయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే తాను ఏది అనుకున్నా సుత్తి లేకుండా సూటిగా చెప్పే గుణం ఆయనది. నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఏ విషయం పైన అయినా సరే తనకు తెలిసిందంటే మాత్రం ఓపెన్ గానే సమాధానం ఇస్తారు. ఇదే ఆయన నైజం. ముఖ్యంగా జగ్గూభాయ్ లో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ఉన్నారా? అనే సందేహం కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులలో కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆయన డిఫరెంట్ గా ఆలోచించడం, మాట్లాడే విధానం , ఓపెన్ మైండెడ్ వ్యక్తిత్వం వంటివి రామ్ గోపాల్ వర్మకు ఎక్కువగా సింక్ అవుతూ ఉంటాయి.


పెద్ద కూతురు పెళ్లి విషయంలో పూర్తి స్వేచ్ఛ..

ఇక జగపతిబాబు వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఆయన పెద్ద కూతురు విదేశీయుడిని వివాహం చేసుకుంది. అది కూడా ప్రేమ వివాహం. ఆ సమయంలో విదేశీయుడిని వివాహం చేసుకోవడం ఏంటి..? అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అలాంటి పెళ్లి వద్దు అని జగపతిబాబుకి ఎంతోమంది సలహాలు ఇచ్చినా తన కుమార్తె ఇష్టపడి చేసుకుంటాను అన్నప్పుడు నేనెవరిని అడ్డు చెప్పడానికి అంటూ పెద్ద కూతురుకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు జగపతిబాబు. ఇంకా ఆయన చిన్న కుమార్తె ఒకరు ఉంది. ఆమె ఇంకా వివాహం చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే చిన్న కూతురు పెళ్లి ప్రస్తావన రాగా ఊహించని కామెంట్ చేశారట జగపతిబాబు.

చిన్న కూతురుకి పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చిన జగపతిబాబు..

ఇదే విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్లు తెలుస్తోంది. నేను నా ఒపీనియన్ ఓపెన్ గానే చెప్పాను. నేనైతే బలవంతంగా నీకు పెళ్లి చేయను. నీకు నచ్చి పెళ్లి చేసుకోవాలనిపిస్తే చేసుకో.. అయితే ఆ సంబంధం కూడా నువ్వే వెతుక్కో.. నేను మాత్రం నీకు పెళ్లి కొడుకును వెతకను. పెళ్లి చేయడం అన్నది బాధ్యత కదా? అని ఎవరైనా అంటే.. తొక్కలో బాధ్యత.. అది నేను అస్సలు నమ్మను. అని నా అభిప్రాయంగా చెబుతాను అంటూ సమాధానం ఇచ్చారు జగపతిబాబు. తన ఉద్దేశంలో ప్రేమ ముఖ్యమా..? బాధ్యత ముఖ్యమా..? అంటే ప్రేమే ముఖ్యమని చెబుతానని, ప్రేమ పంచాలి కాని బాధ్యత పేరుతో ఇష్టం లేని నిర్ణయాలు తీసుకోకూడదు అని తెలిపారు. ఏది ఏమైనా జగపతిబాబులా అందరి తల్లిదండ్రులు ఆలోచిస్తే.. అమ్మాయిల పరువు హత్యలు , ప్రేమ హత్యలు ఉండవు అని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి చిన్న కూతురికేమో పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చారు. మరి ఆమె నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Ka Movie Bookings : ‘క’ కనిపించంట్లేదు… కిరణ్ అబ్బవరం పరిస్థితి ఏంటి ఇప్పుడు..?

RaviTeja 75 Movie Title : మాస్ ‘జాతర’ కు ఇక పూనకాలే… టైటిల్, రిలీజ్ డేట్ డీటైల్స్ ఇవే..!

Naga Chaitanya – Sobhita Wedding Date: పెళ్లి డేట్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్..!

Ka Movie : ‘క’ సినిమాకు ఎగ్జిబిటర్స్ హ్యాండిచ్చారా..? ఇప్పుడు డబ్బులు ఎలా..?

Bail To Actor Darsan: నటుడు దర్శన్ కి బెయిల్ మంజూరు.. బయటకు వచ్చాక చేసే మొదటి పని అదే..?

Salaar 2 Update : నిలిచిపోయిన సలార్ సీక్వెల్… ఫ్యాన్స్‌ను పిచ్చొళ్లను చేశారుగా…

×