EPAPER

JrNTR: తెలుగువారిని లైట్ తీసుకుంటున్న ఎన్టీఆర్.. ?

JrNTR: తెలుగువారిని లైట్ తీసుకుంటున్న ఎన్టీఆర్.. ?

Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టాలీవుడ్ ను లైట్ తీసుకుంటున్నాడా.. ? అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.   ఆర్ఆర్ఆర్ తరువాత నుంచి ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో ఎదగాలని  ఆశ  పడుతున్న విషయం  తెల్సిందే. దానికోసమే ఎన్టీఆర్.. బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ ను ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే వార్ 2 లో  ఎన్టీఆర్   ఒక హీరోగా  సెలెక్ట్ అయిన విషయం తెల్సిందే. హృతిక్ రోషన్ తో పాటు మల్టీస్టారర్ అయిన వార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.


ఇక  తెలుగులో ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు  ఎన్టీఆర్.  కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. తెలుగు ప్రేక్షకుల గురించి.. అందులో  ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి తెలుగువారిని ఎన్టీఆర్ లైట్ తీసుకొని.. మొదట బాలీవుడ్ లో ప్రమోషన్స్ చేయడానికి వెళ్లడం  కొంతమంది ఫ్యాన్స్ కు మింగుడుపడడం లేదు.

ఇప్పటివరకు ఎన్టీఆర్ .. దేవర తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టింది లేదు. ఒక ఇంటర్వ్యూ కానీ,  ఒక  ప్రెస్ మీట్ కానీ ఏది ఇంకా స్టార్ట్ చేయలేదు. రేపు రిలీజ్ కాబోయే ట్రైలర్ లాంచ్ కూడా ముంబైలోనే జరగబోతుంది. ఎన్టీఆర్.. ఎందుకు ఇలా చేస్తున్నాడు..? హిందీలో తన మార్కెట్ ను పెంచుకోవడానికి చేస్తున్నాడా.. ? లేక ఈ సినిమాలో హీరోయిన్, విలన్ అయిన జాన్వీ, సైఫ్ ఆలీఖాన్    బాలీవుడ్ కాబట్టి అక్కడ అటెన్షన్ కోసం ట్రై చేస్తున్నాడా.. ? అనేది  తెలియడం లేదు.


ఇంకా చెప్పాలంటే  దేవర ఒక తెలుగు సినిమా.  పాన్ ఇండియా  లెవెల్లో  రిలీజ్ అవుతున్నా.. దేవర  టాలీవుడ్ సినిమా కాబట్టి.. మొదట వారందరూ  కూడా  టాలీవుడ్ లో కదా ప్రమోషన్స్ ఇవ్వాలి అనేది కొంతమంది  పాయింట్. ప్రస్తుతం ముంబైలో ఎన్టీఆర్.. వరుస షోస్ లలో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ముంబైలో సందీప్ రెడ్డి వంగతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ జరిగింది. అందుకోసమే వీరు కలిశారు. ఇది కాకుండా దేవర టీమ్.. కపిల్ శర్మ షోలో పాల్గొంటుంది. అందుకు సంబంధించిన షూటింగ్ కూడా నేడు జరిగింది.

ఒక్కసారిగా ఇవన్నీ ఏంటి .. ? ఇవన్నీ పక్కన పెడితే.. ఎన్టీఆర్ పక్కన కొరటాల లేడు. అన్ని ప్రమోషన్స్  లో ఎన్టీఆర్ మాత్రమే ఉన్నాడు.  ట్రైలర్ లాంచ్ ను ముంబైలో పెట్టడానికి కారణం ఏంటి ..?  రేపు ఈ లాంచ్ ఈవెంట్ లోనైనా కొరటాల ఉంటాడా .. ? లేదా .. ? అనేది  తెలియదు. నిజం చెప్పాలంటే..  ఈ సినిమాపై  ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకు కారణం .. రాజమౌళి సెంటిమెంట్.  ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత దేవరతో ఎన్టీఆర్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. దానికి తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు. దీనికోసమే ఎన్టీఆర్..  బాలీవుడ్ మార్కెట్ పై కన్నేశాడా.. ? ఈ ప్రమోషన్స్ తో అన్ని చోట్లా హైప్ తీసుకొద్దామని ట్రై చేస్తున్నాడా.. ? అంటే  ఏమో నిజమే అనుకోవచ్చు.

ఇప్పటికే హిందీలో కూడా ఎన్టీఆర్ కు మంచి మార్కెట్ నే ఉంది. ఇక తెలుగులో  దేవర ఫీవర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎన్టీఆర్.. మొదట బాలీవుడ్ లో హైప్ తెచ్చుకొని టాలీవుడ్ సైడ్ వస్తాడా.. ? అనేది చూడాలి.  ఇక ఇంకోపక్క  ఎన్టీఆర్.. రాజమౌళి  ప్రమోషన్స్ స్ట్రాటజీని వాడుతున్నాడా.. ? జక్కన్న కూడా ముందు బాలీవుడ్  లో ప్రమోషన్స్ మొదలుపెట్టేవాడు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కూడా ముంబైలోనే లాంచ్ అయ్యింది. ఇప్పుడు  ఎన్టీఆర్ కూడా  ఆయన్నే ఫాలో అవుతున్నాడేమో చూడాలి.

Related News

Devara Story Leaked : ఏంటి.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు ఆ డిజాస్టర్ మూవీకి కాపీనా..?

Saif Ali Khan : సైఫ్ ఆలీఖాన్ ప్రభాస్ సినిమానే లెక్క చెయ్యలేదు, దీనికంటే అవమానం ఏముంది.?

Marthanda K Venkatesh: బయ్యర్స్ కు సినిమా వేస్తే అందరూ పడుకున్నారు, కట్ చేస్తే ఆ సినిమా కల్ట్ క్లాసిక్ అయింది

Johnny Master Case : మాస్టారు గారి లీలలు.. సపోర్ట్ చేసే వాళ్లు… వ్యతిరేకించే వాళ్ళు వీళ్ళే..

Mathu Vadalara 2 Collections : మైండ్ బ్లాక్ చేస్తున్న ‘మత్తు వదలరా 2’.. నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Poonam Kaur: జానీ మాస్టర్ పై పూనమ్ షాకింగ్ పోస్ట్.. మాస్టర్ కి విలువ ఉందంటూ..?

Johnny Master : మాస్టారు క్రిమినల్ హిస్టరీ… నెలలపాటు జైల్లోనే…

Big Stories

×