EPAPER

Juhi Chawla: జూహీ చావ్లా ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే

Juhi Chawla: జూహీ చావ్లా ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే

Indias richest income Heroine Juhi Chawla after Shahrukhkhan: ఎనభయ్యవ దశకంలో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అయింది జూహీచావ్లా. దాదాపు అప్పటి స్టార్ హీరోలతో నటించి అగ్రశ్రేణి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. 18 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా పోటీలో విజేతగా ఎన్నికయింది. 1988లో వచ్చిన ఖయామత్ సే ఖయామత్ తక్ మూవీ బ్లాక్ బస్టర్ విజయంతో జూహీ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అమీర్ ఖాన్ హీరోగా చేసిన ఖయామత్ సే ఖయామత్ తక్ మ్యూజికల్ హిట్ మూవీగా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. టీవీ రియాలిటీ షోలోనూ మెప్పించింది. ఝలక్ దిఖ్ లాజా డ్యాన్స్ రియాలిటీ షోకి జడ్జిగా వ్యవహరించింది జూహీ చావ్లా. 1995 లో ప్రముఖ పారిశ్రామిక వేత్తన జే మెహతాని వివాహం చేసుకున్నారు జూహీ చావ్లా. కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్ కు తన భర్త కో పార్ట్ నర్ గా ఉంటున్నారు. షారుఖ్ ఖాన్ తో కలిసి ఆమె డ్రీమ్డ్ అన్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పి మూడు సినిమాలను నిర్మించింది. అయితే హురున్ ఇండియా 2024 సంవత్సరానికి సంబంధించి భారత్ లో అత్యధిక ధనవంతులైన కథానాయికల లిస్ట్ ప్రకటించింది.


ఆదాయంలో నెంబర్ వన్ కథానాయిక

జూహీ చావ్లా భారత్ లోనే అత్యధిక ధనవంతురాలైన కథానాయికగా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. గత పదేళ్లుగా ఆమె హీరోయిన్ గా చేయడం లేదు. కేవలం చిన్న పాత్రలు, టీవీ రియాలిటీ షోలు తప్పించి పెద్దగా ఆదాయం కూడా లేదు. జూహీ చావ్లా నికర ఆస్తి మొత్తం అంతా కలిపి నాలుగువేల ఆరు వందల కోట్లు అని తేలింది. షారుక్ ఖాన్ రూ.ఏడు వేల మూడువందల కోట్లతో ప్రధమ స్థానంలో నిలవగా..జూహీచావ్లా రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. దాదాపు ప్రపంచ స్థాయి కుబేరుల లిస్టులో ఉంది జూహీ.90వ దశకంలో వచ్చిన బోల్ రాధ బోల్, డర్, లోఫర్, ఇష్క్ సినిమాలు బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపించాయి. జూహీ చావ్లా అంటే మినిమం గ్యారెంటీ హిట్ అనే స్థాయికి తీసుకెళ్లింది. షారుక్ డ్రీమ్ ప్రాజెక్ట్ రెడ్ చిల్లీస్ బ్యానర్ లో జూహీ చావ్లా పార్టనర్ గా ఉన్నారు.
అయితే సినిమాల పరంగా పెద్దగా ఆదాయం లేకపోయినా జూహ్లీకి ఐపీఎల్ ద్వారా కోట్లలో ఆదాయం సమకూరింది.


ఐపీఎల్ ఫ్రాంచైజీగా..

ఐపీఎల్ టీ 20 క్రికెట్ కు భారత్ లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. వీటి కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తుంది. ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ ఆదాయం రూ.తొమ్మిది వందల కోట్లు. ఆమె తర్వాత ప్రియాకం చోప్రా రూ.850 కోట్లు ఉంది. తర్వాత ఆలియా భట్ రూ.550 కోట్ల నికర ఆస్తులు కలిగి వుండటం విశేషం. రీపికా పదుకునే రూ.400 కోట్లు , కత్రినా కైఫ్ రూ.240 కోట్లు కలిగి ఉన్నారు. వీరందరి ఆదాయం కలిపినా జూహీచావ్లా ఆస్తులే ఎక్కువ.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×