EPAPER

Tax Payers: ఏంటి? మనోళ్లు.. అంతంత ట్యాక్సులు కడతారా?

Tax Payers: ఏంటి? మనోళ్లు.. అంతంత ట్యాక్సులు కడతారా?

Celebrities: ఇండియాలో సెలబ్రిటీలు గవర్నమెంటుకి కట్టే ట్యాక్సులు చూస్తే మతి పోతుంది. ఏడాదికి ఇన్ని కోట్లరూపాయలు ట్యాక్సులు కడితే, అసలు వారి ఆదాయం ఎంతనే డౌట్లు వస్తుంటాయి. వైట్ గా చూపించేదానికే ఇన్ని కోట్లు అయితే, మరి బ్లాక్ మనీ ఎంత ఉంటుందనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.


ఇకపోతే ముందు క్రికెటర్ల విషయానికి వస్తే ద గ్రేట్ విరాట్ కొహ్లీ అందరికన్నా ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాడు. తను ఏడాదికి రూ. 66 కోట్లు చెల్లిస్తున్నాడు. ఇక ద గ్రేట్ సచిన్ టెండుల్కర్ రూ.28 కోట్లు, మహేంద్ర సింగ్ ధోనీ అయితే రూ. 38 కోట్లు, సౌరభ్ గంగూలీ రూ.23 కోట్లు, హార్దిక్ పాండ్యా రూ. 13 కోట్లు, రిషబ్ పంత్ రూ.10 కోట్లు ట్యాక్స్ లు కడుతున్నారు.

వీరే ఇంతింత ట్యాక్సులు కడితే, అసలు వీరి ఆదాయమెంత? అని నెటిజన్లు లెక్కలు కడుతున్నారు. నిజానికి వీరికి క్రికెట్ ఆడితే వచ్చే ఆదాయం కన్నా, వీరి బ్రాండ్ వాల్యూస్ తో వచ్చే వ్యాపార ప్రకటనల ద్వారానే ఎక్కువని అంటున్నారు. అంతేకాదు విరాట్ కొహ్లీ లాంటి వాళ్లు వ్యాపారాల్లోకి కూడా దిగడంతో వీరి ఆదాయం రెట్టింపవుతుందని అంటున్నారు. అయితే ఇన్నిన్ని కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కట్టడం ఎందుకు? వ్యాపారాలు చేస్తే పోలా? అని భావించే విరాట్ రెస్టారెంట్ బిజినెస్ లోకి వచ్చాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.


Also Read: M Chandrababu: ఎదురుగా ట్రైన్..వెనుక డ్యాం.. సీఎం ఎలా తప్పించుకున్నాడంటే?

టీమ్ ఇండియా కోచ్ గౌతం గంభీర్ కి మాత్రం ట్యాక్స్ తక్కువ పడిందని అంటున్నారు. ఎందుకంటే తను కొన్ని కోట్ల రూపాయలతో ఒక ట్రస్ట్ నడుపుతున్నాడు. అందువల్లనే తనకి కొంత వెసులుబాటు కలిగిందని చెబుతున్నారు. నిజానికి గౌతంకి రూ.200 కోట్లపైనే ఆస్తులున్నాయని అంటున్నారు. కేవలం తన ట్రస్ట్ కోసమే.. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా వచ్చాడనే పలువురు కామెంట్ చేస్తుంటారు.

అయితే చాలా మంది క్రికెటర్లు సేవా ద్రక్పథంతోనే ముందుకు సాగడం విశేషం. ధోనీ, సచిన్, సౌరభ్ గంగూలీ లాంటి వాళ్లు ఎన్నో గుప్తదానాలు చేస్తుంటారు. ఇకపోతే రాహుల్ ద్రవిడ్ లాంటి వాళ్లు టీ 20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం బీసీసీఐ ఇచ్చిన వచ్చిన ప్రైజ్ మనీలో సగం తీసుకోకుండా స్టాఫ్ కి ఇవ్వమని చెప్పడం విశేషం. ఇకపోతే కోల్ కతా ఫ్రాంచైజీ ఓనర్, సినీ హీరో షారూఖ్ ఖాన్ అయితే ఏడాదికి రూ.92 కోట్లు ట్యాక్స్ కడుతుంటారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×