Nuvve Nuvve Movie 20 Years Celebrations : నువ్వే నువ్వే సినిమాపై రాసిన రివ్యూలో టైటిల్ వింటే ఆ సినిమా అస్సలు చూడరా?

Nuvve Nuvve Movie 20 Years Celebrations : నువ్వే నువ్వే సినిమా వచ్చి 20 ఏళ్లు అయిపోయింది. ఇప్పుడు 40ల్లో ఉన్నవారికి ఆ సినిమాతో ఎక్కువగా అటాచ్ మెంట్ ఉంటుంది. అందులో లవ్ సాంగ్స్.. బ్రేకప్ సాంగ్స్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. అందుకే 20ఏళ్లు అయినా.. ఇప్పటికీ చాలామంది యూట్యూబ్ లోనో.. మరో మీడియంలోనో.. ఆ సినిమా పాటలు వింటూ ఉంటారు. దీనిని బట్టి అది ఎంత గ్రాండ్ సక్సెస్ సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఆ చిత్రం యూనిట్ 20ఏళ్ల సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించింది. గత కొంత కాలంగా ఈ 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ ట్రెండ్ కొనసాగుతోంది. మెగాస్టార్ ‘అభిలాష’ ‘ఛాలెంజ్’ చిత్రాలు…. నాగార్జున్ ‘శివ’సినిమా విషయంలోనూ 20 ఏళ్ల సెలబ్రేషన్స్ ని జరిపారు. ఈ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాయి. అయితే.. 20 ఏళ్ల సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ‘నువ్వే నువ్వే’ సినిమాకు అభిలాష్, శివ తరహా రేంజ్ ఉందా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నువ్వే నువ్వే సినిమా 2002 అక్టోబర్ 10న రిలీజ్ అయింది. అప్పటి వరకు కేవలం మాటలు మాత్రమే రాసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తొలిసారిగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మాటలు, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే రాశారు. కొన్ని పాటలు, కొన్ని సీన్లు తప్ప ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా కూడా కాదని టాక్ వినిపించింది.

శివ, అర్జున్ రెడ్డిలా ఆ తరహా ట్రెండ్‌ను సెట్ చేయకపోయినా.. యూత్ కు మాత్రం బాగా కనెక్ట్ అయ్యింది. ఆ టైమ్‌లో వచ్చిన ‘జయం’ సినిమాతో మొదలైన లవ్ ట్రెండ్‌లో ఈ సినిమా కూడా కొచ్చింది. ఎన్నో సినిమాలను కాపీ కొట్టి ఈ సినిమా చేశారనే వాదన కూడా ఉంది. హాలీవుడ్ చిత్రం “ఫాదర్ ఆఫ్‌ ది బ్రైడ్‌”ను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారని సినీక్రిటిక్స్ రివ్యూస్ ఇచ్చారు. ఇందులోని అయామ్ వెరీ సారీ సాంగ్ ను ఇంగ్లీష్ అల్బమ్ నుంచి కాపీ కొట్టినట్లు అప్పట్లోనే వైరల్ అయింది. సరే.. ఈ విమర్శల మాట ఎలా ఉన్నా.. లవ్ సినిమాతో మొదలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.

నువ్వే నువ్వే సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన తరుణ్.. ఇప్పుడు తెరమరుగైపోయాడు. నాటి హీరోయిన్ శ్రియ ఇప్పటికీ కొన్ని సినిమాల్లో నటిస్తున్నా.. కెరీర్ ను మాత్రం సో సో గా నెట్టుకొస్తోంది. అయినా సరే వాళ్లంతా ఇప్పుడు 20 ఏళ్ల సెలబ్రేషన్స్ ని మాత్రం గ్రాండ్ గా నిర్వహించుకుని.. హ్యాపీ మూమెంట్స్ ను ఎంజాయ్ చేశారు. అప్పట్లో ఈ సినిమాపై రాసిన ఓ రివ్యూలో.. పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా.. ‘నువ్వే నువ్వేవ్వేవ్వే’. ప్రస్తుతానికి ఈ టైటిల్ వైరల్ గా మారింది.

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pawan kalyan – Mahesh Babu : పవన్ కళ్యాణ్‌తో మహేష్ పోరు.. బాక్సాఫీస్ ఫైట్‌లో వెనుకడుగు వేసేదెవరో!

Samyuktha Menon:- బ‌న్నీ సినిమాలో సంయుక్తా మీన‌న్‌!

Mahesh Babu:- SSMB 28 టైటిల్‌.. సెంటిమెంట్‌ను వ‌ద‌ల‌ని గురూజీ

Trivikram Thaman: తమన్‌కి త్రివిక్ర‌మ్ షాక్‌!.. మ‌హేష్ సినిమాలో భారీ మార్పు