EPAPER

IC 814: The Kandahar Hijack Review: దేశ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్.. అస్సలు మిస్ అవ్వొద్దు

IC 814: The Kandahar Hijack Review: దేశ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్.. అస్సలు మిస్ అవ్వొద్దు

IC 814: The Kandahar Hijack Review: ఈ మధ్య యదార్ధ సంఘటనల ఆధారంగా వస్తున్న సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అందుకు కారణం.. అప్పటి పరిస్థితిలు ఎలా ఉండేవి అనేది ఇప్పటి జనరేషన్ కు తెలియదు కాబట్టి.ముఖ్యంగా పొలిటికల్ ప్రెషర్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. దేశాన్ని రక్షించడం కోసం సైనికులు ఎంత అయితే కష్టపడుతున్నారో.. ఉగ్రవాదులు.. ప్రజల ప్రాణాలను రిస్క్ లో పెట్టి టెర్రరిస్టులను అలాగే విడిపించేస్తున్నారు. ఈ మధ్యలో అటు ప్రజలను కాపాడానికి.. ఇటు దేశాన్ని కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయాలను తీసుకుంది.. ఆ నిర్ణయాల వలన జరిగిన నష్టం ఏంటి.. ? అనేది కొన్ని కొన్ని సంఘటనలు ప్రజలకు తెలిసేలా చేస్తాయి. అలాంటి ఘటనలలో ఒకటి IC 814 ది కాంధార్ హైజాక్.


ఇప్పటివరకు ప్లైట్ హైజాక్ ను ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ, ఇండియాలో అలాంటి ఒక హైజాక్ నిజంగా జరిగింది అని,  ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం ముగ్గురు అతి క్రూరమైన ముగ్గురు టెర్రరిస్టులను విడిచిపెట్టిందని మీకు తెలుసా..? తెలియకపోతే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న  IC 814 ది కాంధార్ హైజాక్ అనే వెబ్ సిరీస్  చూడాల్సిందే. ఫ్లైట్ ఇన్‌టు ఫియర్ , హైజాక్ గురించి కెప్టెన్ దేవి శరణ్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు దర్శకులు అనుభవ్ సిన్హా, త్రిశాంత్ శ్రీవాస్తవ. ఇక ఇందులో స్టార్ క్యాస్టింగ్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు మనకు తెలిసినవారే ఉంటారు.  విజయ్ వర్మ, అరవింద్ స్వామి, నజీరుద్దున్ షా, పంజక్ కపూర్, రాజీవ్ ఠాకూర్, దియా మీర్జా ఇలాచెప్పుకుంటూ పోతే చాలామంది ప్రముఖులు ఇందులో నటించారు.

కథ: 1999 చివరి రోజులలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ IC 814 అపఖ్యాతి పాలైన హైజాక్‌కి సంబంధించిన కథను డీటైల్ గా వివరించారు. 176 మంది ప్రయాణికులతో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ IC 814 కాట్మండు నుంచి ఢిల్లీకి పయనమవుతుంది. టేకాఫ్ అయిన తరువాత కొంతమంది ఉగ్రవాదులు.. విమానాన్ని హైజాక్ చేస్తారు. కెప్టెన్ శరణ్ దేవ్  తలకు గన్ గురిపెట్టి.. విమానాన్ని కాబూల్ తీసుకెళ్లామని బెదిరిస్తారు. అసలు ఉగ్రవాదుల డిమాండ్స్ ఏంటి.. ? అసలు విమానం కాబూల్ చేరిందా.. ? ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారా.. ? ప్రభుత్వం వారి కోసం చేసిన త్యాగం ఏంటి.. ? అనేది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.


విశ్లేషణ: మిగతా సిరీస్ లకు.. ఈ సిరీస్ కు ఉన్న తేడా ఏంటి అంటే.. ఎంత యదార్ధ సంఘటనలతో సిరీస్ తీసినా.. నిజమైన ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు.. సిరీస్ పూర్తయ్యాకా చూపిస్తారు. కానీ, ఇందులో మాత్రం.. ఒరిజినల్ కంటెంట్ ను సన్నివేశాలకు తగ్గట్టుగా చూపించారు. 1999 లో మీడియా ఉండడంతో అప్పటి సన్నివేశాలను.. ఈ సిరీస్ లో భాగంగా చేశారు.నిజమైన పాత్రలను చూపిస్తూ.. అప్పటి రోజుల్లో ఇదే జరిగిందని చూపించిన విధానం చాలా ఆసక్తి రేకెత్తిస్తుంది. ముందు, వెనుక ఎలాంటి అర్ధం పర్థం లేని సన్నివేశాలను అతికించకుండా.. మొదటి సీన్ నే  కెప్టెన్ శరణ్ దేవ్.. ఫ్లైట్ ను టేకాఫ్ చేసే సీన్ తో మొదలుపెట్టాడు. ఇక నార్మల్ ప్రయాణికులుగా ఉగ్రవాదులు విమానంలోకి ఎక్కి.. టేకాఫ్ అవ్వగానే హైజాక్ చేసింది చూపించి.. కథలోకి తీసుకెళ్లాడు. కెప్టెన్ కు గన్ గురిపెట్టి, బెదిరించినప్పుడు.. అతడు సినిమాలో హీరోలా ఫైట్ చేయడం కుదరదు. దాన్ని డైరెక్టర్ ఎంతో లాజిక్ గా చూపించాడు. హైజాక్ చేయడం దగ్గరనుంచి ఉన్నతాధికారులకు ఆ సమాచారం ఎలా చేరింది.. ? వారు ఆ విషయాన్నీ ఎలా రిసీవ్ చేసుకున్నారు.. ? పొలిటికల్ గా ఈ ఘటన ఎలాంటి సెన్సేషన్ సృష్టించింది. అధికారుల మధ్య జరిగే మాటలు.. ఇలా ఒక్కొక్కటి ఎంతో అద్భుతంగా చూపించారు.

ముఖ్యంగా ఇతర దేశాల ప్రతినిధులతో మన అధికారులు  మాట్లాడే విధానం మరింత  ఆకట్టుకుంటుంది. ప్రజలను కాపాడడానికి.. దేశాన్ని నాశనం చేసిన టెర్రరిస్టులను వదలాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. సైనికుల కుటుంబాలు ఎలాంటి మనోవేదనకు గురయ్యారు అనేది కూడా కళ్ళకు కట్టినట్లు చూపించారు. దాదాపు  ఈ హైజాక్ 8 రోజులు కొనసాగింది. 176 మంది ప్రయాణికుల్లో ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలను కోల్పోయాడు.  ఎక్కడా.. బోర్ కొట్టకుండా సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టగలిగేలా దర్శకుడు ఈ సిరీస్ ను తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం. అప్పటి ప్రధాని అటల్ బీహార్ వాజపేయి ఈ ఘటనను ఖండించడం లాంటి ఒరిజినల్ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేయడం మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. ఒక్కో ఎపిసోడ్ 30 నుంచి 40 నిముషాలు  ఉంది. మొత్తం  6 ఎపిసోడ్స్ తో కుటుంబం మొత్తం చూడదగ్గ సిరీస్ అని చెప్పొచ్చు.

నటీనటులు: కెప్టెన్ శరణ్ దేవ్ పాత్రలో విజయ్ వర్మ ఒదిగిపోయాడు. పిల్లలకు గంటలో ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి వెళ్లిన కెప్టెన్.. 8 రోజులు.. టెర్రరిస్టులు చెప్పినట్లు నిరంతరాయంగా విమానాన్ని నడిపే పాత్రలో అదరగొట్టేశాడు.  ఈ సిరీస్ కు ఆయనే హీరో. అరవింద్ స్వామి, నజిరుద్దీన్ షా, దియా మీర్జా తమ తమ పాత్రలను ఎంతో ఈజ్ గా లాకొచ్చారు. అయితే ఇది రియల్ కథ కాబట్టి.. దానికి ఎక్కడా కల్పితాలు యాడ్ చేయకుండా చూపించడంతో.. థ్రిల్లింగ్ అంశాలు కనిపించవు. హీరో ఎలివేషన్స్, విలన్ ఫైట్స్ ఏం ఉండవు. చర్చలు ఎక్కువగా చూపించడంతో కొద్దిగా అర్ధం కాక లాగ్ అనిపించేలా ఉంటుంది. కానీ, ఒక హైజాక్ నుంచి అందరు ప్రాణాలతో బయటపడ్డారు అనే హ్యాపీ ఫీల్ చివరి ఎపిసోడ్ లో అందరి ఫేస్ లో కనిపిస్తుంది. ఇక అంతేకాకుండా ఆ  తప్పించుకున్న టెర్రరిస్టులు ఇప్పటివరకు ఎన్ని దారుణాలు చేశారో కూడా చివర్లో చూపించారు.

ట్యాగ్ లైన్: IC 814 ది కాంధార్ హైజాక్.. ఎంగేజ్ చేసే థ్రిల్లర్ డ్రామా

Related News

RJ Shekar Basha: గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున .. తండ్రి అయిన శేఖర్ భాషా

Raghava Lawrence: దెయ్యాలను వదిలేసి రీమేక్ లు ఎందుకు బ్రో..?

Aay: బాలయ్య ఫ్యాన్ ను కుక్కను కొట్టినట్లు కొట్టిన చిరు ఫ్యాన్..

NTR: ఎన్టీఆర్ గొప్ప మనసు.. చావు బతుకుల్లో ఉన్న అభిమానికి ధైర్యం చెప్పిన దేవర

Devara: ఆ స్టార్స్ ఏంటి.. ఆ ఇంటర్వ్యూలు ఏంటి.. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావ్ తారక్

Actor Vijay: వరుస ప్లాపులు.. చివరి సినిమాకు అన్ని కోట్లు ఎలా అన్నా.. ?

Malavika Mohanan: ఇంటిమేటేడ్ సీన్స్.. దానిని తట్టుకోలేక.. ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Big Stories

×