Hyper Adhi At Lucky Bhaskar Event: ప్రస్తుతం ఉన్న కమెడియన్సులో మంచి పేరు సాధించుకున్నాడు హైపర్ ఆది. అయితే ఎప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ ఎవరిని ఆదరిస్తుందో చెప్పలేను. ఖచ్చితంగా టాలెంట్ ఉన్న నటులకి రచయితలకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్థానం ఉంటూనే ఉంటుంది. ముందుగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడి ఉన్న తరుణంలో ఒక స్పూఫ్ వీడియో హైపర్ ఆది కెరియర్ ను మార్చేసింది అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అత్తారింటికి దారేది సినిమాలోని క్లైమాక్స్ సీన్ ను ఒక సెల్ఫోన్లో రికార్డ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేశాడు ఆది. ఆ వీడియో ను చూసిన జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి ఆదిని పిలిపించాడు. ముఖ్యంగా ఒరిజినల్ వీడియో కి రాసిన ఫన్నీ సంభాషణ విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడితో జబర్దస్త్ లో రచయితగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే తనదైన మార్క్ కామెడీలో చూపించాడు.
ఆ తర్వాత జబర్దస్త్ లో కొన్ని రోజుల తర్వాత హైపర్ ఆది రైజింగ్ రాజు అనే టీం ఏర్పడింది. ఇక ఆ టైంలో హైపర్ ఆది స్కిట్స్ కోసం కూడా ఎదురు చూసి ఆడియన్స్ తయారయ్యారు. అంతగా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇ తరుణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రేమను కూడా చాలాసార్లు వ్యక్తపరిచాడు. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో అవకాశం సాధించాడు. ఇక సినిమాల్లో అవకాశాలు వచ్చిన తర్వాత ఫుల్ బిజీగా మారిపోయాడు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు దృష్టిలో కూడా పడి పెద్ద పెద్ద అవకాశాలు అందుకున్నాడు. అలానే పవన్ కళ్యాణ్ అంటే హైపర్ ఆదికి ఎంత ఇష్టమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కు విపరీతమైన తనవంతు సేవలు అందించాడు. కొన్నిచోట్ల అదిరిపోయి స్పీచెస్ కూడా ఇచ్చాడు. హైపర్ ఆది వాక్చాతుర్యం గురించి దర్శకుడు వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు.
దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాలలో హైపర్ ఆదికి మంచి పాత్ర ఉంటుంది. ఇకపోతే సార్ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు వెంకీ అట్లూరి. ఇప్పుడు దర్శకత్వం వహించిన లక్కీ భాస్కర్ సినిమాలో కూడా హైపర్ ఆది మంచి పాత్రను పోషించాడు. అయితే ఈ సినిమా ఈవెంట్ కి విజయ్ దేవరకొండ త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు శివ సినిమా మంచి ప్రభావాన్ని చూపించింది ఆ తర్వాత విజయ్ దేవరకొండ కెరియర్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ రాబోయే గౌతమ్ తిన్ననూరి సినిమాతో విజయ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాడు. అందరికీ సమాధానం చెప్తాడు అంటూ మాట్లాడారు. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రస్తావిస్తూ ఎంతగా ఇన్స్పైర్ అయ్యానో అంటూ మాట్లాడారు. ఇక దుల్కర్ సల్మాన్ విషయం ప్రస్తావిస్తూ “మహానటి సినిమాలో మీరు సావిత్రి గారిని అమ్మాడి అనడంతో, నేను కూడా బయట ఒక అమ్మాయి వెనకాల తిరిగి అమ్మాడి అన్నాను. కానీ అమ్మాయి నాకు ఇంకా పెళ్లి కాలేదు అమ్మ ఒడి ఎక్కడి నుంచి వస్తుంది అంటూ వెళ్లిపోయింది”. ఇక అమ్మఒడి పథకం ఏ ప్రభుత్వంలో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకే చాలాసార్లు అదే ప్రభుత్వం మీద చాలా విమర్శలు గుప్పించాడు ఆది. ఇప్పుడు మరోసారి సినిమా ఈవెంట్ లో కూడా చిన్నగా పొలిటికల్ టచ్ ఇచ్చాడు.