EPAPER

Hydra: అవసరం లేదు నేనే కూల్చేస్తా.. హైడ్రా నోటీసులపై మురళీమోహన్ స్పందన

Hydra: అవసరం లేదు నేనే కూల్చేస్తా..  హైడ్రా నోటీసులపై మురళీమోహన్ స్పందన

Hydra Demolitions in Hyderabad: తెలంగాణలో హైడ్రా దూకుడు పెంచింది. హైదరాబాద్ నగర పరిధిలో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేతలో స్పీడ్ పెంచింది. తాజాగా, టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్‌కు హైడ్రా నోటీసులు జారీ చేసిందని సమాచారం.


వ్యాపారవేత్త అయిన మురళీమోహన్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరి సంస్థలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి రంగలాల్ కుంటు చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

15 రోజుల్లోగా కూల్చకపోతే తామే కూలుస్తామని హైడ్రా హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కల్ారిటీ రావాల్సి ఉంది. అదే విధంగా భగీరథ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలను వేయడంపై పూర్తి స్థాయి విచారణ జరపనున్నట్లు తెలిపారు.


Also Read:  మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

హైడ్రా అధికారుల నోటీసులపై సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. రియల్ ఎస్టేట్ రంగంలో 33 ఏళ్లుగా తాను ఉన్నానని, ఇప్పటివరకు ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించామని అధికారులు అంటున్నారన్నారు.  ఇక్కడికీ హైడ్రా అధికారులు రావాల్సిన అవసరం ఏమీ లేదని, ఆ షెడ్డును తామే కూలుస్తామని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రంలోపు తాత్కాలిక షెడ్‌ను తొలగిస్తామని స్పష్టం చేశారు.

స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు తమ ప్రాంతానికి వచ్చారని మురళీమోహన్ తెలిపారు. గచ్చిబౌలి రంగలాల్‌కుంట చెరువు బఫర్‌ జోన్‌లోకి ఈ షెడ్‌ వస్తుందని అధికారులు చెప్పారన్నారు. కాగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ , బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రముఖ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తో పాటు పలు అక్రమ కట్టడాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×