EPAPER

Hrithik Roshan: హృతిక్ రోషన్‌కు చిన్నప్పటి నుంచి ఆ వ్యాధి.. దానివల్ల చాలామంది ఎగతాళి చేసేవారంట..!

Hrithik Roshan: హృతిక్ రోషన్‌కు చిన్నప్పటి నుంచి ఆ వ్యాధి.. దానివల్ల చాలామంది ఎగతాళి చేసేవారంట..!

Hrithik Roshan: బాలీవుడ్‌లో అత్యంత స్టార్ హీరోల్లో ‘గ్రీక్ గాడ్’ హృతిక్ రోషన్ ఒకడు. నేడు ఆయన బర్త్ డే కావడంతో పలువురు సెలబ్రెటీలు, అభిమానులు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆయనను చిన్నతనం నుంచి ఓ వ్యాధి ఇబ్బంది పెట్టిందట. ఈ విషయం తెలుగు సినీ ప్రియులకు పెద్దగా తెలియకపోవచ్చు. ఇంతకీ ఆయనను పీడించిన ఆ వ్యాధి ఏంటో అనే వివరాల్లోకి వెళితే..


సినీ ఇండస్ట్రీలో 2000 సంవత్సరంలో ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హీరోగా తన జీవితాన్ని ప్రారంభించాడు హృతిక్. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉన్న హృతిక్‌కు హీరోగా ఎదగాలని అప్పటినుంచే పట్టు ఉండేదట. కానీ అనారోగ్యం కారణంగా కొంత ఇబ్బంది పడ్డాడట. అయినా పట్టువదలకుండా అనుకున్న దానికోసం ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడట. వాస్తవానికి హృతిక్‌కి చిన్నప్పటి నుంచి నత్తి సమస్య ఉండేదట. దీని కారణంగానే ఆయన స్పష్టంగా మాట్లాడలేకపోయేవాడట. గతంలో హృతిక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

తనకు 6 ఏళ్ల నుంచి ఈ వ్యాధి ఉందని.. దీనివల్ల చాలామంది తనని ఎగతాళి చేసేవారని తెలిపాడు. అంతేకాకుండా దీని కారణంగానే స్కూల్‌కు కూడా సరిగ్గా వెళ్లే వాడిని కాదని చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాధి 35ఏళ్ల వరకు పీడించిందని.. ఒకానొక సమయంలో తన సినీ కెరీర్‌పై కూడా ఎఫెక్ట్ పడిందని తెలిపాడు. ఆపై స్పీచ్ థెరపీ తీసుకోవడం వల్ల దాని నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చాడు.


Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×