Sree Vishnu : వెబ్ డిజైనర్ గా కెరియర్ మొదలుపెట్టి బాణం సినిమాతో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు శ్రీ విష్ణు. శ్రీ విష్ణు మొదట సోలో, లవ్ ఫెయిల్యూర్, నా ఇష్టం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో కనిపిస్తూ ఉండేవాడు. అయితే పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో డెబ్యుగా లీడ్ రోల్ లో కనిపించాడు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా తర్వాత కూడా ఒక్కడినే, ప్రతినిధి సన్నాఫ్ సత్యమూర్తి, అసుర వంటి సినిమాల్లో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు శ్రీ విష్ణు. అయితే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వచ్చిన “అప్పట్లో ఒకడుండేవాడు” సినిమాతో మంచి పేరు శ్రీ విష్ణు కి లభించింది. ఆ తర్వాత “ఉన్నది ఒకటే జిందగీ” సినిమా శ్రీ విష్ణుకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకుడుగా పరిచయమైన మెంటల్ మదిలో (Mental Madilo) సినిమాతో హీరోగా మారాడు శ్రీ విష్ణు. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఇటు వివేకాత్రేయ దర్శకుడిగా అటు శ్రీ విష్ణును హీరోగా నిలబెట్టింది ఆ సినిమా. ఆ సినిమా తర్వాత వేణు ఉడుగులతో “నీది నాది ఒకే కథ” (Needhi Naadhi Oke Katha) అనే సినిమాను చేశాడు శ్రీ విష్ణు. ఈ సినిమా మంచి ప్రశంసలను అందుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమా తర్వాత చేసిన “వీర భోగ వసంత రాయలు” సినిమా డిజాస్టర్ పాలయ్యింది. ఆ తర్వాత మళ్లీ “వివేక్ ఆత్రేయ” దర్శకత్వం వహించిన బ్రోచేవారెవరురా సినిమా మంచి హిట్ అయి శ్రీ విష్ణు కి కూడా మంచి పేరును తీసుకుని వచ్చింది. ఆ తర్వాత వచ్చిన “తిప్పరా మీసం” “గాలి సంపత్” సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి.
హసిత్ గోలి (Hasith Goli) దర్శకుడుగా పరిచయమైన రాజరాజ చోర సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా, బాగానే ఆడింది. ఆ సినిమాకి మంచి ప్రసంశలు లభించాయి. దర్శకుడిగా హాసిత్ గోలి ను కూడా నిలబెట్టింది ఆ సినిమా. మళ్లీ వీరి కాంబినేషన్ లో స్వాగ్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాను శ్రీ విష్ణు తో పాటు చిత్ర యూనిట్ అంతా చాలా బలంగా నమ్మింది. అయితే ఈ సినిమా మాత్రం ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఓటిటీ లో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాను విపరీతంగా ఆడియన్స్ చూశారు. తెలుగు సినిమా ఫెయిల్డ్ హియర్ అని కొన్ని కామెంట్స్ కూడా వినిపించాయి.
ఇక రీసెంట్ టైమ్స్ లో శ్రీ విష్ణు సినిమాలలో బూతులు వెతకడం మొదలుపెట్టారు చాలామంది నెటిజన్స్. కొంతమంది బూతులు మాట్లాడినా కూడా చాలా అందంగా అనిపిస్తుంది. అందులో శ్రీ విష్ణు కూడా ఒకరు అని చెప్పొచ్చు. సామజవరగమన, బ్రోచేవారెవరురా, స్వాగ్ వంటి సినిమాల్లో చాలావరకు బూతులు మేనేజ్ చేశాడు శ్రీ విష్ణు. మామూలుగా ఎవరైనా బూతులు మాట్లాడితే చాలా ఈజీగా తెలిసిపోతుంది. కానీ శ్రీ విష్ణు విషయంలో మాత్రం పర్టిక్యులర్ గా చూస్తే గాని అర్థమవ్వదు. అయితే చాలామంది అసలు సెన్సార్ కి దొరక్కుండా ఎలా మేనేజ్ చేసావ్ అన్న అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.