EPAPER

Prasanth Varma : ఇదేం స్వార్థం ప్రశాంత్ గారు… మీ కథ అయినంత మాత్రాన మీరే డబ్బులు పెట్టాలా..?

Prasanth Varma : ఇదేం స్వార్థం ప్రశాంత్ గారు… మీ కథ అయినంత మాత్రాన మీరే డబ్బులు పెట్టాలా..?

Prasanth Varma : 2024 సంక్రాంతి వచ్చిన సినిమాల్లో హనుమాన్ సినిమా కూడా ఒకటి.. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేసింది. కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించింది. ఈ సినిమాను యంగ్ టాలెంట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత అతని మార్కెట్ పెరిగింది. డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే పలు సినిమాలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. అటు జై హనుమాన్ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇతను మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమానే మహాకాళి.. టైటిల్ కు తగ్గట్లే ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాగా రాబోతుంది. ఇక డైరెక్టర్ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదని పార్ట్నర్ గా సినిమాను నిర్మిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


ప్రశాంత్ వర్మ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఏవి మంచి టాక్ ను సొంత చేసుకోలేదు.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. కొద్దో గొప్పో అంటే హనుమాన్ సినిమానే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడం మాత్రమే కాదు. దాదాపుగా 400 కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమా తప్ప అతని అకౌంట్ లో సరైన హిట్ సినిమాలు లేవు.. ఆయన చేసిన సినిమాలకు ఎక్కువగా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్లే సపోర్ట్ చేశారు. అలాంటిది ఇప్పుడు ప్రైమ్ షో వాళ్లతో పోటి పడుతూ సినిమా కోసం ఇన్వెస్ట్ చెయ్యడం స్వార్థమనే అంటున్నారు సినీ లవర్స్.

PVCU నుండి 3వ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. మహాకాళి అనే సినిమాను చేస్తున్నారు. ఆర్‌కెడి స్టూడియోస్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆర్‌కె దుగ్గల్ సమర్పిస్తున్నారు. ఆర్ కే డి స్టూడియోస్ మోషన్ పిక్చర్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ మరియు అక్విజిషన్ కంపెనీ, ఈ సినిమాతో నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం చేస్తోంది. అందుకే తన కథకు తానే నిర్మించుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తుంది. కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటుగా పార్ట్నర్ గా కూడా ఉన్నారని టాక్ . దీనిపై సినీ ప్రముఖులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదైన ప్లాన్ ఉందేమో తెలియదు కానీ ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది.


ఇకపోతే ఈ మధ్య కాలంలో డైరెక్టర్స్ సినిమాలకు దర్శకత్వం వహించడం మాత్రమే కాదు.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇటు డైరెక్షన్ అటు ప్రొడక్షన్లోకి కూడా దిగి సినిమాలను నిర్మిస్తున్నారు.. ఇక ఆ లిస్ట్ లోకి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా చేరారని తెలుస్తుంది.

అందులో భాగంగా ఇప్పుడు రాబోయే మహాకాళీ మూవీని నిర్మించబోతున్నారని టాక్. ఈ మూవీకి 25 కోట్ల వరకు ప్రశాంత్ వర్మ ఇన్వెస్ట్ చెయ్యనున్నారని సమాచారం.. మరి ప్రశాంత్ వర్మ ప్లాన్ ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో చూడాలి.. ఇక మహాకాళి కథ బెంగాల్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ఒక పులితో ఒక అమ్మాయి కనిపిస్తుంది.. పులితో స్నేహం అనే కాన్సెఫ్ట్ తో సినిమా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ పోస్టర్ లో గుడిసెలు, బంట్లు, అలాగే భయంతో పారిపోతున్న ప్రజలు, అందులోనే ఓ ఫెరిస్‌ వీల్‌ దగ్ధం అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇది భారతీయ సాంప్రదాయాల ప్రతీకగా నిలిచిన దేవతగా మహాకాళిని చూపిస్తూ, వివక్ష, అంతర్గత బలాన్ని, ఆత్మగౌరవాన్ని సాధించుకునే కథగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను ఐమాక్స్‌ 3డి ఫార్మాట్‌లో విడుదల చెయ్యనున్నారని సమాచారం.. త్వరలోనే ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ను విడుదల చెయ్యనున్నారు..

Related News

OG : డీవీవీ దానయ్య కు విముక్తి, అభిమానులకు పండుగ

Pushpa2 : పుష్ప 2 బిజినెస్ కోసం సుక్కు మాస్టర్ ప్లాన్.. కల్కి రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా..

BB4: పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా..!

Viswam Collections : హీరోగా బుట్ట సర్దే టైమ్ వచ్చింది… విశ్వం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే…?

Nithiin: మళ్లీ ఆ దర్శకుడినే నమ్ముకున్న నితిన్.. హిస్టరీ రిపీట్ అయ్యేనా?

Diwali 2024: దీపావళి బరిలో టైర్ -2 హీరోలు.. టఫ్ ఫైట్ షురూ..!

Big Stories

×