EPAPER

Hi nanna Review : మనసుకు హత్తుకునే ఫీల్ గుడ్ మూవీ.. హాయ్ నాన్న..

Hi nanna Review : మనసుకు హత్తుకునే ఫీల్ గుడ్ మూవీ.. హాయ్ నాన్న..
Hi nanna Review

Hi nanna Review : దసరా వంటి ఊర మాస్ చిత్రాలతో.. ఎంటర్టైన్ చేసినా.. మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఫ్యామిలీ మూవీ తో పలకరించినా.. ప్రతి ఒక్కరిని తన యాక్షన్ తో మెప్పించే టాలెంట్ ఉన్న యాక్టర్ నాని. మరి ఈ న్యాచురల్ స్టార్ సారీ హాయ్ నాన్న మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ మూవీ ఎంతవరకు ప్రేక్షకులను  మెప్పించిందో ఓ లుక్కేద్దాం పదండి..


కథ:

ప్రొఫెషనల్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరాజ్(నాని)కి అతని కూతురు మహి కియారా ఖన్నా అంటే ఎంతో ఇష్టం. పంచ ప్రాణాలుగా భావించే కూతురు ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ.. మృత్యువుతో పోరాటం చేస్తుంది. తన కూతుర్ని కాపాడుకోవడానికి. ఆ తండ్రి పడే తపన అంతా ఇంతా కాదు. ఎంత బిజీగా ఉన్నా కూతురి కోసం కచ్చితంగా టైం కేటాయిస్తాడు ఆ తండ్రి. ఆమెకు కథలు చెబుతూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అయితే తండ్రి చెప్పే ప్రతి కథలో తల్లి పాత్ర ఉండకపోవడం ఆ చిన్నారి మనసుకు ఎందుకో నచ్చదు.


ప్రతి కథలో క్యారెక్టర్స్ ని తలకు నచ్చిన వ్యక్తులతో ఊహించుకోవడం ఆ పాపకు అలవాటు. అయితే ఒక రోజు అమ్మ స్టోరీ చెప్పమని మారాం చేస్తుంది.. స్టడీస్ లో ఫస్ట్ వస్తే కచ్చితంగా అలాగే చెబుతానని మాట మారుస్తాడు విరాజ్. పట్టుదలతో ఆ పాప స్టడీస్ లో ఫస్ట్ వచ్చిన డాడీ అమ్మకు సంబంధించిన స్టోరీ చెప్పకపోవడంతో అలిగి తన పెట్ డాగ్ ని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన పాపకు యాక్సిడెంట్ కాకుండా యష్ణ(మృణాల్‌ ఠాకూర్) కాపాడుతుంది. ఆ తర్వాత యష్ణ ను మాయ తన తండ్రికి పరిచయం చేస్తుంది. ఎంతకీ కూతురు చెప్పిన మాట వినకపోవడంతో ఆ సమయంలో విరాజ్ ఆమెకు మమ్మీ స్టోరీ చెబుతాడు.

మమ్మీ క్యారెక్టర్ లో ఎవరిని ఊహించుకోను అని పాప అడిగినప్పుడు పక్కనే ఉన్న యష్ణ ..నన్ను ఊహించుకో అంటుంది. దీంతో మాయ తన తల్లి క్యారెక్టర్ లో యష్ణ ను ఊహించుకుంటుంది.

విరాజ్ కెరియర్ లో ఎదుగుతూ ఉంటాడు.. అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్న అతని లైఫ్ లోకి యష్ణ ఎంటర్ అవుతుంది. యష్ణ ఇంట్లో వాళ్ళ ప్రేమకు ఒప్పుకోకపోవడంతో ఆమె ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తుంది. అయితే యష్ణ కు మొదటి నుంచి పిల్లలంటే ఇష్టం లేదు. విరాజ్ కోసం ఒప్పుకుంటుంది.. అలా వాళ్లకు మాయ పుడుతుంది. కానీ మాయం పుట్టడంతోటే అనారోగ్య సమస్యలతో పుడుతుంది. ఐసీయూలో బిడ్డను వెంటిలేషన్ పై ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి తట్టుకోలేకపోయినా యష్ణ.. అనవసరంగా ప్రెగ్నెంట్ అయ్యాను అని బాధపడుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి. ఇలా ఉండగా ఒక రోజు అనుకోకుండా కారు ప్రమాదం జరుగుతుంది.

అయితే ఆ తర్వాత ఏం జరిగింది ? విరాజ్ చెప్పిన స్టోరీ ఏమిటి? ఇందులో యష్ణ పాత్ర ఏమిటి? చివరికి కథ ఏమలుపు తిరిగింది ? విరాజ్ కూతురుతో ఒంటరిగా ఎందుకు మిగిలిపోయాడు? ఇంతకీ పాపకు వచ్చిన డిసీజ్ ఏంటి?తెలుసుకోవాలంటే సినిమా చూడండి.

విశ్లేషణ:

ఈ మూవీలో విరాజ్ మహి బాండింగ్.. తండ్రి కూతుర్ల క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం.. ఎంతో ఎమోషనల్ గా మనసుని హత్తుకునే విధంగా ఉంది. హోమ్లీ ఎన్విరాన్మెంట్ తో.. కథ చాలా వేగంగా ఎక్కడ ల్యాగ్ లేకుండా ముందుకు తీసుకువెళ్లడంలో డైరెక్టర్ శౌర్యువ్ ఎంతో నేర్పరితనం కనబరిచాడు. నాని తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తున్నాను భవం ఈ మూవీ చూసినంత సేపు కలుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు నడిచిన డ్రామా.. ఎమోషన్స్ బాగా వర్కౌట్ కావడంతో ఫస్ట్ హాఫ్ మంచి అనుభూతి ఇవ్వడంతో పాటు సెకండ్ హాఫ్ పై అంచనాలు బాగా పెంచుతుంది.

తండ్రి కూతుర్ల సెంటిమెంటుతో ముడిపడ్డ కథ కాబట్టి అక్కడక్కడ నెరేషన్ సాగదీసినట్లుగా.. ఎక్కువ ఎమోషనల్ గా అనిపిస్తుంది. అయితే కొన్ని సీన్స్ వచ్చినప్పుడు మనం తెలియకుండానే ఆ సీన్ కి కనెక్ట్ అవ్వడంతో పాటు భావోద్వేగానికి లోనవుతాము. లాస్ట్ లో జై రాం క్యారెక్టర్ ట్విస్ట్..అంగద్ బేడీ ఎపిసోడ్ సినిమాను మరింత ఎమోషనల్ గా మారుస్తుంది. క్లైమాక్స్లో కచ్చితంగా ప్రతి ఒక్కరు కంటతడి పెడతారు.. అలాగని ఏడుపు సినిమా కాదండోయ్.. అదొక ఫీలింగ్ అంతే. మొత్తానికి సినిమా అయితే మంచి ఎంటర్టైనింగ్ ఫుల్ జోష్ తో ఉంది.తండ్రిగా.. ప్రియుడిగా.. భర్తగా.. ఓ ప్రొఫెషనల్ గా.. మా నాని క్యారెక్టర్ లో వేరియేషన్స్ అద్భుతంగా తెరకెక్కించారు.మృణాల్ ఠాకూర్ నటించిన తీరు ఎంతో అద్భుతంగా ఉంది. ఈ మూవీలో ప్రతి యాక్టర్ తమ పాత్రకు న్యాయం చేశారు.

చివరి మాట:

కుటుంబంతో కలిసి చూడదగిన ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ హాయ్ నాన్న.

Related News

Aay Movie: ఆయ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నామండీ

Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

Faria Abdullah: మన చిట్టిలో ఇంత టాలెంట్ ఉందా.. అదిరిపోయింది బంగారం

Viran Muttemshetty: అల్లు అర్జున్ కజిన్ హీరోగా గిల్ట్.. ఫస్ట్ లుక్ చూశారా..?

Sri Sri Sri Rajavaru: ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విచ్చేస్తున్నారు.. నేషనల్ అవార్డ్ దర్శకుడితో నార్నే నితిన్ సినిమా

Devara Trailer: పండగ సందర్భంగా ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nandamuri Balakrishna: బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో.. జనాలను చంపేద్దామనుకుంటున్నారా.. ?

Big Stories

×