EPAPER

The Goat movie review: గోట్ హిట్ బోట్ ఎక్కిందా? లేదా?.. ఇలాంటి టాక్ ఊహించలేదు

The Goat movie review: గోట్ హిట్ బోట్ ఎక్కిందా? లేదా?.. ఇలాంటి టాక్ ఊహించలేదు

Hero Vijay The Goat movie with average talk ..not completely satisfy the audience: విజయ్ దళపతి అంటే కోలీవుడ్ లో మినిమం గ్యారెంటీ కలెక్షన్స్ రాబట్టే కమర్షియల్ హీరో. రజనీకాంత్ తర్వాత అంతటి ఫాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడు విజయ్. మినిమం యావరేజ్ టాక్ తోనే ఆయన సినిమాలు రూ.200 కోట్లు కొల్లగొడుతూ ఉంటాయి. అయితే సినిమాల పరంగా మంచి ఫామ్ లోనే ఉన్న విజయ్ దళపతి గత కొంతకాలంగా సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి తమిళనాట ప్రజలకు సేవ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇటీవలే తన పార్టీ పేరు, జెండా, ఎజెండాను కూడా ప్రకటించేశారు. ిక రాజకీయాలలోకి శాశ్వితంగా వెళ్లిపోతారు..విజయ్ నటించిన ఆఖరి సినిమా ది గోట్ అని ప్రచారం జరగడంతో ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి హైప్ కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా జరిగాయి. తొలి రోజే వంద కోట్ల కలెక్షన్స్ రావచ్చని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ప్రపంచ వ్యాప్తంగా ది గోట్ మూవీ విడుదల అయింది. అయితే ఈ మూవీ అంచనాలకు తగినట్లు హిట్ అయిందా లేక ఎలాంటి టాక్ తెచ్చుకుందో తెలుసుకుందాం..


విజయ్ డ్యూయెల్ రూల్

ఈ మూవీకి విజయ్ ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమా కథను విజయ్ కు ఎలా చెప్పి ఒప్పించారో తెలియదు గానీ..మూవీ అంతా ఏదో పాత సినిమా చూసిన అనుభూతే కలుగుతుంది ప్రేక్షకులకు. వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్ గా సాగుతాయి. కాకపోతే ఇంటర్వెల్ బ్యాంగ్ గా తీసిన సన్నివేశాలను సెకండాఫ్ లో ఏం జరగబోతోందా అనే ఆసక్తిని రేకెత్తించారు. తెలుగు ప్రేక్షకులకు ఈ మూవీ అంతగా రుచించదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండాఫ్ కొద్దిగా బెటర్ గానే ఉంది. చాలా సన్నివేశాలను బాగా ల్యాగ్ చేశారు. సినిమా లెంగ్త్ బాగా ఎక్కువయింది. దానిని మరింత ట్రిమ్ చేస్తే బాగుండేది. స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పాత్ర విజయ్ కి కొత్తేమీ కాదు. గతంలో తుపాకీ సినిమాలనుంచి చాలానే చేశారు.


కొత్తదనం లేదు

వెంకట్ ప్రభు కొత్తగా ఈ సినిమాలో ఏమీ చూపించలేదు. సాధారణంగా సినిమాలో వచ్చే సన్నివేశాలు, ట్విస్టులు సామాన్య ప్రేక్షకుల ఊహకు అందేవిగా తీయకూడదు. కానీ ఈ మూవీలో తర్వాత వచ్చే సన్నివేశాన్ని మామూలు ప్రేక్షకులు ఈజీగా కనిపెట్టేస్తాడు. కొడుకు పాత్రను విలన్ గా చూపెట్టడం తప్ప ఈ మూవీలో కొత్తదనమేమీ ఉండదు. అయితే ఈ మూవీలో హీరోగా కన్నా విలన్ గానే విజయ్ అలరిస్తాడు. అదొక్కటే ఈ మూవీకి ప్లస్ తప్ప మిగిలిన అంశాలన్నీ పాత చింతకాయ పచ్చడి మాదిరిగా పంటికి తగులుతుంటాయి. అయితే విజయ్ ప్రేక్షకులు మాత్రం ఆయన మేనరిజమ్స్, పంచ్ డైలాగులు బాగా కనెక్టవుతారు అనిపించేలా సన్నివేశాలను తీశారు వెంకట్ ప్రభు.

బడా స్టార్స్ ఉన్నా..

ప్రభుదేవా, ప్రశాంత్ , రంగం విలన్ అజ్మల్ పాత్రలన్నీ తగిన ప్రాధాన్యత లేకుండా పోయాయి. వాళ్లకున్న పరిది మేరకు నటించారు. హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి అందంగానే కనిపించారే తప్ప తగిన ప్రాధాన్యత లేదు. పెద్ద విజయ్ పక్కన నటించిన స్నేహ మెప్పించింది. అయితే ఈ మూవీ ప్రారంభంలో ఏఐ టాక్నాలజీతో దివంగత నటుడు విజయ్ కాంత్ ను చూపించడం బాగుంది. త్రిష ఓ పాటలో తళుక్కుమని మెరిసింది. ఎంఎస్ ధోనికి సంబంధించి ఐపీఎల్ ఫుటేజ్ ని వాడుకున్నారు. మూడు గంటల పాటు సాగదీసిన ఈ సినిమాను రెండు గంటల్లో ముగించవచ్చు. సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కూడా పెద్ద మైనస్ గా మారింది. ఇది కేవలం విజయ్ ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చే మూవీ. తెలుగులో వర్కవుట్ కావడం కష్టమే..

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×