EPAPER

World’s Richest Actor: ప్రపంచంలోనే అత్యంత రిచ్ యాక్టర్ కానీ ఒక్కటే హిట్.. షారుఖ్ కాదు.. ఎవరో తెలుసా?

World’s Richest Actor: ప్రపంచంలోనే అత్యంత రిచ్ యాక్టర్ కానీ ఒక్కటే హిట్.. షారుఖ్ కాదు.. ఎవరో తెలుసా?

World’s Richest Actor: అసలు ప్రపంచంలోనే రిచ్ యాక్టర్ ఎవరు అనగానే ఒక సాధారణ ప్రేక్షకుడికి కొన్ని పేర్లు మాత్రమే గుర్తొస్తాయి. షారుఖ్ ఖాన్, టామ్ క్రూజ్, డ్వెయ్నీ జాన్సన్, జానీ డెప్.. ఇలాంటి వరల్డ్ వైడ్ పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలలోనే ఎవరో ఒకరు వరల్డ్ రిచ్ యాక్టర్ అయ్యింటారని అనుకుంటారు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అసలు వరల్డ్ రిచ్ యాక్టర్ వీరిలో ఒకరు కూడా కాదు. ఒక ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజిన్ చేసిన సర్వేలో ప్రపంచంలోనే రిచ్ యాక్టర్ ఎవరో బయటపెట్టింది. తన పేరే టైలర్ పెర్రీ. ఈ యాక్టర్ గురించి చెప్పాలంటే.. చేసింది తక్కువ సినిమాలే పైగా అందులో ఒక్కటే గుర్తిండిపోయే హిట్.


వేల కోట్ల ఆస్తి

‘మేడ్’ అనే సినిమా ఫ్రాంచైజ్‌లో మేబెల్ మేడ్ సైమాన్స్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు టైలర్ పెర్రీ. ఇప్పటివరకు తను 12 లైవ్ యాక్షన్ సినిమాలు, 11 థియేటర్ ప్లేతో పాటు పలు టీవీ సిరీస్‌లలో కూడా నటించాడు. ఈ నటుడి ఆస్తుల విలువ 1.4 బిలియన్ డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో రూ.11,500 కోట్లు అని సర్వేలో తేలింది. టైలర్ పెర్రీ తర్వాత ప్రపంచంలోనే రిచ్ యాక్టర్ లిస్ట్‌లో టాప్ 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు కామెడియన్ జెర్నీ సైన్ఫీల్డ్. తన ఆస్తుల విలువ 1 బిలియన్ డాలర్లు అని బయటపడింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.8,200 కోట్లు. ఈ లిస్ట్‌లో తర్వాత స్థానంలో డ్వెయ్నీ జాన్సన్.. 890 మిలియన్ డాలర్ల ఆస్తులతో ఉన్నాడు. అంటే రూ.7,320 కోట్లు.


Also Read: ఫెయిల్యూర్ హీరోయిన్ పై ప్రశంసలు.. అసలు కథ ఏంటంటే..?

షారుఖ్ మాత్రమే

హాలీవుడ్ యాక్టర్ల విషయం పక్కన పెడితే.. ఈ లిస్ట్‌లో మొదటి ఇండియన్ యాక్టర్‌గా తన పేరును నమోదు చేయగలిగాడు షారుఖ్ ఖాన్. ఈ బాలీవుడ్ బాద్‌షా ఆస్తుల విలువ 87 మిలియన్ డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీలో రూ.7,160 కోట్లు. షారుఖ్ తర్వాత స్థానంలో హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ఉన్నాడు. తన ఆస్తుల విలువ 800 మిలియన్ డాలర్లు అంటే రూ.6,600 కోట్లు. ఈ లిస్ట్‌లో ఉన్న నటీమణుల పేర్ల విషయానికొస్తే.. జామీ గెర్ట్స్ 8 బిలియన్ డాలర్ల (రూ.66,000 కోట్లు) ఆస్తితో హీరోయిన్స్‌లోనే ముందంజలో ఉంది. తన తర్వాత టైలర్ స్విఫ్ట్, సెలీనా గోమెజ్ కూడా వరల్డ్ రిచ్ యాక్టర్ల లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.

నిర్మాతగా కోట్ల సంపాదన

టైలర్ పెర్రీ విషయానికొస్తే.. తను కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా విజయం సాధించి ఇంత ఆస్తిని సంపాదించుకోగలిగాడు. ‘మేడ్’ ఫ్రాంచైజ్‌కు నిర్మాతగా వ్యవహరించడం వల్ల టైలర్‌కు 320 మిలియన్ డాలర్లు (రూ.2,679 కోట్ల) ఆదాయం వచ్చిందని సమాచారం. తనకంటూ సొంత ప్రొడక్షన్ స్టూడియోను ఏర్పాటు చేసుకొని, దాని ద్వారా కంటెంట్‌ను నిర్మించడం వల్లే టైలర్ ఈ స్థాయికి వెళ్లాడని తెలుస్తోంది. అంతే కాకుండా తనకు పలు మీడియా సంస్థల్లో, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా షేర్స్ ఉన్నాయి. వాటి వల్ల తనకు 60 మిలియన్ డాలర్లు (రూ.500 కోట్ల)కు పైగా ఆదాయం వస్తుంది.

Related News

Nikhil: దీపావళికి కొత్త సినిమాతో వచ్చేస్తున్న యంగ్ హీరో.. మరి ఆ ప్యాన్ ఇండియా మూవీ పరిస్థితి ఏంటి?

Jani Master: జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డ్ ఇవ్వాలి, ఆ అమ్మాయే అలా చెప్పింది.. నిజాలు బయటపెట్టిన కొరియోగ్రాఫర్

Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

Tollywood Actress: బాలీవుడ్ లో సత్తా చాటుతున్న టాలీవుడ్ బ్యూటీస్…

Ranveer Singh: ‘నాన్న’ చైల్డ్ ఆర్టిస్ట్‌ తో రొమాన్స్ చేయనున్న రణవీర్.. ఛిఛీ, సిగ్గుందా?

Rajendra Prasad: అశ్రునయనాల మధ్య ముగిసిన రాజేంద్రప్రసాద్ కూతురి అంత్యక్రియలు.. !

×