EPAPER

Dasara 2024 Movies: వచ్చేవారం థియేటర్లలో విడుదల కానున్న సినిమాలివే.. ఆ మూడు రోజులు సందడే సందడి

Dasara 2024 Movies: వచ్చేవారం థియేటర్లలో విడుదల కానున్న సినిమాలివే.. ఆ మూడు రోజులు సందడే సందడి

Dasara 2024 Movies: అక్టోబర్ నెల ప్రారంభమయినప్పటి నుండి థియేటర్లలో ఫుల్‌గా సందడి మొదలయ్యింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి అరడజనుకుపై చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. ఇక రెండోవారంలో కూడా ఈ సందడి ఏ మాత్రం తగ్గేది లేదని తెలుస్తోంది.


ఫ్యాన్స్ వెయిటింగ్

వచ్చేవారం విడుదల కానున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన మూవీ ‘వేట్టయాన్’. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాను టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేశారు. భారీ క్యాస్టింగ్‌తో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో దీనిపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఇక టీజర్, ట్రైలర్ కూడా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా లాంటి యాక్టర్లను ఒకే స్క్రీన్‌పై చూడడానికి మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 10న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది ‘వేట్టయాన్’.


ఇన్నాళ్లకు రిలీజ్

‘మ్యాడ్’, ‘ఆయ్’.. ఇలా బ్యాక్ టు బ్యాక్ యూత్‌ఫుల్ సినిమాలతో ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు నార్నే నితిన్. ప్రస్తుతం ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాతోనే బిజీగా ఉన్న నితిన్.. మధ్యలో సైలెంట్‌గా మరో మూవీని కూడా పూర్తిచేశాడు. అదే ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. అసలైతే ఇది నార్నే నితిన్ మొదటి సినిమా. కానీ పలు కారణాల వల్ల అప్పట్లో రిలీజ్ ఆగిపోయి.. ఇప్పుడు అక్టోబర్ 10న మిగతా చిత్రాలతో పోటీకి దిగడానికి సిద్ధమయ్యింది. ఈ మూవీ కూడా హిట్ అయితే యూత్‌లో నార్నే నితిన్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది.

భారీ బడ్జెట్

కన్నడ హీరో అయినా కూడా ధృవ్ సర్జాకు తెలుగులో చాలానే క్రేజ్ ఉంది. అందుకే తన తరువాతి సినిమా ‘మార్టిన్’ను కన్నడతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఏపీ అర్జున్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కింది.

హిట్ కావాలి

శ్రీను వైట్ల, గోపీచంద్.. ఈ ఇద్దరికీ ఇప్పుడు హిట్ చాలా అవసరం. తనకు ఎంతో సక్సెస్ ఇచ్చిన కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తున్నా కూడా గోపీచంద్‌కు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులే ఎదురవుతున్నాయి. ఇక శ్రీను వైట్ల విషయంలో కూడా అదే జరుగుతోంది. ఒకప్పుడు తన సినిమాల కోసం ఎదురుచూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు తనది ఔట్‌డేటెట్ కామెడీ అంటున్నారు. అలాంటి ఈ ఇద్దరు ‘విశ్వం’ మూవీతో హిట్ కొట్టడానికి అక్టోబర్ 11న ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నారు.

నాన్న సినిమా

తన ప్రతీ సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడంలో ముందుంటాడు సుధీర్ బాబు. ఇప్పటికే యాక్షన్ హీరోగా, లవర్ బాయ్‌గా ఇలా చాలా పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన సుధీర్.. ఇప్పుడొక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అదే ‘మా నాన్న సూపర్ హీరో’. ఒక మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమయ్యింది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన సత్తా ఏంటో చాటుకున్నాడు సుహాస్. ఎంతమంది ట్రోల్ చేసినా పట్టించుకోకుండా తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు తను నటించిన సినిమాలు చాలామందికి ఫేవరెట్‌గా మారాయి. ఇప్పుడు ‘జనక అయితే గనక’ అనే మరొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. వచ్చేవారంలో అన్ని సినిమాలు విడుదలయిన తర్వాత శనివారం (అక్టోబర్ 12) ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.

Related News

Maa Nanna Super Hero Trailer: కంటే తండ్రి అయిపోరు.. ఎమోషన్‌తో ఏడిపించేసిన సుధీర్ బాబు

Hero Darshan: హీరో దర్శన్ ను పీడిస్తున్న ఆత్మ.. జైలు మార్చండి అంటూ కేకలు..!

Mallika Sherawat: ఆ హీరో అర్ధరాత్రి తలుపు కొట్టడంతో.. ఆ క్షణమే పోయాననిపించింది..!

Khadgam Re-Release: 22 యేళ్ళ తర్వాత రీ రిలీజ్.. శ్రీకాంత్ ఏమన్నారంటే..?

Matka Movie Teaser: మెగా హీరో హిట్ కొట్టినట్టేనా.. టీజర్ తోనే హైప్ ..!

Siva Movie: ‘శివ’ సినిమాకు 35 ఏళ్లు.. ఇది ఒక ఫేమస్ యాక్షన్ చిత్రానికి కాపీ అని మీకు తెలుసా?

Big Stories

×