EPAPER
Kirrak Couples Episode 1

Heartbreaks:- ప్రేమలో ప్రతీ అంశం మధురం.. హార్ట్ బ్రేక్ కూడా..

Heartbreaks:- ప్రేమలో ప్రతీ అంశం మధురం.. హార్ట్ బ్రేక్ కూడా..

Heartbreaks:- అసలు ప్రేమ అంటే ఏంటి..? ఇది చాలామందికి వచ్చే కామన్ డౌట్. ఈ ప్రశ్నకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సమాధానం ఉంది. ప్రేమ అంటే నమ్మకం అని కొందరు. ప్రేమ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అని కొందరు. ప్రేమ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కలిసుండడం అని కొందరు.. అలా ఎలా ఉంటుంది.. అసలు ప్రేమ అనేదే లేదు అని మరికొందరి వాదన. కానీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఏమీ పట్టించుకోకుండా ప్రేమికులు.. తమకోసం ఏర్పడిన ఈ వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.


ఈ ప్రపంచంలో కంటితో చూడకపోయినా.. కేవలం అనుభూతితో నమ్మగలిగే ఫీలింగ్స్ చాలానే ఉన్నాయి. అందులో ప్రేమ కూడా ఒకటి. ప్రేమ అనేది అనుభూతి మాత్రమే కాదు.. అనుభవం కూడా ఇస్తుంది అని కొందరు అంటుంటారు. ఒక్కొక్కసారి ఆ అనుభవం అనేది పెళ్లితో జీవితాంతం ప్రయాణంగా మారుతుంది. ఒక్కొక్కసారి అది హార్ట్ బ్రేక్‌గా మారి మరొకసారి ప్రేమను నమ్మకూడదనే అనుభవాన్ని ఇస్తుంది. ఈ రెండు కూడా ప్రేమలో ఉన్నవారి జీవితాలను మలుపు తిప్పే విషయాలే..!

ప్రేమ ప్రయాణం సాఫీగా సాగిపోతున్న సమయంలో.. జీవితాంతం కలిసి ఉండగలమా? లేదా? అని ఆలోచించవలసిన రోజు వస్తుంది. కలిసుండాలంటే పెళ్లి చేసుకోవాలి. అది జరగకపోతే ఇష్టం లేకపోయినా విడిపోవాలి. ప్రేమ అనేది ఇద్దరి మనుషుల మధ్య ఇష్టంపై ముడిపడింది. కానీ పెళ్లి అలా కాదు.. చాలావరకు కుటుంబాలు అనేవి ప్రేమజంటలను పెళ్లితో కలపడానికి నిరాకరిస్తారు. దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ జీవితాంతం కలిసుండాలి అనుకునే జంటలు పెళ్లిపీటలు ఎక్కలేకపోవడం హార్ట్ బ్రేక్‌కు కారణమవుతుంది. అది వారి జీవితాల్లో మరో అధ్యాయానికి దారితీస్తుంది.


ప్రేమ అనేది ఎంత పవర్‌ఫుల్లో.. హార్ట్ బ్రేక్ కూడా అంతే పవర్‌ఫుల్. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది అంటుంటారు. అలాగే ప్రేమికుల జీవితాలు కూడా అనుకోని మలుపు తిరిగి వారు విడిపోయే పరిస్థితి ఏర్పడి హార్ట్ బ్రేక్‌కు దారితీయవచ్చు. ఒక్కసారిగా వారు కన్న కలలన్నీ నిజం కాలేవు అని తెలిసిన తర్వాత వచ్చే హార్ట్ బ్రేక్ మాటల్లో చెప్పలేనంత బాధాకరంగా ఉంటుంది అంటారు ప్రేమికులు. కానీ ఈ హార్ట్ బ్రేక్‌నే స్ఫూర్తిగా తీసుకొని సక్సెస్ అయినవారు కూడా ఉన్నారు. అలా కాకుండా జీవితాన్ని అక్కడే ఆపేసిన వారు కూడా ఉన్నారు. ఒక ప్రేమలో ఓడిపోయినా.. మరొక ప్రేమ మనకోసం ఎదురుచూస్తుంది అని నమ్మి ముందుకు వెళ్లేవారు కూడా ఉన్నారు.

Tags

Related News

Jr NTR vs Ram Charan : గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే ఇదే మరి… తారక్ పై ఈజీగా గెలిచాడు..

Devara 4 Days Collections : సునామీ సృష్టిస్తున్న దేవర.. 4 రోజులకు ఎన్ని కోట్లంటే?

Rajinikanth : రజినీకాంత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..

Rajinikanth: అర్థరాత్రి ఆసుపత్రికి రజనీకాంత్, ఏమైంది?

Simbu : నిధి అగర్వాల్ తో శింబు పెళ్లి.. అసలు మ్యాటరేంటంటే?

Top OTT Platform : టాలీవుడ్ లో భారీ స్కాం… ఇక ఇండస్ట్రీలో ఈ ఓటీటీ దూరం .. అవ్వనుందా ?

Madhoo Bala: సీనియర్ నటి మధుబాల కూతుళ్లను చూశారా.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే

Big Stories

×