EPAPER

Dunki drop 3 : మనసుకు హత్తుకునే ఎమోషనల్ సాంగ్..‘డంకీ’ డ్రాప్ 3..

Dunki drop 3 : మనసుకు హత్తుకునే ఎమోషనల్ సాంగ్..‘డంకీ’ డ్రాప్ 3..

Dunki drop 3 : ఇప్పటివరకు టాలీవుడ్ పై తమిళ్, మలయాళం చిత్రాల తాకిడి ఎక్కువగా ఉండేది. అయితే ప్రస్తుతం హిందీ సినిమాలు కూడా తెలుగు మార్కెట్ పై బాగా కన్ను వేశాయి. రీసెంట్ గా విడుదలైన షారుఖ్ ఖాన్ పఠాన్,జవాన్ మూవీస్.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. దీంతో ప్రస్తుతం హిందీ సినీ ఇండస్ట్రీ మన మార్కెట్ ని కబ్జా చేయడానికి తెగ ట్రై చేస్తుంది. అందుకే సలార్ వస్తున్న ఏమాత్రం తగ్గకుండా షారుక్ ‘డంకీ’ తో రెడీ అంటున్నాడు.


బాలీవుడ్ లో అపజయం ఎరుగని డైరెక్టర్ గా పేరు పొందిన హిరానీ.. కింగ్ ఖాన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.డిసెంబర్ 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు ఈ మూవీ రెడీ గా ఉంది. పైగా షారుక్ వరుసగా రెండు విజయాలతో దూసుకుపోతున్నాడు ..ఇది అతనికి హ్యాట్రిక్ విజయం అందించే మూవీ అవుతుందని అందరూ భావిస్తున్నారు. రీసెంట్ గా మూవీ నుంచి విడుదలైన టీజర్ మంచి ప్రామిసింగ్ గా ఉండడంతో చిత్రం పై అంచనాలు బలంగానే ఉన్నాయి.

ఇప్పటికే డ్రాప్ 1, డ్రాప్ 2 అంటూ విడుదల చేసిన పాటలు ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫారిన్ కి వెళ్లి స్థిరపడాలి అనే మిడిల్ క్లాస్ మనస్తత్వాలు కలిగిన యువత కనే కలలు.. వాళ్లని ఎలా అగాధంలోకి నెడతాయి.. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు.. అనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం ట్రైలర్ ,సాంగ్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి ఈరోజు విడుదల చేసిన డ్రాప్ 3 మూవీపై హైప్ మరింత పెంచుతుంది.


‘నిక్లే తే కభీ హమ్ ఘర్ సే’ అంటూ సాగే ఈ సాంగ్ ను డ్రాప్ 3 అంటూ విడుదల చేశారు.ఈ సాంగ్ ను ప్రీతమ్ చక్రవర్తి కంపోజ్ చేయగా..సోను నిగమ్ తన గాత్రం తో పాటకు ప్రాణం పోశాడు.హిరానీ మూవీస్ అంటేనే ఎమోషన్ ని వెపన్ లాగా వాడుతాయి.. హిరాని స్టైల్ కు తగ్గట్టుగానే ఈ పాట డిజైన్ అయినట్లు తెలుస్తోంది. ఈ పాట లోని జావేద్ అక్తర్ అందించిన లిరిక్స్ అవతల వాళ్ళ హృదయాలను తట్టి లేపే విధంగా ఉన్నాయి. ఇంటి నుంచి దూరంగా ఉంటూ.. ఇంటిని.. తమ స్నేహితులను.. ఎంతగా మిస్ అవుతున్నాము అన్న విషయాన్ని ఈ పాటలో ప్రతి పదం హైలైట్ చేస్తుంది.

ఉద్యోగం కోసం.. చదువు కోసం.. కుటుంబాలను వదిలి వలస వెళ్లే ఎందరో వ్యక్తుల మనసులకు ఈ పాట హత్తుకునే విధంగా ఉంది. షారుక్ ఈ పాట గురించి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ క్యాప్షన్ కూడా షేర్ చేశాడు. ఈ పాట వింటే ఎవరికైనా ఇల్లు గుర్తుకు వస్తుందట.. మన దేశం బడిలో ఒక రకమైన హాయి ఉంటుంది.. అందుకే మనం మన వాళ్ళ నుంచి ,మన ఊరు నుంచి ఎంత దూరం పోయినా.. మనసు ఇక్కడే ఉంటుంది..డంకీలో ఈ సాంగ్ నా ఫేవరెట్.. అంటూ షారుక్ పేర్కొన్నాడు.

.

.

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×