EPAPER

Jai Hanuman: ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ విడుదల.. పీవీసీయూలోకి ‘కాంతార’ నటుడు

Jai Hanuman: ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ విడుదల.. పీవీసీయూలోకి ‘కాంతార’ నటుడు

Jai Hanuman First Look: మామూలుగా ఫారిన్ భాషల్లో సినిమాటిక్ యూనివర్స్‌లు అనేవి చాలా ఫేమస్. కానీ ఇండియన్ భాషల్లో వీటికి ఇంకా సరిపడా క్రేజ్ రాలేదు. ఒకవేళ అలాంటి సినిమాటిక్ యూనివర్స్ లాంటివి ఏమైనా ప్రారంభించినా కూడా అందులో ప్రతీ సినిమా హిట్ అవ్వాలి లేకపోతే ఆ యూనివర్స్ అక్కడితో ఆగిపోతుంది. ఇవన్నీ తెలిసినా కూడా ఒక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో రిస్క్ తీసుకోవడానికి ముందుకొచ్చాడు. తనే ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ అనే మూవీతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ను ప్రారంభించి ఇప్పుడు ‘జై హనుమాన్’తో దానిని ముందుకు నడిపిస్తున్నాడు. తాజాగా ‘జై హనుమాన్’ (Jai Hanuman)కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయ్యింది.


చివరి సినిమా

‘హనుమాన్’ హిట్ అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి మరెన్నో సినిమాలు వస్తాయని ముందుగానే మాటిచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్. అనుకున్నట్టుగానే ఇప్పటికీ ఈ యూనివర్స్ నుండి అయిదు సినిమాలను అనౌన్స్ చేశాడు. అవి కాకుండా ‘జై హనుమాన్’ కూడా ఉంది. అయితే ‘హనుమాన్’ తర్వాత ‘జై హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తాడనుకుంటే మధ్యలో చాలానే ట్విస్టులు ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ‘జై హనుమాన్’ అనేది తన సినిమాటిక్ యూనివర్స్‌లో 7వ సినిమా అని తెలుస్తోంది. అంటే దానికంటే ముందు తను మరో అయిదు సినిమాలు పూర్తి చేయాలి ప్రశాంత్. ఈ మూవీకి ఇంకా చాలా సమయం ఉన్నా కూడా ఇప్పుడే దీని ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం విశేషం.


Also Read: ’జై హనుమాన్’ 7వ మూవీనా? ఈ కన్ఫ్యూజ్ ఏంటి మాస్టారు.. ఆ రెండిటి పరిస్థితి ఏంటి?

ఇప్పటికి క్లారిటీ

‘హనుమాన్’ సినిమా విడుదలకు ముందు అసలు ఇందులో హనుమంతుడి పాత్రలో నటించేది ఎవరు అనే ఆసక్తిని అందరిలో క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). అయితే ముందుగానే ఇందులో హనుమంతుడి పాత్ర ఎవరూ చేయడం లేదని, ఆ పాత్రను సీజీలో చేశామని క్లారిటీ ఇచ్చేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి రానున్న ‘జై హనుమాన్’లో ఈ క్యారెక్టర్‌ను రివీల్ చేస్తామన్నారు. అనుకున్నట్టుగానే ‘జై హనుమాన్’లో శాండిల్‌వుడ్ స్టార్ రిషబ్ శెట్టిని హనమంతుడిగా పరిచయం చేశారు. ఈ పాత్ర ఆయనకు సరిగ్గా సరిపోయిందని ఫస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

కన్నడ స్టార్

తేజ సజ్జాతో తెరకెక్కించిన ‘హనుమాన్’ విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ అవ్వగానే ‘జై హనుమాన్’ షూటింగ్ కోసం లొకేషన్ల వేట మొదలుపెట్టాడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీలో కూడా తేజ సజ్జానే హీరోగా నటిస్తాడని అందరూ అనుకున్నా కూడా మెల్లగా ఆ స్థానంలోకి మరో హీరో వచ్చే అవకాశం ఉందని టాక్ మొదలయ్యింది. కొన్నాళ్ల క్రితం కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty).. ‘జై హనుమాన్’లో హీరోగా నటించడానికి ఫిక్స్ అయినట్టు సమాచారం బయటికొచ్చింది. అనుకున్నట్టుగానే ఆయనతోనే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఈ సినిమాపై వస్తున్న రూమర్స్‌పై రియాక్ట్ అవ్వకుండా తన పనిలో బిజీ అయ్యాడు.

Related News

Yvs Chowdary : మెయిన్ ట్రాక్ లో రావడానికి నందమూరి ఫ్యామిలీని ఉపయోగించుకుంటున్నారా.?

Bagheera Twitter Review : ‘భగీరా’ ట్విట్టర్ రివ్యూ.. సైకో కిల్లర్ గా ప్రభుదేవా..?

Amaran Twitter Review : ‘అమరన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టేనా?

Lucky Baskhar Movie Review : ‘లక్కీ భాస్కర్’ మూవీ రివ్యూ

Ka Movie Review : ‘క’ మూవీ రివ్యూ

Vettaiyan The Hunter: వెట్టయాన్.. మనసిలాయో వీడియో సాంగ్ వచ్చేసింది..

Nayanthara: నయన్ రీల్ కూతురును చూశారా.. ఎంత అందంగా మారిందో..

×