EPAPER

Harsha Sai: దేశం విడిచి పారిపోయిన హర్ష సాయి.. అక్కడి నుండే అవన్నీ మ్యానేజ్

Harsha Sai: దేశం విడిచి పారిపోయిన హర్ష సాయి.. అక్కడి నుండే అవన్నీ మ్యానేజ్

Harsha Sai Case: ఒక అమ్మాయిపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలపై యూట్యూబర్ హర్ష సాయిపై కేసులు నమోదయ్యాయి. అప్పటినుండి అసలు హర్ష సాయి ఎక్కడ ఉన్నాడని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటివరకు అసలు తను ఎక్కడ ఉన్నాడనే విషయం బయటికి రాలేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా హర్ష సాయి గురించి గాలిస్తున్నా తనకు సంబంధించి ఏ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. దీంతో అడ్వకేట్ నాగుర్ బాబు.. దీనిపై మీడియాతో మాట్లాడారు. హర్ష సాయి దేశం విడిచి పారిపోయాడని ఆయన తెలిపారు. ఇండియాలో లేకపోయినా విదేశాల నుండే వ్యవహారాలు అన్నీ నడుపుతున్నాడని షాకింగ్ విషయాలు బయటపెట్టారు.


పీఆర్ టీమ్ సపోర్ట్

ప్రస్తుతం హైకోర్టులో హర్ష సాయి కేసుపై విచారణ కొనసాగుతోంది. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన మొదట్లో.. తాను ఏ తప్పు చేయలేదని, న్యాయం కోసం పోరాడతానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు హర్ష సాయి. అప్పటినుండి తను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేడు. దీంతో హర్ష సాయి దేశం విడిచి వెళ్లిపోయాడని అడ్వకేట్ నాగుర్ బాబు ప్రకటించారు. ఈ కేసు గురించి సోషల్ మీడియాలో ఎన్నో అపోహలు వినిపిస్తున్నాయని అన్నారు. కానీ మెగా అనే సినిమా రైట్స్ కోసమే హర్ష సాయి.. బాధితురాలపై అఘాయిత్యం చేశాడని కన్ఫర్మ్ చేశారు. తనకు పెద్ద పీఆర్ టీమ్ ఉండడంతో వారి ద్వారానే అందరినీ మ్యానేజ్ చేస్తున్నాడని తెలిపారు.


Also Read: హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ… అవన్నీ రూమర్లేనా?

హైకోర్టు సీరియస్

సోషల్ మీడియాలో హర్ష సాయి ఒక పెద్ద బెట్టింగ్ మాఫియానే మెయింటేయిన్ చేస్తున్నాడు. ఆ బెట్టింగ్ మాఫియాను ఆధారాలతో సహా బయటికి తీసుకొచ్చామని అడ్వకేట్ నాగుర్ బాబు స్పష్టం చేశారు. హర్ష సాయి మీడియా సంస్థల మీద కేసులు వేస్తాడంటూ వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారాలే అని కొట్టిపారేశారు. అసలు ఈ కేసులో బాధితురాలు ఎవరు అనే విషయాన్ని హర్ష సాయి బయటపెట్టాడని, అంతే కాకుండా ఇప్పటికీ సోషల్ మీడియాలో తన ఆడియోలు, వీడియోలు లీక్ అయ్యేలా చేసి బాధితురాలిని ఇబ్బంది పెడుతున్నాడని అన్నారు. దీంతో బాధితురాలు మానసిక క్షోభకు గురవుతుందని వాపోయారు. ఈ విషయంపై హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది.

అక్కడే మొదలు

సోషల్ మీడియాలో బాధితురాలికి సంబంధించిన పోస్టులు అన్నీ తీసేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ప్రస్తుతం హర్ష సాయి కేసులో బాధితురాలి పేరును రివీల్ చేస్తూ, తన గురించి నెగిటివ్‌గా మాట్లాడుతూ కొన్ని సోషల్ మీడియా పేజీలు ట్రోల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వీటిపై ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. ఇక ఈ కేసులో మరిన్ని వివరాల విషయానికొస్తే.. హర్ష సాయి తండ్రి బాలచందర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ ఏదీ నమోదు చేయలేదు. అయినా ముందస్తు బెయిల్ పిటీషన్‌ను దాఖలు చేయడంతో హైకోర్టు ఆ పిటీషన్‌ను కొట్టిపారేసింది. ఇదంతా మెగా సినిమా దగ్గరే ప్రారంభమయ్యింది. అందులో ఒక స్పెషల్ సాంగ్ చేయాలంటూ బాధితురాలిని అప్రోచ్ అయ్యి, ఆ తర్వాత తనపై అఘాయిత్యం చేశాడు హర్ష సాయి.

Related News

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Posani: ఎన్ – కన్వెన్షన్ కూల్చడం కరెక్టే.. పోసాని షాకింగ్ కామెంట్..!

Posani Krishna Murali: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు, అమ్మాయిలు ఒప్పుకోరు.. పోసాని కృష్ణ‌ముర‌ళి కామెంట్స్

Maa Nanna Super Hero Trailer: కంటే తండ్రి అయిపోరు.. ఎమోషన్‌తో ఏడిపించేసిన సుధీర్ బాబు

Hero Darshan: హీరో దర్శన్ ను పీడిస్తున్న ఆత్మ.. జైలు మార్చండి అంటూ కేకలు..!

Mallika Sherawat: ఆ హీరో అర్ధరాత్రి తలుపు కొట్టడంతో.. ఆ క్షణమే పోయాననిపించింది..!

×