EPAPER

Harish Shankar: పవన్ కళ్యాణ్ ను పగులకొట్టారు.. ఇప్పుడు ఆయన పదునుని చూస్తారు

Harish Shankar: పవన్ కళ్యాణ్ ను పగులకొట్టారు.. ఇప్పుడు ఆయన పదునుని చూస్తారు

Harish Shankar: డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య హరీష్ పేరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. దానికి కారణం .. ఆయన ఇంటర్వ్యూలో చేసే వ్యాఖ్యలే. ఇక ఈ మధ్యనే మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హరీష్ శంకర్. ఈ సినిమాపై ఆయన పెంచిన హైప్ కు.. సినిమాకు ఎలాంటి సంబంధం లేదని ఫ్యాన్స్ తేల్చి పడేశారు. రవితేజ అసలు ఇలాంటి సినిమాలు ఎలా ఒప్పుకుంటున్నావ్ అంటూ ఆయన ఫ్యాన్స్.. లెటర్స్ రాసి మరీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. హరీష్ పై నెగెటివిటీ ఎక్కువ అవుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వీటికి ఆన్సర్ ఇచ్చాడు.


పీపుల్ మీడియా బ్యానర్ నిర్మిస్తున్న షో దావత్ కు గెస్ట్ గా వచ్చిన హరీష్ తన మనసులోని మాటలను చెప్పుకొచ్చాడు. ” కొంతమంది సోషల్ మీడియా నుంచి వెళ్ళిపో.. దాక్కో.. విపరీతమైన నెగెటివిటీ ఉంది అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి. నాకు తెల్సింది ఇండస్ట్రీ మాత్రమే. నన్నెవ్వరు ఇక్కడకు బలవంతంగా తీసుకురాలేదు. ఇక సినిమాలో భాగ్యశ్రీ పాకెట్ స్టెప్ ను ట్రోల్ చేస్తున్నారు. టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటివి పెట్టండి. తప్పులేదు. మీరేం కొత్తవి పెట్టడం లేదు.. సినిమాలివే పెడుతున్నారు.. ఆ మూమెంట్ పిక్ తీసి పెడుతున్నారు.

మన ఆడియెన్స్ ఎలా అంటారు అంటే.. కట్నం తీసుకొని కాపురం చేస్తే మగాడు వ్యభిచారం చేసినట్టే అనేది పెడితే అది వారికి పట్టదు.. నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను. నేను టైమ్ ను నమ్మను టైమింగ్ ను నమ్ముతాను. నాకు తిక్క ఉంది.. దానికో లెక్క ఉంది. ఇలాంటివే పట్టుకుంటారు. మరి ఆ పాయింట్ గురించి ఎందుకు మాట్లాడరు. ఆ స్టెప్ శేఖర్ మాస్టర్ చేసాడని నిండా ఆయన మీద వెయ్యలేను. సినిమాలో మంచి చెడు అంతా హరీష్ శంకర్ దే. దానికి బాధ్యత నాదే” అని చెప్పుకొచ్చాడు.


ఇక పవన్ కళ్యాణ్ గురించి హరీష్ మాట్లాడుతూ.. ” భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ పెట్టినప్పుడు పవన్ కు బాగా నచ్చింది. భవదీయుడులో ఒక వినయం ఉంది.. భగత్ సింగ్ లో ఒక విస్ఫోటనం ఉంది. రెండు కలిపి పెడితే అదిరిపోతోంది అని చెప్పారు. అయితే ఆ సినిమా టైటిల్ తరువాత ఆ తెలుగు కొంతమందికి అర్థంకాలేదు.

గాజు పగిలేకొద్దీ పదునెక్కింది అనే డైలాగ్ గురించి మాట్లాడాలంటే.. పవన్ వైవాహిక జీవితం అవ్వొచ్చు.. ఏదైనా.. అలాంటి వ్యక్తిని పగుల కొట్టారు.. ఇప్పుడు దాని తాలూకూ పదునెంటో చూస్తారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మిస్టర్ బచ్చన్ తో పరాజయాన్ని అందుకున్న హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×