Hanu Raghavapudi : ఒకప్పుడు లవ్ స్టోరీస్ అంటే మణిరత్నం (Mani Ratnam) అద్భుతంగా తెరకెక్కిస్తారు అంటూ మంచి పేరును సాధించాడు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ కూడా అద్భుతంగా లవ్ స్టోరీస్ తీస్తాడు అని పేరు సాధించాడు. ఇక తెలుగులో లవ్ స్టోరీస్ ని అద్భుతంగా డీల్ చేయగల దర్శకుడు ఎవరు అంటే హను రాఘవపూడి అని చెప్పొచ్చు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను. ఒక సినిమాను పొయిటిక్ వే ఎలా చూపించొచ్చు అని మొదటి సినిమాతోనే నిరూపించాడు. అయితే ఈ దర్శకుడు పైన మణిరత్నం ప్రభావం ఉంది అని అప్పట్లోనే చాలామంది కామెంట్స్ కూడా చేశారు.
Also Read : Telugu Industry Directors : అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లే ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్లు
కాకపోతే హను మాటల్లో చెప్పాలి అంటే మణిరత్నం కంటే కూడా చాలామంది తెలుగు దర్శకుల ప్రభావం హను రాఘవపూడి మీద ఉంది. కె విశ్వనాథ్, బాపు వంటి దర్శకులు ప్రభావం హను మీద ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా విశ్వనాధ్ బాపు వంటి దర్శకులు సినిమాలలో హీరోయిన్ ని చాలా అందంగా చూపిస్తారు. ఆ సినిమాలలో హీరోయిన్లు ను చూసినప్పుడు ఒక నిండైన తెలుగుదనం కనిపిస్తుంది. ఈ రోజుల్లో అలా హీరోయిన్ చూపించే ఏకైక దర్శకుడు హను అని చెప్పాలి. ఇప్పటివరకు హను చేసిన సినిమాలలో కేవలం ప్రేమకథా చిత్రాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో ఫౌజి ( వర్కింగ్ టైటిల్) అనే సినిమాను చేస్తున్నాడు హను. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాతో హను మంచి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read : Dil Raju about Naga Vamshi: ఒకప్పటి నన్ను నేను, నాగవంశీ లో వెతుక్కుంటున్నా
సీతారామం (Sita Ramam) సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగులో చేసిన సినిమా లక్కీ భాస్కర్ (Lucky Bhasker) ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ కు హాజరయ్యాడు హను రాఘవపూడి. అయితే ఈ సినిమాను చూసిన హను ఫ్యామిలీ మెంబర్స్ అరగంట సేపు ఈ సినిమా గురించి మాట్లాడారు అంట. హను వాళ్ళ అమ్మతోపాటు అమ్మమ్మ గారు కూడా సినిమా చూసి, ఎప్పుడు లవ్ స్టోరీస్ మాత్రమే కాకుండా లక్కీ భాస్కర్ లాంటి పనికొచ్చే సినిమాలు ఎప్పుడు తీస్తావ్ అంటూ ప్రశ్నించారంట. ఇదే విషయాన్ని హను ప్రస్తావిస్తూ ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్ అంటూ చిత్ర యూనిట్ కి తెలిపాడు.హను రాఘవపూడి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్లు లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు తీస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు తీసే దర్శకులు కరువైపోతారు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రాపర్ లవ్ స్టోరీ తీసే దర్శకులు ఒకరు కూడా లేరు అనేది వాస్తవం.