EPAPER

Hanuman Review: “హను-మాన్” తేజ సజ్జా ను సూపర్ హీరోను చేసిందా ?

Hanuman Review: “హను-మాన్” తేజ సజ్జా ను సూపర్ హీరోను చేసిందా ?

Hanuman Review: సాధారణ రోజుల్లో విడుదలయ్యే చిత్రాలకంటే.. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు కాస్త క్రేజ్ ఎక్కువ. ఏ సినిమా సంక్రాంతి పందెంలో గెలుస్తుందో చూడాలని ఆయా హీరోల అభిమానులు ఎదురుచూస్తుంటారు. ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ లో అగ్రహీరోల సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ సంక్రాంతికి కూడా మహేష్, నాగార్జున, వెంకటేష్ సినిమాలు క్యూ కట్టగా.. అగ్రహీరోలతో యువహీరో తేజ సజ్జా “హను-మాన్”తో వచ్చాడు. టీజర్ విడుదలైంది మొదలు.. సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తేజ సజ్జాను సూపర్ హీరోను చేసిందో లేదో చూద్దాం.


సినిమా – హను-మాన్

నటీనటులు – తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు


సంగీతం – అనుదీప్ దేవ్, గౌరా హరి, కృష్ణ సౌరభ్

సినిమాటోగ్రఫీ – దాశరథి శివేంద్ర

ఎడిటింగ్ – సాయిబాబు తలారి

నిర్మాత – నిరంజన్ రెడ్డి

రచన, దర్శకత్వం – ప్రశాంత్ వర్మ

విడుదల తేదీ – 12.01.2024

కథ

మైఖేల్ (వినయ్ రాయ్) సౌరాష్ట్రలో ఉంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలన్న బలమైన కోరిక ఉంటుంది. తన కోరికకు తల్లిదండ్రులు అడ్డొస్తున్నారని వారిని చిన్నతనంలోనే మట్టుపెడతాడు. ఆ తర్వాత సూపర్ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తాడు. కానీ.. చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. దాంతో అసలు సిసలు సూపర్ పవర్స్ కనిపెట్టేందుకు వేట మొదలుపెడతాడు. కట్ చేస్తే.. స్టోరీ అంజనాద్రికి మారుతుంది. పాలెగాడు గజపతి (దీపక్ శెట్టి) అకృత్యాల మధ్య నలిగిపోతున్న మారుమూల పల్లెటూరు అంజనాద్రి.

గజపతిని ఎదిరించిన వారిని ఊరిమధ్యలోనే కుస్తీ పోటీల్లో మట్టుపెడుతుంటాడు. ఊరిలోనే చిల్లర దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు హనుమంతు (Teja Sajja). తల్లిదండ్రులు లేకపోవడంతో అక్క అంజమ్మే (Varalakshmi Sarath Kumar) అతడిని పెంచి పెద్ద చేస్తుంది. హనుమంతుకు మీనాక్షి (Amrutha Ayyar) అంటే చచ్చేంత ప్రేమ. ఒక రోజు ఆమె గజపతికి ఎదురు మాట్లాడటంతో.. తన ముఠాతో ఆమెపై దాడి చేయిస్తాడు. ఆ దాడి నుంచి మీనాక్షిని రక్షించాలని వెళ్లిన హనుమంతు తీవ్రంగా గాయపడతాడు. బందిపోటు ముఠా అతడిని నీళ్లలో పడేయటంతో.. అతనికి ఆంజనేయస్వామి రక్తబిందువుతో రూపొందిన రుధిరమణి దొరుకుతుంది.

ఆ రుధిరమణిని తీసుకున్న హనుమంతు జీవితం.. ఊహించని విధంగా మారుతుంది. ఆ మణి ద్వారా ఆంజనేయుడి శక్తులు పొంది హనుమ్యాన్ గా మారతాడు హనుమంతు. ఆ తర్వాత ఏమైంది ? శక్తులతో అతనుచేసిన సాహసాలేంటి ? హనుమంతు దగ్గరున్న రుధిరమణిని చేజిక్కించుకునేందుకు మైఖేల్ ఏం చేశాడు ? అతని నుంచి అంజనాద్రికి ఏర్పడిన ముప్పును హనుమంతు ఎలా తొలగించాడు ? ఈ క్రమంలో విభీషణుడు (Samudrakhani) హనుమ్యాన్ కు ఎలా సహాయపడ్డాడు ? వంటి విషయాలు తెలియాలంటే తెరపై సినిమా చూసేయండి.

ఎలా ఉంది ?

సామాన్యుడికి అతీతమైన శక్తులు వస్తే.. అతను ఏం చేస్తాడు ? సూపర్ హీరో అవ్వాలని విలన్ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ప్రజల ప్రాణాలకు ముప్పు వచ్చిన ముప్పు, ఆ ముప్పు నుంచి హీరో కాపాడటం.. సూపర్ హీరో చిత్రాలన్నీ ఇలాంటి కథతోనే సాగుతాయి. హను-మాన్ కూడా అలాంటి కథే. కాకపోతే.. సినిమాకు ఇతిహాసాలను జతచేసి, నేటివిటీ మిస్ అవ్వకుండా, వీఎఫ్ఎక్స్ తో ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులకు నచ్చుతుంది.

కథలో కీలకమైన రుధిరమణి గురించి వివరిస్తారు. ఆ తర్వాత విలన్ చిన్ననాటి ఎపిసోడ్ చూపించి.. సినిమాను ఇంట్రస్టింగ్ గా స్టార్ట్ చేశారు. విలన్ నేపథ్యం, అంజనాద్రి ఊరు, అక్కడి ప్రజలు.. అన్నీ ఆకట్టుకుంటాయి. హనుమంతుకు పవర్స్ వచ్చినప్పటి నుంచి కథ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా పరుగులు పెడుతుంది. స్కూల్లో వచ్చే ఫైట్ సీన్స్ నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్.. ప్రేక్షకులకు కిక్కిస్తుంది.

ఎవరెలా చేశారు ?

హనుమంతు పాత్రలో తేజ సజ్జా సాధారణ కుర్రాడిలా ఒదిగిపోయాడనే చెప్పాలి. సూపర్ పవర్స్ వచ్చాక అతను చేసే సందడి.. ప్రేక్షకులను అలరిస్తుంది. యాక్షన్ లో, ఎమోషన్స్ లోనూ.. తేజ పరిధిమేరకు నటించాడు. పల్లెటూరి అమ్మాయిగా అమృత అయ్యర్ అందంగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర సెకండాఫ్ లో సర్ ప్రైజ్ చేస్తుంది. వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్ మాస్టర్ తదితరుల పాత్రలు ప్రేక్షకులను నవ్విస్తాయి. సూపర్ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి.. ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించడంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యారు. స్టార్టింగ్ స్టోరీ కాస్త స్లోగా ఉన్నా.. ముందుకు సాగే కొద్దీ ఆసక్తిగా మారుతుంది. బడ్జెట్ పరిధిలో గ్రాఫిక్స్ క్వాలిటీ ఫిల్మ్ ను చూపించారు.

ప్లస్ పాయింట్స్

కథ
తేజ సజ్జా నటన
గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్

అక్కడక్కడా నెమ్మదిగా సాగే కొన్ని సీన్స్

చివరిగా.. హను-మాన్.. సంక్రాంతికి కుటుంబ సమేతంగా చూడొచ్చు.

Related News

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Big Stories

×