EPAPER

Prasanth Varma : ఏంటి .. ప్రశాంత్ వర్మ కు తెలుగులో హీరోలు కనిపించలేదా ?

Prasanth Varma : ఏంటి .. ప్రశాంత్ వర్మ కు తెలుగులో హీరోలు కనిపించలేదా ?

Prasanth Varma : టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు .. ఈ ఏడాది బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న హానుమాన్ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు కళ్ళు చెదిరే కలెక్షన్స్ ను కూడా అందుకుంది. ప్రశాంత్ వర్మ దెబ్బకు టాలీవుడ్, బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలైంది. హనుమాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నాలుగు వందల కోట్లు కొల్లగొట్టిన సమాచారం. ఇక హనుమాన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో జై హనుమాన్ మీద అంచనాలు పెరిగాయి.. ఈ సినిమా గురించి వర్మ నానుస్తూ ఉన్నాడు. ఇప్పటికి సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది .


జై హనుమాన్ సిద్దం అవ్వాల్సింది. సంక్రాంతికే జై హనుమాన్ వస్తుందని ప్రకటించారు. కానీ సాధ్యపడేలా లేదు. ఎందుకంటే ఇంత వరకు జై హనుమాన్ మూవీకి హీరో దొరకలేదు. రామ్ చరణ్, చిరంజీవి వంటి వారి అయితే బాగుంటుందని అనుకున్నారు. రానా అయితే బెటర్ అని సినీ అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ ప్రశాంత్ వర్మ అందరికి షాక్ ఇచ్చాడు. ఈ మూవీ లో లీడ్ రోల్ కోసం ఏకంగా కన్నడ స్టార్ ను దించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కన్నడ హీరోలను అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. కన్నడ నుంచి యశ్, రిషభ్ శెట్టిలను తీసుకోవాలని అనుకుంటున్నాడట. యశ్ తన బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరదని అన్నాడట. ఇక రిషభ్ శెట్టి ఈ జై హనుమాన్ మూవీకి ఓకే చెబుతాడా? లేదా అన్నది చూడాలి .. రిషబ్ శెట్టి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది . కానీ రెమ్యునరేషన్ కాకుండా షేర్ అడిగినట్లు సమాచారం .. ప్రస్తుతం ఈయన పేరు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది.

ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఈ మూవీ లీడ్ రోల్ కోసం తెలుగు హీరోలను తీసుకుంటారని అనుకున్నాం కానీ మీరు ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు అని హనుమాన్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఇక ప్రశాంత్ వర్మకు తెలుగు హీరోలు దొరకలేదా? తెలుగు వారిలో అంత టాలెంట్ లేదని భావిస్తున్నాడా? అంటూ నెట్టింట్లో ఓ వర్గం మండి పడుతోంది. మరి ఇంతకి జై హనుమాన్ సినిమాలో హీరోగా ఎవరు కనిపిస్తారు? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు . సినిమాను సంక్రాంతికి పోతే ఉగాదికి విడుదల చేస్తారా లేదా సమ్మర్ కు వస్తుందని ఆశలు పెట్టుకోవాలా అని ఫ్యాన్స్ ప్రశాంత్ వర్మకు కౌంటర్లు వేస్తున్నారు . మరి దీనిపై ప్రశాంత్ వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి .. ఇక ఈయన సినిమాల లైనప్ మాములుగా లేదు . లైన్లో మూడు , నాలుగు సినిమాలు ఉన్నాయి .


Related News

Ananya Nagalla: క్యాస్టింగ్ కౌచ్ పై ఊహించని కామెంట్.. జర్నలిస్ట్ నోరు మూయించిన అనన్య..!

Nithin : ఆ స్టార్ హీరో కోసం హీరో నితిన్ షాకింగ్ డెసిషన్ .. షాక్ లో ఫ్యాన్స్ ?

Chiranjeevi : అఖిల్ ఆశలపై నీళ్లు చల్లిన విశ్వంభర… ఎంత పని చేశావయ్య చిరంజీవి

Allu Arjun : మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి బన్నీ మాస్ ప్లాన్…? పుష్ప 2ను ఇలా వాడేస్తున్నాడా..?

Telugu Tamil language issue : తెలుగు తెరపై తమిళ భాషోన్మాదం

Ram Lakshman: మానవత్వం చాటుకున్న ఫైట్ మాస్టర్స్.. !!

Big Stories

×