EPAPER
Kirrak Couples Episode 1

Hansika: హన్సిక తో సింగిల్ టేక్.. సింగిల్ క్యారెక్టర్ తో మూవీ ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’

Hansika: హన్సిక తో సింగిల్ టేక్.. సింగిల్ క్యారెక్టర్ తో మూవీ ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’

Hansika:వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా సింగిల్ టేక్‌లో సింగిల్ క్యారెక్టర్‌తో హన్సిక న‌టించిన చిత్రం రాజు దుస్సా రచన దర్శకత్వంలో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.


ప్రపంచం లోనే మొదటి సారిగా సింగిల్ షాట్.. సింగిల్ క్యారక్టర్తో హన్సిక నటించగా తీసిన సినిమా ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటూ సాగే ఒక ఉత్కంఠ రేపే కథను సింగిల్ టేక్‌లో అంతే ఎంగేజింగ్‌గా తెరకెక్కించడం సాహసమే. హాలీవుడ్‌లో సింగిల్ షాట్ టెక్నిక్‌లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల తరహాలో ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ చిత్రం రూపొందించబడింది. ఆ చిత్రాలు సింగిల్ షాట్ తో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది. కానీ ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా. ఇంకా రీల్ టైం, రియల్ టైం ఒకేలా ఉండి మనం ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభూతి చెందుతాం. డైలాగులు కూడా చాలా తక్కువగా అవసరమైనంత వరకే పరిమితమై గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనే సినిమా ఉంటుంది. ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశంలోనే తొలిసారిగా తెలుగులో చేయడం గొప్ప విషయం. ఈ చిత్రానికి ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా లైవ్‌గా షూట్ చేసి సి జీ వర్క్ యాడ్ చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఇది డైరెక్టర్ విజన్ కు డి ఓ పి ప్రతిభకు తార్కాణం. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ సినిమా అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చిందని చిత్రం బృందం కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. టెక్నికల్ గా సింగిల్ షాట్‌లో సింగిల్ క్యారక్టర్‌తో చేసిన ఈ మూవీ ఒక బెంచ్ మార్క్‌గా నిలిచిపోతుంది.

హన్సిక కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. సినిమా చూశాక అందరి అభిప్రాయం ఇదే ఉంటుందన‌డంలో సందేహం లేదంటున్నారు మేక‌ర్స్‌. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రీ రికార్డింగ్ ప్రాణం. దర్శకులు ఈ చిత్రం గురించి చెప్పినప్పుడే ఆయన ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో చేసిన బిజీఎం సినిమా ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. సినిమా చూస్తున్నంత సేపు పాత్రతో పాటూ మనం ప్రయాణిస్తున్న ఫీలింగ్ వస్తుంది. సామ్ తన మ్యూజిక్‌తో ఆద్యంతం టెన్షన్ క్రియేట్ చేశారు. బ్రహ్మ కడలి గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా కుదిరింది. ఆయన పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. సింగిల్ షాట్‌తో రన్ అయ్యే సినిమా కావడంతో అనుకున్న షేడ్ రావడం కోసం కెమెరామన్ కిషోర్ బోయిడ‌పు లైటింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని టెక్నికల్ గా చాలా కొత్తగా ప్రయత్నించారు. ఆయన సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కి అనుగుణంగా ఒక పర్ఫెక్ట్ సింక్ లో ఉండేలా చూసుకున్నారు. ఇక దర్శకులు రాజు దుస్సా తను ఈ సింగిల్ టేక్‌, సింగిల్ క్యారక్టర్‌తో సాగే స్టొరీ నెరేట్ చేసిన దానికంటే బెటర్ గా తెరపైకి తీసుకురాగలిగారు. ప్రతి ఫ్రేమ్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి సెకండ్ కథతో లింక్ అయ్యి ముందుకు నడిపిస్తుంది. అంత పర్జెక్ట్ స్క్రీన్ ప్లే తో సినిమా తీశారు ఆయన. అందరూ ఇన్వాల్వ్ అయ్యి డెడికేటెడ్‌గా చేయడంతో చిత్రం చాలా బాగా వచ్చింది. దేశంలోనే తొలిసారిగా సింగిల్ షాట్ సింగిల్ క్యారక్టర్‌తో అతి తక్కువ డైలాగులతో తెరకెక్కిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాత బొమ్మక్ శివ గట్స్‌ను మెచ్చుకోకుండా ఉండలేం. ఆయనకి ఉన్న ప్యాషన్ వల్ల చిత్రం ఔట్ పుట్ లావిష్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కింది. చిత్ర బృందం త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్నారు. సినిమా కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.


Related News

Megastar Chiranjeevi : చిరంజీవిపై అరచి అందరి ముందే అవమానించిన స్టార్ ప్రొడ్యూసర్..?

Devara Dialogue : మూవీలో ఈ డైలాగ్ గమనించారా…? పార్ట్ లో దేవర ఫ్లాష్ బ్యాకే హైలైట్..

Janvi Kapoor : ఐఫాలో మెరిసిన ఎన్టీఆర్ బ్యూటీ.. ఆమె ధరించిన నెక్లేస్ ధర అన్ని కోట్లా?

Devara 3 Days Collections: ‘దేవర’ జోరు తగ్గలేదు శీనా.. కల్కి రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

FNCC President: బయటికొచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల ఫలితాలు.. భారీ మెజారిటీతో గెలిచిన సీనియర్ నిర్మాత

Jani Master: దానివల్లే దీనిగురించి మాట్లాడలేను.. జానీ మాస్టర్ కేసుపై ఎట్టకేలకు నోరువిప్పిన మంచు విష్ణు

Devara: ఆదివారం అయినా అందుకోవడం లేదు.. తారక్‌కు ఇది తప్పదా..

Big Stories

×