Moroccan Maguva: మ్యాచోస్టార్ గోపీచంద్ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడు. ఎన్నో మాస్, క్లాస్ సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకాభిమానుల్ని ఉర్రూతలూగించాడు. అయితే గత కొన్నేళ్ల నుంచి గోపీచంద్ సినిమాలకు దూరమయ్యాడు. సినిమా అవకాశాలు రాకపోవడం వల్లనో లేక ఇతర కారణాల వల్లనో కానీ కొన్నేళ్లు అజ్ఞాతంలో ఉన్నాడు. ఇక ఈ మధ్యనే మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేశాడు. ఏడాదికి ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేశాడు. కానీ అవేమి అతడిని కంబ్యాక్ చేయలేకపోయాయి.
గత మూడేళ్ల నుంచి అతడు చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. సాహసం, గౌతమ్ నంద తర్వాత అలాంటి హిట్ మళ్లీ పడలేదు. ఈ మూవీల తర్వాత సిటీమార్, పక్కా కమర్షియల్, రామబాణం, భీమా వంటి సినిమాలు చేశాడు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది. కానీ గోపీచంద్ తన ప్రయత్నాన్ని ఆపలేదు. వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఇందులో భాగంగానే తాజాగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సారి ఎలాగైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. ఓ పవర్ ఫుల్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ గోపీచంద్ కెరీర్లో అత్యంత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతోంది. కాగా ఇప్పటి వరకు గోపీచంద్ కేవలం రెండు పేర్లు గల టైటిల్స్‌తో ఎన్నో హిట్లు కొట్టాడు. ఇక ఇప్పుడు అదే తరహాలో మరోసారి తన లక్కును పరీక్షించుకునేందుకు విశ్వంతో రాబోతున్నాడు. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తుంది.
Also Read: కొట్టారు తీసుకున్నాం.. రేపు మాకు టైం వస్తుంది మేము కొడతాం, గోపిచంద్ ‘విశ్వం’ టీజర్ చూశారా?
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ విశ్వం సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అంచనాలు అమాంతంగా పెంచేశాయి. ఇటీవలే మరో టీజర్ రిలీజ్ చేయగా అందరిలోనూ ఆసక్తి పెంచింది. ఈ టీజర్ మొత్తంలో సగం కామెడీ, మిగతా సగం మాస్ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసి రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇందులోని మొదటి బాగం కామెడీతో అలా అలా సాగిపోయింది. చూస్తుంటే ఈ సినిమా రొటీన్ కామెడీతో వస్తున్నట్లు అనిపించింది.
వెన్నెల కిషోర్ ఎంట్రీ బాగా నవ్వించింది. ఆ తర్వాత హీరోయిన్ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంది. అనంతరం ఇందులోని ట్రైన్ జర్నీలో కామెడీ సన్నివేశాలు బాగా అలరించాయి. అయితే ఈ కామెడీ సన్నివేశాలన్ని ప్రేక్షకుల్ని అలరించేలా కనిపించడం లేదు. ఇలాంటివి ఇప్పటికే ఎన్నో వచ్చాయి. ఇలా కామెడీ జోనర్ నుంచి ఒక్కసారిగా టీజర్ యాక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్లింది. ఈ యాక్షన్ సీన్లు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ప్రతి యాక్షన్ సీన్ ఫుల్ జోష్ నింపింది. మొత్తంగా ఈ టీజర్ అన్ని ఎలిమెంట్స్‌తో సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ 11న గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక్కో అప్డేట్ వదులుతూ అలరిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచో ఓ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సాంగ్ అత్యద్భుతంగా ఉంది. చైతన్య భరద్వాజ్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఫుల్ మాస్ బీట్తో క్లాసిక్ స్టెప్పులతో అదిరిపోయింది. మొత్తంగా ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.