EPAPER

GOAT movie: ‘గోట్’ కలెక్షన్లు ఏంటి భయ్యా.. ‘లియో’ కన్నా మరీ ఇంత తక్కువా?

GOAT movie: ‘గోట్’ కలెక్షన్లు ఏంటి భయ్యా.. ‘లియో’ కన్నా మరీ ఇంత తక్కువా?

GOAT box office collection day 1: భారీ అంచనాలతో సెప్టెంబర్ 5న విడుదలయింది విజయ్ దళపతి మూవీ ది గోట్. అయితే ఈ మూవీ తొలి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అందరూ పాత కథనే కొత్తగా చూపించారని ఆరోపిస్తున్నారు. తండ్రీ కొడుకులుగా విజయ్ కనిపించడం ఒకటే తప్ప మిగిలిందంతా పాత తమిళ సినిమాలు చూస్తున్నట్లే ఉందని చూసిన ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో విజయ్ ఫాలోయింగ్ కాస్త తక్కువనే చెప్పాలి. సూర్య , కార్తీ, విక్రమ్, ధనుష్ లాంటి హీరోల కన్నా మార్కెట్ తక్కువనే చెప్పాలి. తమిళంలో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్నపాపులారిటీని ఆయన తర్వాత మళ్లీ విజయ్ దళపతికే ఉందని ఘంటాపథంగా చెప్పొచ్చు. యావరేజ్ గా టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా మినిమం రూ.200 కోట్లు వసూళ్లు రాబడతాయంటే అర్థం చేసుకోవచ్చు విజయ్ కున్న డిమాండ్ ఎలాంటిదో.


అత్యధిక పారితోషికం

విజయ్ రెమ్యునరేషన్ గురించి మార్కెట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. విజయ్ గోట్ మూవీ కోసం రూ.200 కోట్లు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై నిర్మాతగానీ, దర్శకుడు గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అదే జరిగితే ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా విజయ్ దళపతి చరిత్ర సృష్టించడం ఖాయం. ఈ మూవీలో ప్రధానంగా చెప్పుకునే అంశం ఒక్కటే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి దివంగత హీరో విజయ్ కాంత్ ను చూపించడం.అయితే తమిళనాట విజయ్ కున్న ఫ్యాన్స్ మద్దతుతో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ వీకెండ్ దాకా అయిపోయాయి. రూ.400 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ది గోట్ మూవీ. ఈ మూవీపై భారీ ఎత్తున అంచనాలు ఉండటంతో సినిమా బిజినెస్ కూడా ఊహించినదాని కన్నా ఎక్కువే జరిగింది. ఇక విజయ్ కెరీర్ లో చివరి సినిమా అనేసరికి అంచనాలు మరింత అధికం అయ్యాయి. ఇండియాలో ఈ మూవీకి తొలి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా బాగానే వచ్చాయి.


లియోను క్రాస్ చేయలేకపోయింది.

కేవలం తమిళనాడులోనే రూ.40 కోట్లు వసూళ్లు రాబట్టింది. తెలుగులో రూ.మూడు కోట్లు, బాలీవుడ్ లో రూ.రెండు కోట్లు, కేరళ, కన్నడ కలిపి నాలుగు కోట్లు వసూళ్లు అయ్యాయి. ఇండియాలో తొలి రోజు రూ.50 కోట్లు వసూలయినట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లోనూ ఈ మూవీ కలెక్షన్ల దుమ్ము రేపింది. తొలి రోజే ఐదు మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్కారం రూ.50 కోట్లు. ఓవరాల్ గా రెండు మొత్తం కలిపి వంద కోట్ల కలెక్షన్ల మార్కు దాటినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విజయ్ దళపతి నటించిన లియో తొలి రోజు కలెక్షన్ల రికార్డును దాటలేకపోయింది. లియో తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.145 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అయితే విజయ్ మూవీ గోట్ కు లాభాలు రావాలంటే మరో రెండొందల కోట్లు రావాల్సి ఉంటుంది. కనీసం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.185 కోట్లు రావాల్సి ఉంటుంది. కేవలం కోలీవుడ్ కలెక్షన్లు రాబడితే చాలదు. ఇండియా వైడ్ గా ఈ మూవీ కలెక్షన్లు రన్నింగ్ లో బాగుంటేనే గట్టెక్కేది అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి తొలి రోజే రూ.191 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది వరల్డ్ వైడ్ గా. ఈ రికార్డుకు దరిదాపుల్లో కూడా రాలేదని గోట్ మూవీని ట్రోల్ చేస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×