EPAPER

Game Changer: వేస్టేజ్ రూ.100 కోట్లు..నిజమేనా..?

Game Changer: వేస్టేజ్ రూ.100 కోట్లు..నిజమేనా..?

Game Changer.. రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. వినయ విధేయ రామ సినిమా తర్వాత మరొకసారి ఈయనతో జతకట్టబోతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా వాయిదా పడుతూనే వస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. తాజాగా విడుదలైన పాటలు కూడా యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


చిత్ర బృందంలో పెరిగిన ఓవర్ కాన్ఫిడెంట్..

ముఖ్యంగా ఈ సినిమాపై చిత్ర బృందం ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకుందని చెప్పవచ్చు. అయితే అదే సమయంలో ఈ సినిమా విషయంలో చాలా వేస్టేజ్ జరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా భారతీయుడు 2 సినిమా పైన దృష్టి పెట్టిన శంకర్ ఇప్పుడు తన పూర్తి దృష్టిని గేమ్ ఛేంజర్ పైనే పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా తన సోషల్ మీడియా ఖాతా హెడర్ ఫోటోని కూడా చేంజ్ చేశాడు. దీంతో శంకర్ దృష్టి మొత్తం ఈ సినిమా పైనే ఉందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా.. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


రూ.100 కోట్లు వ్యర్థం..

Game Changer: Wasteage of Rs.100 crores..is it true..?
Game Changer: Wasteage of Rs.100 crores..is it true..?

భారీ బడ్జెట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో అటు శంకర్ ఇటు నిర్మాత దిల్ రాజు ఎవరు కూడా తగ్గడం లేదని సమాచారం. ఇకపోతే తాజాగా ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకొని మరోసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని రామ్ చరణ్ కూడా సిద్ధం అయ్యారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసం మేకర్స్ ఏకంగా రూ .3కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తాజా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తమ బ్యానర్లో గేమ్ చేంజర్ సినిమా 50వ సినిమా కాబట్టి దిల్ రాజు కూడా చాలా గ్రాండ్ గా ఈ సినిమాని చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చయిపోతోంది. ఇప్పటికే రూ .350 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం.అంతేకాదు ఇందులో వేస్టేజ్ రూ.100 కోట్లు ఉంటుందట. అంటే సినిమా కోసం శంకర్ షూట్ చేసిన ఫుటేజీలో చాలావరకు డస్ట్ బిన్ లో పడేసారని వార్తలు వినిపిస్తున్నాయి. దాని విలువ రూ .100 కోట్లకు చేరినట్లు వార్తలు వినిపిస్తూ ఉండగా.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి.

గేమ్ ఛేంజర్ బిజినెస్ లెక్కలు..

ఇకపోతే ఈ సినిమాకి ఎంత బిజినెస్ జరిగిందనే విషయంపై కూడా ఎటువంటి అప్డేట్స్ బయటకు రాలేదు. చాలా కాలం నుంచి షూటింగ్ జరగడం , ఎలాంటి అప్డేట్స్ విడుదల కాకపోవడంతో హైప్ కూడా తగ్గిన నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి తగ్గుతున్నారని సమాచారం. ఇక డిస్ట్రిబ్యూటర్స్ ని ఆకట్టుకోవాలంటే దిల్ రాజు మళ్ళీ తన స్ట్రాటజీని ఉపయోగించాలని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక పూర్తి నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

Related News

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Kanguva Release Date: అక్టోబర్ నుంచి నవంబర్ కి, కంగువ డేట్ మారింది అరాచకం మాత్రం మారదు

Johnny Master arrest: పోలీసులకు చిక్కిన జానీ మాస్టార్, హైదరాబాద్‌‌కు తరలింపు

Ram Charan’s RC16 : బుచ్చిబాబు మాస్ ప్లాన్… రామ్ చరణ్ కోసం తంగలాన్ టీం..

Jani Master: జానీ మాస్టర్‌కు ఎన్నేళ్లు శిక్ష పడుతుందో తెలుసా?

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

Big Stories

×