Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక కొన్ని రోజుల నుంచి .. దివాళీ కానుకగా.. గేమ్ ఛేంజర్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెల్సిందే. టీజర్ అదిరిపోయిందని, దివాళీ బ్లాస్ట్ అని చెప్పుకొచ్చారు. దీంతో ఎప్పుడెప్పుడు గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. కానీ, వారికి నిరాశే మిగిలింది.
గేమ్ ఛేంజర్ నుంచి మేకర్స్ అప్డేట్ అయితే ఇచ్చారు కానీ.. టీజర్ మాత్రం రిలీజ్ చేయలేదు. ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి.. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. నవంబర్ 9 న గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఇక ఈ పోస్టర్ లో ట్రైన్ పట్టాలపై విలన్స్ ను పడుకోబెట్టి.. వారి ముందు లుంగీలో గాగుల్స్ పెట్టుకొని చరణ్ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
Sai Pallavi: అమరన్.. అంతా సాయిపల్లవిమయం
ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో.. రాజమౌళి సెంటిమెంట్ ను చరణ్ కూడా బ్రేక్ చేస్తాడా.. ? లేదా.. ? అని అందరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి అభిమానుల అంచనాలను చరణ్ అందుకుంటాడా.. ? రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే.