E-Paper
Advertisement

Game Changer:- ‘గేమ్ చేంజర్’ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చేద్దామంటే నేనే వ‌ద్ద‌న్నా: దిల్ రాజు

Game Changer:- ‘గేమ్ చేంజర్’ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చేద్దామంటే నేనే వ‌ద్ద‌న్నా: దిల్ రాజు
Advertisement

Game Changer:- టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్స్‌లో ఒక‌రైన దిల్ రాజు ఒక వైపు న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్‌చేస్తూ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూనే స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల‌తో ఇటు తెలుగు, అటు హిందీలో.. పాన్ ఇండియా లెవ‌ల్లో సినిమాలు చేస్తున్నారు. అలా ఆయ‌న రూపొందిస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజ‌ర్‌. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను శంక‌ర్ ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చేయాల‌ని అనుకున్నారు. అయితే దిల్ రాజు రామ్‌చ‌ర‌ణ్‌తో ప్రాజెక్ట్‌ని సెట్ చేశారు. దీనిపై రీసెంట్ ఇంట‌ర్వ్యూలో దిల్ రాజు వివ‌ర‌ణ ఇచ్చారు.

‘‘నిజానికి ఇండియన్ 2 సినిమాను మేం చేయాల్సింది. కానీ కొన్ని కార‌ణాల‌తో మేం త‌ప్పుకున్నాం. కొన్ని రోజుల త‌ర్వాత శంక‌ర్ మ‌ళ్లీ సోష‌ల్ పాయింట్ మీద సినిమా ఉంద‌ని చెప్పారు. నేను క‌థ విన్నాను. నాకు న‌చ్చింది. హీరోగా ఎవ‌ర్ని అనుకుంటున్నారు అని అడిగాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని అనుకుంట‌న్నాన‌ని అన్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే ఈ క‌థ రామ్ చ‌ర‌ణ్‌కైతే స‌రిపోతుంద‌ని చెప్పాను. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. కోవిడ్ కార‌ణంగా ఫోన్‌లోనే చ‌ర‌ణ్‌కు క‌థ‌ను వినిపించాను. చ‌ర‌ణ్‌కి కూడా క‌థ న‌చ్చ‌డంతో ప్రాజెక్ట్ లాక్ చేశాం. అయితే ఇండియ‌న్ 2 సినిమాను కూడా శంక‌ర్‌గారు డైరెక్ట్ చేయాల్సి వ‌చ్చింది. అందుక‌ని ఆయ‌న నెల‌లో ప‌ది రోజులు గేమ్ చేంజ‌ర్‌.. మ‌రో ప‌ది రోజుల ఇండియ‌న్ 2 సినిమాల‌కు వ‌ర్క్ చేస్తున్నారు’’ అన్నారు.

Advertisement

గేమ్ చేంజ‌ర్ సినిమా షూటింగ్‌ను సెప్టెంబ‌ర్ కంతా పూర్తి చేస్తాం. త‌ర్వాతే రిలీజ్ డేట్‌పై క్లారిటీ వ‌స్తుంద‌ని దిల్ రాజు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు గేమ్ చేంజ‌ర్ షూటింగ్ 70 శాతం పూర్త‌య్యింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇది పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు.

Advertisement

‘ఏంట‌మ్మా..’ నుంచి బీటీఎస్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్

for more updates follow this link:-Bigtv

Related News

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Big Stories

Advertisement
×