Sharda Sinha: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అటు అభిమానులను ఇటు సెలబ్రిటీలను మరింత దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న కన్నడ డైరెక్టర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు పద్మ భూషణ్ గ్రహీత స్టార్ సింగర్ స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు, సినీ సెలబ్రిటీలు, సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ గాయని శారదా సిన్హా..
ప్రముఖ గాయని శారదా సిన్హా (Sharda Sinha) పరమపదించారు. గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థకు గురికావడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఎయిమ్స్ లో ఆమెకు మెరుగైన చికిత్సను కూడా అందించారు. ఆమెను ప్రాణాలను కాపాడేందుకు అటు ప్రధాని మోదీ కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రస్తుతం ఆమె వయసు 72 సంవత్సరాలు. అనారోగ్య సమస్యలతో ఆమె మరణించడంతో సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతూ.. ఆమె మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు.
బ్లడ్ క్యాన్సర్ తో పోరాటం..
1952 అక్టోబర్ ఒకటవ తేదీన బీహార్ లోని హులాస్ లో జన్మించిన ఈమె బ్రజ్ కిషోర్ ను వివాహం చేసుకున్నారు. ఈమెకు కూతురు వందన, కొడుకు అన్షుమాన్ సిన్హ కూడా ఉన్నారు. ఇకపోతే గతంలో బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన ఈమె ఆ తర్వాత ఆ సమస్యల నుంచి తేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడిందని సమాచారం.ఇక శారద కెరియర్ విషయానికి వస్తే.. జానపద సంగీతానికి విశేషంగా సేవలు అందించారు. ఇక ఈమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును 2018లో అందజేశారు. జాతీయ ఉత్తమ గాయని అవార్డు కూడా ఆమె అందుకున్నారు. ప్రాంతీయ భాషలో మ్యూజిక్ రంగానికి ఆమె విశేష సేవలు అందివ్వడం జరిగింది.
మల్టిపుల్ మైలోమా తో నరకం..
శారదా సిన్హా తన ప్రస్థానాన్ని మైథిలి ఫోక్ పాటలతో మొదలుపెట్టింది. ఆమె మైథిలి , భోజ్ పురి, మగాహి వంటి భాషలలో పాటలు పాడింది. వసంత రుతువు శైలిలోని అద్భుతమైన పాటలను ఆమె ప్రయాగ లోని ప్రయాగ్ సంగీత సమితి నిర్వహించిన బసంత్ మహోత్సవంలో కూడా పాడింది. దుర్గా పూజ పండుగలో కూడా తరచూ ప్రదర్శనలు ఇచ్చేది. ఇక మార్షియస్ ప్రధాని నవీన్ రాంగులం విహార్ వచ్చినప్పుడు కూడా తన ప్రదర్శనలు కొనసాగించింది. 2017 లో న్యూఢిల్లీలో జరిగిన బీహార్ మహోత్సవంలో భాగంగా ప్రగతి మైదానంలో కూడా పాటలు పాడి అందరినీ ఆకట్టుకుంది.. ఇక 2017 నుంచి మల్టిపుల్ మైలోమాతో బాధపడిన ఈమె ఇదే ఏడాది భర్తను కూడా కోల్పోయింది.