EPAPER

Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాని!

Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాని!

Filmfare Awards South 2024: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రతి ఏడాది అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. సౌత్ సినీ పరిశ్రమకు సంబంధించి జరిగే ఈ అవార్డ్ వేడుకలకు ప్రముఖులు హాజరవుతుంటారు. తాజాగా, హైదరాబాద్‌లో జరిగిన 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.


ఫిల్మ్ ఫేర్ గతేడాది ప్రతిభ కనబర్చిన నటీనటులను సన్మానించి అవార్డులు అందజేసింది. కాగా, ఈ అవార్డ్ వేడుకల్లో కొంతమంది నటీమణులు తమ ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. అలాగే సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ హోస్ట్ లుగా వ్యవహరించారు. ఇక రాశీ ఖన్నా, అపర్ణ బాలకమురళీ, సానియా ఇయాపాన్, గాయత్రీ భరద్వాజ్ తమ ప్రదర్శనలతో అలరించారు.

2023లో నామినేట్ పొందిన సినిమాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులను ఏయే సినిమా, ఏయే నటులు అందుకున్నారో తెలుసుకుందాం. ఇందులో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ పొందిన ‘బలగం’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక ఉత్తమ దర్శకుడిగా వేణు అవార్డు గెలుచుకున్నారు. ‘దసరా’ సినిమాలో నటనకు నాని, కీర్తి సురేష్ ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. అలాగు ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డు ఇద్దరికి వరించింది. దసరా సినిమాకు గానూ శ్రీకాంత్ ఓదెల, హాయ్ నాన్న శౌర్యువ్ అందుకున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో నాని హీరోగా నటించడం విశేషం. దీంతోపాటు ‘బేబి’ సినిమాకు కూడా వివిధ విభాగాల్లో అవార్డులు వరించాయి.


Also Read: విజయ్ ‘గోట్’ మూవీ నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్.. మీనాక్షి ఎంత అందంగా ఉంది రా బాబు

69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 తెలుగు విజేతలు..

  • ఉత్తమ చిత్రం : బలగం,
  • ఉత్తమ నటుడు : నాని(దసరా),
  • ఉత్తమ నటి : కీర్తి సురేష్(దసరా),
  • ఉత్తమ దర్శకుడు : వేణు యెల్దండి(బలగం),
  • ఉత్తమ పరిచయ దర్శకుడు : శ్రీకాంత్ ఓదెల(దసరా), శౌర్యువ్(హాయ్ నాన్న),
  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) : సాయి రాజేష్ (బేబీ),
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : నవీన్ పొలిశెట్టి(మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్(రంగమార్తాండ),
  • ఉత్తమ నటి (క్రిటిక్స్) : వైష్ణవి చైతన్య (బేబీ),
  • ఉత్తమ సహాయ నటుడు  : రవితేజ(వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ),
  • ఉత్తమ సహాయ నటి : రూప లక్ష్మీ (బలగం),
  • ఉత్తమ గాయకుడు : శ్రీ రామచంద్ర ( ఓ రెండు ప్రేమ మేఘలిలా..బేబి),
  • ఉత్తమ గాయని : శ్వేత మోహన్ (మాస్టారు..మాస్టారు..సార్),
  • ఉత్తమ గేయ సాహిత్యం : అనంత్ శ్రీరామ్ ( ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబి),
  • ఉత్తమ సంగీతం : విజయ్ బుల్గానిన్ (బేబీ),
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ : సత్యన్ సూరన్ ( దసరా),
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : కొల్లా అవినాష్ ( దసరా),
  • ఉత్తమ కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా..దసరా).

Related News

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Big Stories

×