EPAPER

K.Viswanath : కె. విశ్వనాథ్ కు ప్రముఖుల నివాళి..

K.Viswanath : కె. విశ్వనాథ్ కు ప్రముఖుల నివాళి..

K.Viswanath : కె. విశ్వనాథ్ మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమ శోకచంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విశ్వనాథ్ మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు.


తెలుగు సినిమాకే గర్వకారణం: బాలకృష్ణ
కళాతపస్వి కె.విశ్వనాథ్ క‌న్నుమూయ‌డం తెలుగు చ‌ల‌న‌చిత్ర పరిశ్రమకు తీర‌ని లోటని బాలకృష్ణ అన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయలు ముఖ్యంగా తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణంగా నిలిచాయన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారానికి గురిచేసిందని పేర్కొన్నారు. క‌ళా త‌ప‌స్వి ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని ఆ దేవుడిని ప్రార్థించారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రగాఢ సంతాపం తెలియ‌జేశారు.

పవన్‌ కల్యాణ్‌ నివాళి
దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ భౌతికకాయానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నివాళులర్పించారు. త్రివిక్రమ్‌, సత్యానంద్‌లతో కలిసి విశ్వనాథ్ పార్థివదేహం వద్దకు వచ్చారు. శంకరాభరణం సినిమా పాటల ద్వారా సంస్కృతి గొప్పదనం తెలిసిందన్నారు. కె.విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


ఎప్పటికి అభిమానినే: కమల్‌హాసన్‌
కళ గొప్పతనాన్ని పూర్తి అర్థం చేసుకున్న వ్యక్తి కె.విశ్వనాథ్‌ అని కమల్ హాసన్ అన్నారు. ఆయన చేసిన కళాసేవ ఎప్పటికీ నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ కళాతపస్వికి అభిమానినే అని అన్నారు.

స్వర్ణకమలం విశ్వనాథ్ : బ్రహ్మానందం

పుట్టిన ప్రతి వాడూ చనిపోకతప్పదని బ్రహ్మానందం అన్నారు. కానీ అద్భుతమైన మరణాన్ని పొందిన కె.విశ్వనాథ్‌ కళ బతికున్నంత కాలం మనతోనే ఉంటారని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో తాను రెండు సినిమాల్లో నటించానని గుర్తు చేసుకున్నారు. అలాంటి మహనీయుడు మన మధ్య లేరంటే బాధగా ఉందన్నారు. భారత చలన చిత్ర చరిత్రలో విరబూసిన స్వర్ణకమలం కె. విశ్వనాథ్ అని బ్రహ్మానందం అన్నారు.

భారతీయ సినిమా జీనియస్‌ను కోల్పోయింది: గవర్నర్‌ తమిళిసై

కె. విశ్వనాథ్‌ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. భారతీయ సినిమా జీనియస్‌ను కోల్పోయిందని తమిళిసై ట్వీట్ చేశారు. విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి క్లాసిక్‌ చిత్రాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం : వెంకయ్యనాయుడు
కె. విశ్వనాథ్ మరణంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు.

Related News

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

Jani Master : జానీ మాస్టర్ కు అన్యాయం? బన్నీ పై నెటిజన్స్ ఆగ్రహం..

Jani Master Case : అంతటికీ కారణం విశ్వక్ సేన్… జానీ రిమాండ్ తర్వాత బయటకు వచ్చిన సంచలన నిజం..

Jani Master case : జానీ పై కేసుకు ఆ సినిమానే కారణం.. ఇన్నాళ్లకు వెలుగులోకి నిజం..

Sreeleela : శ్రీలీలకు గాయం.. అసలు మ్యాటర్ వింటే షాక్ అవుతారు?

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Big Stories

×