EPAPER

Pavitra Jayaram Chandu Relation: తాళిని ఎగతాళి చేసిన చందు.. పవిత్ర కోసం అపవిత్ర బంధం.. వాళ్ల సంగతేంటి ?

Pavitra Jayaram Chandu Relation: తాళిని ఎగతాళి చేసిన చందు.. పవిత్ర కోసం అపవిత్ర బంధం.. వాళ్ల సంగతేంటి ?

Pavitra Jayaram Chandu Relation : తెలుగు సీరియల్ నటులిద్దరు చనిపోయారు. బుల్లి తెరపై విషాదఛాయలు అలుముకున్నాయి. నిజమే, మనిషి ప్రాణం విలువ తెలిసిన ఎవరికైనా ఇది బాధ కలిగించే వార్త. సీరియల్ యాక్టర్లు, పవిత్ర, చంద్రకాంత్‌ల వరుస మరణాలు వారి మధ్య బంధాన్ని తెలియజేస్తున్నాయి. వివాహేతరమే అయినా విడిపోలేనంత ఇష్టం ఉండొచ్చు. అయితే ఇంతేనా..? ఒక ప్రాణం విలువ ఒకరి బంధంతోనే ముడిపడి ఉంటుందా..? ఇది కేవలం సందేహం కాదు. సమాధానం వెతకాల్సిన సందర్భం.


టీవీ ఇండస్ట్రీలో నెలకొన్ని ఈ విషాద ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిజానికి, తెలుగు సినిమాకు ఎంత మంది అభిమానులున్నారో.. అదే స్థాయిలో టీవీ సీరియళ్లకు ఉన్నారు. అందుకే ప్రతి ఇంట్లో వీళ్లద్దరి మరణాలపైనా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. త్రినయని సీరియల్ ఫేం పవిత్ర జయరామ్ కారు ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె చనిపోయిన ఐదు రోజులకే తన ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చంద్రకాంత్ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. విషయం తెలుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే తాను ఎందుకు చనిపోయాడన్నది కూడా స్పష్టంగానే ఉంది. కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌లు చేస్తే అది అర్థం అవుతుంది. అయితే, ఏ వ్యక్తి మరణమైన మరి కొందరిపై ప్రభావం చూపుతుందన్నది నిజం. అందుకే పవిత్ర మరణం చంద్రకాంత్ మరణానికి కారణం అయ్యింది.

నటుడు చంద్రకాంత్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. ఆరేళ్లుగా త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో సహజీవనంలో కూడా ఉన్నాడు. పవిత్ర జయరామ్, చంద్రకాంత్‌లు బెంగుళూరు వెళ్లి వస్తూ.. మే 12, తెల్లవారు జామున, ఘోర రోడ్డు ప్రమాదంలో పవిత్రా జయరామ్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన కారులో చంద్రకాంత్ కూడా ఉండగా.. గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే.. పవిత్రను ప్రాణంగా ప్రేమిస్తున్న చంద్రకాంత్. తన కళ్ల ముందే ప్రాణాలు వదలటాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అప్పటి నుంచి డిప్రేషన్‌లోకి వెళ్లిన అతడు.. మానసికంగా క్రుంగిపోయి, బలవన్మరణం పొందారు. ఇది, ఒక వైపు ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమను చూపిస్తుంటే.. మరోవైపు, వివాహేతర సంబంధాలు జీవితాలను నాశనం చేస్తాయనే అనే అభిప్రాయానికి ఆజ్యం పోస్తున్నాయి.


Also Read: ఆమె వల్లే దూరమయ్యాం.. సంచలన విషయాలు బయటపెట్టిన నటుడు చందు భార్య.. వీడియో!

మే 17 రాత్రి.. తన నివాసంలో ఉరేసుకుని చనిపోయారు చంద్రకాంత్. తన ప్రేయసి లేకుండా తాను బతకలేనని.. తను పిలుస్తుందంటూ సన్నిహితులకు, బంధువులకు సమాచారం అందించి మరీ ఆత్మహత్యకి పాల్పడ్డారు. అయితే, పవిత్రా జయరామ్‌కి 16 ఏళ్లకే పెళ్లి కాగా.. 20 ఏళ్లకు భర్తతో విడిపోయారు. కాగా, ఈమెకి ఓ కూతురు కొడుకు ఉన్నారు. కొడుకు వయసు 22 ఏళ్లు కాగా.. కూతురు వయసు 19 ఏళ్లు. ఇక చంద్రకాంత్‌కి కూడా పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. 12 ఏళ్ల పాటు గాఢంగా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు చంద్రకాంత్. అయితే, ఒక ప్రేమ విరిగి, అదే ప్రేమను ఇంకొకరితో పంచుకునే పరిస్థితికి వెళ్లింది. చంద్రకాంత్ ఉండి ఉంటే, అతని జీవితంలో మరో ప్రేమకు కూడా చోటుండేదో లేదో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఈ సంగతి పక్కన పెడితే.. ఎప్పుడైతే పవిత్రా జయరామ్‌తో చంద్రకాంత్‌కి పరిచయం ఏర్పడిందో.. అప్పటి నుంచి తన భార్యని దూరం పెట్టారు చంద్రకాంత్. భార్యతో విభేదాల కారణంగా.. పవిత్రకి దగ్గరైన చంద్రకాంత్ ఆమెతో మరింత గాఢమైన బంధాన్ని బిల్డప్ చేసుకున్నారు. అంత ఎమోషనల్ బంధమే ఇప్పుడు తన మృతికి కారణం అయ్యింది.

అప్పుడెప్పుడో.. వందేళ్ల క్రితం తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు ఒక కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. దాని పేరు.. అమలిన ప్రేమ.. అంటే మలినం కానిదని అర్థమవుతూనే ఉంది. ఇక కవి రాసిన పదం ఎగ్జాట్‌గా ఇది కాకపోయినా.. ప్రేమకున్న చాలా అర్థల్లో ఒకటిగా కవి రాసిన పదానికి ఈ అర్థం తీసుకొని, కొన్ని విషయాలను అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రేమలో పవిత్రం, అపవిత్రం అనేవి రెండూ ఉంటాయి. ఇవి రెండూ ప్రాణాలు తీసుకునేంత స్థాయి తీసుకెళ్తాయి. అయితే, ఇక్కడ జరిగిన ఆత్మహత్య పవిత్రమే కావచ్చు గాక. మరి 12 ఏళ్లు గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న చంద్రకాంత్ చూపించిన మొదటి ప్రేమ అపవిత్రమైనదని అర్థం చేసుకోవాలా..? అది కూడా కాదు.. ఆరెంజ్ అనే తెలుగు సినిమాలో ప్రేమ పర్మినెంట్‌గా ఉండదనే కాన్సెప్ట్‌ ప్రకారం కొందరు దీన్ని సమర్థిస్తారు కూడా. అంతవరకూ బానే ఉంది. మరి ప్రాణాలు తీసుకుంటే..? ఆ ప్రేమ గెలుస్తుందా? అంటే వారి వ్యక్తిగతంగా ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి. కానీ వ్యక్తి అంటే ఓ సామాజిక జీవి. సమాజంలో లేకుండా వ్యక్తి ఉండలేడు. కాబట్టి ప్రేమ అనేది వ్యక్తిగతం కాదు.. ఇద్దరికి సంబంధించింది. ప్రాణం కూడా అలాగే.. ఇద్దరికంటే మించి.. చాలా మందిని ప్రభావితం చేస్తుంది.

Also Read: Mirai Manchu Manoj: అన్నా.. ఏంటన్నా ఆ ఫైట్స్.. ఏమన్నా ఉందా గ్లింప్స్.. గూస్ బంప్స్ వచ్చాయ్

ఇక.. ఇంతకుముందు చెప్పుకున్న అమలిన ప్రేమలో మానసిక అభిమానానికే అవకాశం ఉంటుంది. శారీరక సౌఖ్యమనే బంధానికి ఇది చాలా దూరంగా ఉంటుంది. నిజంగా పవిత్రమైన ప్రేమలో ఆ బంధం లేకపోతే అమలిన సంబంధం ఎలా ఉంటుందో ఊహకు మాత్రమే వదలాల్సిన పరిస్థితి. ఎందుకంటే కవి చెప్పిన అలాంటి ప్రేమ.. తెలుగు సినిమా ఆరెంజ్‌లోనూ లేదూ.. ప్రస్తుత ప్రపంచంలోనూ కనిపించలేదు. కాబట్టి ప్రేమ ఆకర్షణతో కూడకున్నదనే సత్యం అందరికీ తెలిసిందే. ఇందులో ఎక్సెప్షన్స్ లేవు. ఎందుకంటే.. ఆకర్షణకు సోకాల్డ్ అందంతో సంబంధం ఉండదు. అందుకే.. ఇద్దరి మధ్య ఏ బంధం ఉందో దాన్ని బట్టి వాళ్ల అనుబంధం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చంద్రకాంత్ మరణం విషాదాన్ని కలిగించినా.. అతను, తన భార్యా పిల్లలను పట్టించుకోకుండా పవిత్రతో సంబంధాన్ని కొనసాగించడం కొందరు సానుకూలంగా తీసుకోలేని పరిస్థితి. పోనీ అతను చచ్చి సాధించిందేంటనేది కూడా ప్రశ్నగానే ఉంది. చనిపోయే ముందు అతను పవిత్రను తలుచుకుంటూ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ల కింద చాలా మంది ఇలాంటి కామెంట్లే పెడుతున్నారు. తన భార్య, పిల్లలు.. పోనీ పవిత్ర పిల్లలు.. వీరిలో ఎవ్వరి బాధ్యతా స్వీకరించలేకపోయాడు చంద్రకాంత్. ఇదే చాలా మందిని ప్రశ్నించేలా చేస్తోంది.

నిజానికి ఆత్మహత్య అన్నది మెచ్యూరిటీతో తీసుకునే నిర్ణయం కాదనే అభిప్రాయం నిపుణులు కూడా వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా వివాహేతర సంబంధంలో జరిగే మరణాలకు ఈ వాదన బలంగా పనిచేస్తుంది. అక్రమ సంబంధాలు వారితో మాత్రమే ముగిసిపోవు. ఇరువైపుల ఉన్న కుటుంబాలు, పిల్లలు, బంధువులు.. ఇలా చాలా మందిపై ప్రభావం చూపుతుంది. వారిలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది. ఒక్కోసారి వారిని కూడా ఆత్మహత్యకు పురిగొల్పేలా చేస్తుంది. అంతకుమించి.. తల్లిదండ్రులు వివాహేతర సంబంధం కారణంగా చనిపోతే.. అది వారి పిల్లలపై ఘోరమైన ప్రభావాన్ని చూపుతుంది. వారి జీవిత కాలం వెంటాడుతుంది. అందులోనూ చనిపోయిన వారు సెలబ్రిటీలైతే అది ఇంకా నరకప్రాయంగా మారుతుంది. అందుకే ఒక మరణాన్ని అన్ని కోణాల నుండి చూసిన తర్వాత మాత్రమే మనిషికి మరణించే హక్కు ఉంటుంది. అందుకే చట్టం కూడా ఆత్మహత్యను నేరంగా పరిగణిస్తోంది.

Tags

Related News

Game Changer: కొత్త డేట్ తో వచ్చేసిన గేమ్ ఛేంజర్.. ఇక పూనకాలే

RAPO22: మహేష్ బాబుతో రామ్ సినిమా.. ఈసారి హిట్ ఖాయమే.. ?

Allu Arjun: గొడవపై క్లారిటీ.. మెగావార్ ముగిసినట్టేనా..?

Alia Bhatt: రాహా కపూర్‌కు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్, చూడగానే షాకయిన ఆలియా భట్.. అదేంటో తెలుసా?

Unstoppable Season 4 Trailer: జై బాలయ్య.. దెబ్బకు థింకింగ్ మారి తీరాలా.. ట్రైలర్ అదిరిపోయింది

Tollywood Heroine: ముగ్గురు హీరోల జీవితాలలో నిజమైన స్టార్ హీరోయిన్ సెంటిమెంట్.. క్రేజీ కదా..!

Tollywood Hero’s: ఈసారైనా ఈ హీరోలు గట్టెక్కేరా..?

Big Stories

×