EPAPER
Kirrak Couples Episode 1

Big Tv Special : ఏదైనా రెండు రోజులు కొత్త ఇష్యూ వస్తే అంతా మామూలే

Big Tv Special : ఏదైనా రెండు రోజులు కొత్త ఇష్యూ వస్తే అంతా మామూలే

Big Tv Special :


ప్రపంచంలో నిత్యం ఏదో ఒకటి జరుగుతుండాలిరా లేకపోతే ప్రతోడు చూపు మన మీద పడిపోద్ది.

శ్రీకాంత్ అడ్డాల


పొరపాటున మీ బ్లూ* ఫి*లిం టీవీలో వచ్చేసిన పట్టించుకోవద్దు. రెండు రోజుల్లో అందరూ మర్చిపోతారు. కాకపోతే రెండో ప్రింట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి

పూరి జగన్నాధ్

అని మన తెలుగు దర్శకులు చెప్పినట్లు సమాజం అలానే తయారయింది. ఇక్కడ ఏ విషయం గురించి కూడా రెండు రోజులకు మించి చర్చ ఉండదు. కేవలం ఆ క్షణం మాట్లాడుకోవడానికి, ఆ రెండు రోజులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకోవడానికి మాత్రమే ఏదైనా ఇష్యూ పరిమితం అయిపోతుంది. కొన్నిసార్లు జరిగిన ఏ పరిస్థితులు కూడా ఒక కొలిక్కి రావు, అది అలా సాగుతూనే ఉంటాయి. కొత్తవి జరిగినప్పుడు మన ఫోకస్ అటు షిఫ్ట్ అయిపోతుంది. 2024 ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళాడని కొన్ని రోజులు పాటు చర్చలు జరిగాయి మెగా అభిమానులు అల్లు అభిమానులు సోషల్ మీడియా వేదిక తీవ్రమైన దూషణలు చేసుకొని ట్రోలింగ్స్ మొదలుపెట్టారు.

ఒక యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఒక తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న ప్యూర్ రిలేషన్షిప్ ని చాలా అబ్యుజ్ గా చేసి మాట్లాడాడు అని చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యంగ్ హీరోస్ అంతా ట్వీట్స్ వేసారు. ఇక ప్రణీత్ హనుమంతును జైలుకు తరలించడంతో ఆ ఇష్యూ గురించి చర్చ ఆగిపోయింది.

ఇక కొన్ని రోజులు ముందు వరకు యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య చుట్టూ అనేక కథనాలు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. మొత్తానికి అది కూడా ఏమి జరిగింది అని క్లారిటీ ఎవరికీ లేదు. ఇక కొన్ని రోజుల ముందు జానీ మాస్టర్ ఒక లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక జానీ మాస్టర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఆల్మోస్ట్ దాని గురించి కూడా చర్చించడం ఆపేసారు. ఇక తాజాగా ఇండస్ట్రీలో మరో హాట్ టాపిక్ మినిస్టర్ కొండా సురేఖ సమంత ను ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీ, మరియు కేటీఆర్ పై వ్యాఖ్యలు చేయటం వ్యాఖ్యలు చేయటం.

ప్రస్తుతం ఒక్కసారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంత ఈ విషయం గురించి స్పందిస్తూ వచ్చింది. కేవలం అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాకుండా చాలామంది యంగ్ హీరోస్ ఈ ఇష్యూ పై ట్వీట్స్ చేస్తూ స్పందిస్తున్నారు. అయితే దాదాపు ఇండస్ట్రీలో ఎన్నో విషయాలు జరిగినా కూడా స్పందించిన సెలబ్రిటీలు ఇప్పుడు స్పందించడానికి అసలు కారణం. అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు కావడం. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సమంత, శోభిత, అమల వీరందరికీ కూడా సినిమాలతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధాలు ఉండటం వలన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. అలానే మీడియా కూడా వీళ్ళందరికీ కవరేజ్ ఇస్తుంది. ఇలానే సామాన్యులకు జరిగితే ఇటువంటి అటెన్షన్ ఇస్తుందా అనేది కొంతమంది సందేహం. ఏదేమైనా ఫైనల్ గా ఈ విషయం గురించి కూడా మరో కొత్త వివాదం వచ్చినంత వరకు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అంతా మామూలే. ఇలా ఎంతకాలం.?

Related News

Jacqueline Fernandez: జాక్వెలిన్ పాట హిట్టయితే గిఫ్ట్ గా 100 ఐఫోన్ ప్రోలు… ఇదెక్కడి రాక్షస ప్రేమరా సామీ!?

Priyanka Mohan: విడాకుల తీసుకున్న స్టార్ హీరోతో సీక్రెట్ గా ప్రియాంక మోహన్ ఎంగేజ్మెంట్.. ..?

Indian 3 : డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇండియన్3 మూవీ .. ఇదేం ట్విస్ట్ మామా..

Thalapathy 69: విజయ్ ఫ్యాన్స్‌కు పజిల్.. ‘దళపతి 69’ నుండి స్పెషల్ సర్‌ప్రైజ్ రివీల్

Samantha : సమంతను వెంటాడుతున్న అక్టోబర్ బ్యాడ్ లక్… డివోర్స్ నుంచి నేటి వరకు వరుస వివాదాలు

Mahesh Babu: ఇంత చీప్ గా ఎలా మాట్లాడతారు..కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన మహేష్ బాబు

Poonam Kaur: సెలబ్రిటీలపై పూనమ్ హాట్ కామెంట్.. పోసాని విషయంలో ఈ ఐక్యమత్యం ఏమైనట్టు..?

Big Stories

×