EPAPER

Pawan Kalyan: పవన్ నోట.. బన్నీ మాట.. వారితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు

Pawan Kalyan: పవన్ నోట.. బన్నీ మాట.. వారితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మొన్నటివరకు తిరుపతి లడ్డూ వివాదంపై ఎక్కువ ఫోకస్ పెట్టిన పవన్.. ప్రాయశ్చిత్త దీక్ష చేయడం జరిగింది. ఈ మధ్యనే ఆ దీక్షను పూర్తి చేసి యధా రూపానికి వచ్చారు.  ఏపీ డిప్యూటీ సీఎంగా రాష్ట్ర ప్రజలకు పవన్ నచ్చినా.. హీరోగా ఫ్యాన్స్ కు మాత్రం ఆయన నచ్చడం లేదు. అందుకు కారణం.. ఆయన ఇంకా సినిమా సెట్స్ లో అడుగుపెట్టకపోవడమే.


అప్పట్లో పార్టీ ఫండ్ కోసమని సినిమాలు ఒప్పుకున్నా పవన్.. మధ్యలో పదవి రావడంతో వాటిని హోల్డ్ లో పెట్టిన విషయం తెల్సిందే. అయినా కూడా ఆ సినిమాలను అలా వదిలేయకుండా.. నిర్మాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి.. సమయం చిక్కినప్పుడల్లా షూటింగ్ చేస్తానని చెప్పారు. ఇక పవన్ సై అనాలే కానీ, మేకర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు షూటింగ్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG.

Allu Arjun : అల్లు అర్జున్ గారు కావొచ్చునా…? ఇదేం ట్విస్ట్ డీసీఎం గారు…?


మిగతా రెండు సినిమాలు ఏమో కానీ OG సినిమాపై అభిమానులు  పెట్టుకున్న అంచనాలు చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. పవన్ ఎక్కడ కనిపించినా.. OG  అని అరవడం మొదలుపెట్టేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో OG గురించి పవన్ మాట్లాడారు. ముందు రాష్ట్ర అభివృద్ధి చేయాలనీ, ఆ తరువాత OG గురించి మాట్లాడుకుందామని చెప్పుకొచ్చారు. ” నాకు చాలాకాలం ఓజీ.. ఓజీ.. అంటుంటే నాకు మోదీ.. మోదీ అని వినిపించేది.

మనమెందుకు ఈ పల్లె పండుగ చేస్తున్నామో చెప్తాను. రేపొద్దున మీరు సినిమాలకు వెళ్లాలి. నా సినిమా అనే కాదు. మీ అభిమాన నటులందరి సినిమాలకు వెళ్లాలి. వాటికి  మీరు డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టాలి అంటే రాష్ట్రంలో డబ్బులుండాలి. ప్రతి ఒక్కరి కడుపు నిండాలి. అందుకే ముందు కడుపు నిండే పని చేద్దాం.. ముందు మన రోడ్లు బాగుచేసుకుందాం..  స్కూల్స్  బాగు చేసుకుందాం. ఆ  తరువాత విందులందామా.. వినోదాలందామా .. OG అందమా అనేది చూద్దాం. ముందు బాధ్యత. మీరు సినిమాలకు వెళ్లినా రోడ్లు బావుండాలి కదా. కిందపడి గోతులు లేకుండా ఉండాలి.

Shreya Dhanwanthary: తెలంగాణ పిల్ల బికినీ రచ్చ.. దేవుడా మరీ ఇంత దారుణంగానా.. ?

మీకు వినోదం ఉండాలి. నన్ను నాయకుడు కాకుండా ఒక హీరోలా నన్ను ఎలా అభిమానిస్తారో.. నేను కూడా అందరిని అభిమానిస్తాను. ఇండస్ట్రీలో ఏ హీరోతో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సినిమాలు విషయంలో నేను ఏ హీరోతో పోటీపడను. టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది.

నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ బాబు, తారక్, అల్లుఅర్జున్ , రామ్ చరణ్, నాని.. అందరూ హీరోలు బావుండాలని కోరుకుంటున్నాను. మీ అభిమాన హీరోలకు జై కొట్టే ముందు రాష్ట్రం బావుండాలి. ఆర్థిక వ్యవస్థ మీద ముందు దృష్టి పెడదాం. మీకు పని కావాలి.. మీకు స్కిల్ డెవలెప్మెంట్ కావాలి. ఇవన్నీ చేసి ఆ తరువాత విందులు, వినోదాలు చేద్దాం” అని చెప్పుకొచ్చారు. ఇక పవన్ నోట.. బన్నీ మాట విన్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య విబేధాలు నడుస్తున్న విషయం తెల్సిందే.  బన్నీ నంద్యాల పర్యటన తరువాత ఇది ఇంకా ముదిరింది. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Sankranti 2025: సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలు ఇవే.. ఎవరిది పై చేయి..?

Srivani: సీరియల్ నటి శ్రీవాణికి యాక్సిడెంట్… రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

Mahendragiri Varahi: సంక్రాంతి బరిలోకి అక్కినేని హీరో.. పోటీని తట్టుకునేరా..?

Prabahs: డార్లింగ్ లైఫ్ పై డాక్యుమెంటరీ… నిర్మాతలకు ప్రభాస్ షాకింగ్ రూల్

Salman Khan : సల్లూ భాయ్ మాత్రమే కాదు… డేంజర్‌‌ జోన్‌లో ఉన్న బీ టౌన్ స్టార్స్ వీళ్లే

Kamal Haasan: కమల్ హాసన్ కొత్త లుక్, ఇదేంటి ఇంత మారిపోయారు.. దానికోసమేనా?

Big Stories

×