EPAPER

Dulquar Salman: మలయాళ హీరోకి కలిసొచ్చిన టాలీవుడ్.. కొంపతీసి ఇక్కడే సెటిల్ అవుతారా..?

Dulquar Salman: మలయాళ హీరోకి కలిసొచ్చిన టాలీవుడ్.. కొంపతీసి ఇక్కడే సెటిల్ అవుతారా..?

Dulquar Salman.. మలయాళ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సొంతం చేసుకున్న మమ్ముట్టి (Mammutti) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అటు మలయాళ ప్రేక్షకులనే కాదు ఇటు తమిళ్ , తెలుగు ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆయన బయోపిక్ “యాత్ర”లో మమ్ముట్టి ఒదిగిపోయారు అనడంలో సందేహం లేదు. అంతలా పాత్రకు తగ్గట్టుగా తనను తాను మేకోవర్ చేసుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు మెగాస్టార్.


అలా తెలుగు తెరకు తొలి పరిచయం..

అయితే ఆయన వారసుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) కూడా హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. తొలిసారి ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో కీర్తి సురేష్(Keerthi Suresh) ప్రధాన పాత్రలో దివంగత హీరోయిన్ మహానటి సావిత్రి (Savitri)బయోపిక్ ను మహానటి (Mahanati ) పేరిట తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో సావిత్రి భర్తగా జెమినీ గణేషన్ (Jemini Ganeshan) పాత్రలో అద్భుతంగా నటించారు దుల్కర్ సల్మాన్. ఈ సినిమాతోనే మొదటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సోలో హీరోగా నేరుగా తెలుగులో హను రాఘవపూడి(Hanu raghavapudi)దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా సీతారామం (Sitaramam) సినిమా చేసి ఊహించని పాపులారిటీ దక్కించుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఎంతలా విజయం సాధించిందంటే తెలుగులో దుల్కర్ కు విపరీతమైన క్రేజ్ లభించడమే కాదు ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అంతేకాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఈయనను ఓన్ చేసుకున్నారనటంలో సందేహం లేదు.


ఒకరోజు ముందే ప్రీమియర్ షోలకు అనుమతి..

ఇక ఇప్పుడు లక్కీ భాస్కర్ అనే మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకీ అట్లూరి (Venki Atluri) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ ఉండగా.. ఈయన సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) హీరోయిన్ గా నటిస్తోంది. దీపావళి (Diwali ) సందర్భంగా ఈనెల అక్టోబర్ 31వ తేదీన పాన్ ఇండియా భాషలలో ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను అక్టోబర్ 31న అమావాస్య కావడంతో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేస్తామని నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) తాజాగా ప్రకటించారు. అంతేకాదు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు లక్కీ భాస్కర్ చిత్రాన్ని ఏపీ మరియు తెలంగాణలో భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేయబోతున్నారని తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే నిజమైతే టాలీవుడ్ లో సెటిల్ అవడం ఖాయం..

ఇకపోతే అక్టోబర్ 30న సాయంత్రం 6:00 నుండి మొత్తంగా 100 పైగా ప్రీమియర్ షో లను రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ప్రదర్శించనున్నట్లు మేకర్స్ వెల్లడిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్స్ లో పాజిటివ్ రిపోర్టు దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రీమియర్లకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. అంతేకాదు ఇటీవల దీపావళికి నాలుగు సినిమాలు పోటీ పడుతుండడంతో అందులో లక్కీ భాస్కర్ సినిమా ఫస్ట్ ఛాయిస్ గా నిలిచింది. ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే దుల్కర్ సల్మాన్ కి తెలుగు ఇండస్ట్రీ భారీగా కలిసొచ్చిందని , ఇక భవిష్యత్తులో ఆయన ఇక్కడే సెటిల్ అయినా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×