EPAPER

Nayanthara: నయన్ రీల్ కూతురును చూశారా.. ఎంత అందంగా మారిందో..

Nayanthara: నయన్ రీల్ కూతురును చూశారా.. ఎంత అందంగా మారిందో..

Nayanthara: చైల్డ్ ఆర్టిస్టులు త్వరగా పెరిగిపోతున్నారు. అబ్బాయిలు ఏమో కానీ అమ్మాయిలు అయితే.. మరింత వేగంగా పెరిగిపోతున్నారు. మూడు నాలుగేళ్ళ క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా ముద్దు ముద్దు మాటలు మాట్లాడిన వారు..  ఇప్పుడు యమా హాట్ గా మారి హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. వారిని హీరోయిన్స్ గా చూసినవారు  ఏంటి ఆ చిన్నారి ఈ హీరోయినా అని నోళ్లు వెళ్లబెడుతున్నారు.


ఇప్పటికే  కోలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ లు అనికా, ఎస్తేర్,  సారా హీరోయిన్స్ గా మారారు. ఇక ఇప్పుడు  వీరి లిస్ట్ లోనే మరో చిన్నారి కూడా చేరబోతోందని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు మనస్వి కొట్టొచ్చి.  ఈ చిన్నారి తెలుగువారికి కూడా సుపరిచితమే. నయనతార ప్రధాన పాత్రలో నటించిన  సినిమా అంజలి CBI.  విజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన్ కూతురుగా నటించి మెప్పించిన చిన్నారినే మనస్వి. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే.. ఈ చిన్నారి సీన్స్ మరో ఎత్తు అని చెప్పాలి.

Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్.. సెట్ అవ్వలేదు.. ?


రేయ్.. కొట్టరా.. కొట్టరా.. కొట్టి చూడు.. కొడతానంటున్నాడమ్మా.. లాస్ట్ వార్నింగ్.. పిచ్చిగా వాగావో అంటూ పోలీస్ ను బెదిరించే సీన్ అయితే  నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.  ఆ సీన్ తోనే మనస్వి బాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా  మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తరువాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే  ఇంకోపక్క షోస్ లతో కూడా బిజీగా మారింది మనస్వి. అప్పుడే ఈ చిన్నారి.. హీరోయిన్ గా మారుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో కూడా అమ్మడు అందాల  ఆరబోత చేయడం మొదలుపెట్టింది. తాజాగా ఈ చిన్నది.. లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరోయిన్ మెటీరియల్ రా మనస్వి అంటూ  ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే..  ఒక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఈ చిన్నది హీరోయిన్ గా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Bagheera Twitter Review : ‘భగీరా’ ట్విట్టర్ రివ్యూ.. సైకో కిల్లర్ గా ప్రభుదేవా..?

Amaran Twitter Review : ‘అమరన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టేనా?

Lucky Baskhar Movie Review : ‘లక్కీ భాస్కర్’ మూవీ రివ్యూ

Ka Movie Review : ‘క’ మూవీ రివ్యూ

Vettaiyan The Hunter: వెట్టయాన్.. మనసిలాయో వీడియో సాంగ్ వచ్చేసింది..

KA Movie OTT : భారీ ధరకు ‘క ‘ ఓటీటీ డీల్.. ఒకేసారి రెండిట్లో స్ట్రీమింగ్..

×