EPAPER

Amigos : “అమిగోస్” అర్థమేంటో తెలుసా..? ఆ టైటిల్ అందుకే పెట్టారా..?

Amigos : “అమిగోస్” అర్థమేంటో తెలుసా..? ఆ టైటిల్ అందుకే పెట్టారా..?

Amigos(Latest Tollywood News) : కల్యాణ్ రామ్ కొత్తపంథాలో తన సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. కెరీర్ ప్రారంభం నుంచి కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా వెరైటీ చిత్రాలు ప్రేక్షకులకు అందించారు. తాజాగా
బింబిసార మూవీతో మంచి విజయాన్ని అందుకున్న ఈ నందమూరి హీరో..ఇప్పుడు అమిగోస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. టైటిల్ తో ఈ మూవీకి చాలా క్రేజ్ వచ్చింది. అసలు అమిగోస్ అనే పేరు ఈ సినిమాకు ఎందుకు పెట్టారు? అమిగోస్ అంటే అర్థమేంటి? ఇలాంటి ప్రశ్నలు సగటు ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచేశాయి.


ఈ సినిమా కథేంటి?
అమిగోస్ మూవీని రాజేంద్రరెడ్డి తెరకెక్కించారు. ఈ మూవీలో మంజునాథ్‌, సిద్ధార్థ్‌, మైఖేల్‌ అనే మూడు పాత్రల్లో కల్యాణ్ రామ్ కనిపిస్తారు. సిద్ధార్థ్‌ పాత్ర చాలా సరదాగా ఉంటుంది. మంజునాథ్‌ సైలెంట్‌ అండ్‌ సాఫ్ట్‌గా ఉండే క్యారెక్టర్. మైఖేల్‌ గ్యాంగ్‌స్టర్‌. మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. అదే పాయింట్‌తో తీసిన సినిమా అమిగోస్. సాధారణంగా సినిమాల్లో హీరోని పూర్తిస్థాయి విలన్‌గా చూపించరు. ఒకవేళ అలా చూపించినా చివరికి మంచిగా మారినట్లు చూపిస్తారు. కానీ అమిగోస్‌లో హీరోనే విలన్‌. అతని లక్ష్యమేంటి? తన పోలికలతోనే ఉన్న మిగతా ఇద్దరు వ్యక్తులను ఎందుకు కలుసుకున్నాడు? చివరికి వాళ్లను ఏం చేశాడు? అన్నది థియేటర్లలో చూడాల్సిందే. ఈ సినిమా సెకండాఫ్ చాలా ఆసక్తికరంగా సాగుతోందని టాక్ వినిపిస్తోంది.

మూడు పాత్రలు.. హీరోయిన్ ఒక్కరే..
అమిగోస్ లో మూడు హీరో పాత్రలున్నా.. ఒక్క కథానాయికే ఉంది. ఈ సినిమాలో హీరో మూడు పాత్రలు ముఖ్యమైనవే. వాటిలో ఓ పాత్ర పేరునే టైటిల్‌గా పెడితే బెడిసికొడుతుంది. వాళ్లు ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి అదే అర్థం వచ్చేలా క్యాచీ టైటిల్ పెట్టాలనుకున్నారు. అమిగోస్ అనేది స్పానిష్ పదం. అమిగోస్ అంటే స్నేహితులు అని అర్థం. అందుకే ఈ మూవీకి ఆ పేరు పెట్టారు. శేఖర్‌ కమ్ముల బ్యానర్‌ పేరు కూడా అమిగోస్ కావడం విశేషం.


బాలయ్య సాంగ్ రిమీక్స్..
‘అమిగోస్‌’లోని ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మ’ రీమిక్స్‌ సాంగ్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 1992లో నందమూరి బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రం సినిమాలోని ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంది. బాలకృష్ణ- దివ్యభారతి మధ్య కుదిరిన కెమిస్ట్రీ ఈ పాటకు విపరీతమైన క్రేజ్ తెచ్చింది. ఆ పాటకు ఇళయరాజా అందించిన స్వరాల ప్రేక్షకులను మైమర్చిపోయేలా చేశాయి. అమిగోస్ లో కల్యాణ్‌రామ్‌, ఆషికా రంగనాథ్‌ మధ్య కెమిస్ట్రీ అదే రేంజ్ లో కుదిందని వీడియో సాంగ్స్ నిరూపించింది.

ఆ 2 నిమిషాలే..
‘అమిగోస్‌’ సినిమా 2 గంటల 19 నిమిషాల నిడివి ఉంటుంది. ఇందులో 2 గంటల 17 నిమిషాలపాటు తెరపై కల్యాణ్‌ రామ్‌ కనిపిస్తారు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే కనపడరు. ఇది ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రూపొందిన ఈ విభిన్న కథా చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Related News

Samantha: నేను నీ మాటను తీసుకున్నాను..థాంక్యూ.. సమంత పోస్ట్ వైరల్

Pawan Kalyan: ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి, అభిమానులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, కానీ ఆడియన్స్ ను రప్పించడానికి అదనపు ఖర్చు

Janaka Aithe Ganaka : సినిమా రిలీజ్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ప్లాన్ చేసారు

Balagam/ Janaka aitey Ganaka : “బలగం”లా ఈ సినిమాను నిలబెట్టలా.?

Game Changer Release Date: కొడుకు కోసం తండ్రి కీలక నిర్ణయం, ‘విశ్వంభర’ స్థానంలోకి ‘గేమ్ ఛేంజర్‘?

Mohanraj: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ టాలీవుడ్ విలన్ కన్నుమూత

Big Stories

×