EPAPER

Salaar : సలార్ లో దేవా కోసం ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా?

Salaar : సలార్ లో దేవా కోసం ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా?
Salaar

Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సలార్. విడుదలైన క్షణం నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది ఈ చిత్రం. మొదటి రోజే దంచి కొట్టే కలెక్షన్స్ తో రికార్డ్ బ్రేక్ ఓపెనింగ్స్ అందించిన ఈ మూవీ ప్రస్తుతం టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్ కు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే నిజానికి ప్రశాంత్ నీల్ మొదట ఈ చిత్రానికి హీరోగా ప్రభాస్ ని అనుకోలేదట. వేరే హీరోని దృష్టిలో పెట్టుకొని ఈ స్టోరీని ప్రశాంత్ డెవలప్ చేశారట.


అయితే అనుకోకుండా ఆ సినిమా ప్రభాస్ వరకు రావడం.. సినిమాలో ప్రభాస్ భాగం కావడం ..అంతా ఒక సినిమాలాగే జరిగింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..ప్రశాంత్ నీల్ కన్నడంలో ఉగ్రం, కే జి ఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 లాంటి సినిమాలు చేసి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అతను ఎటువంటి సినిమా తీస్తాడు? ఏ హీరోతో తీస్తాడు ?అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే ఫలానా హీరోతో సినిమా చేయాలి అనే ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ ఒక మంచి కథ రాసుకుందాం అని ఫిక్స్ అయి సలార్ కథకు ప్రాణం పోశారు.

నిజానికి ఈ స్టోరీ ప్రశాంత్ ముందుగా తమిళ్ హీరో సూర్యని దృష్టిలో రాసుకున్నాడట. కానీ కథ గురించి చర్చించే సమయంలో ఈ మూవీలో దేవా పాత్రకు ప్రభాస్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సూచించాడట. ఎందుకంటే మూవీలో కంటెంట్ పరంగా హీరోకి చాలా బలమైన శక్తి ఉండాలి.. బ్రహ్మాండమైన కటౌట్ ఉండాలి.. అందుకే ప్రభాస్ అయితే ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని ఆ సదరు అసిస్టెంట్ డైరెక్టర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ మాటలతో ఆలోచనలో పడిన ప్రశాంత్ నీల్.. నిజంగానే ఈ పాత్రకు సాలిడ్ కటౌట్ ఉన్న హీరో కావాలి అన్న అంచనాకు వచ్చాడు.


ప్రభాస్ తో మూవీ చేయాలి అని ఫిక్స్ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభాస్ ని కలిసి స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇక స్టోరీ ప్రభాస్ కి నచ్చడంతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.అదే సమయానికి ప్రభాస్ డేట్స్ కూడా ఫ్రీగా ఉండడంతో సినిమా వెంటనే పట్టాలెక్కేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతున్న ప్రశాంత్ నీల్ దీనిపై స్పందించడం లేదు. అంటే కచ్చితంగా స్టోరీ సూర్య ని దృష్టిలో పెట్టుకొని రాసుకొని ఉంటారు అన్న వాదనకు బలం చేకూరుతోంది.

ఆ విషయం పక్కనపెడితే ఈ సినిమాకి సూర్య కంటే ప్రభాస్ సెట్ అవుతాడు అని చాలామంది భావిస్తున్నారు. ప్రభాస్ చేయి వ్యక్తి గట్టిగా ఒకడిని కొడితే వాడు ఎగిరి అవతల పడ్డాడు అంటే నమ్మసక్యంగా ఉంటుంది.. ఎందుకంటే ప్రభాస్ ఫిజిక్ ఆ రేంజ్ లో ఉంటుంది. అదే సలార్ ఫైట్స్ కి సగం బలం.. మరి అలాంటిది ప్రభాస్ ప్లేస్ లో సూర్య ఆ ఫైట్స్ చేశాడు అంటే అతిశయోక్తిగా అనిపించక మానదు. సో ఎవరికోసం స్టోరీ రాసుకున్న సరే దేవాగా సెట్ అయ్యేది మాత్రం ప్రభాసే అనడంలో డౌట్ లేదు అంటున్నారు డార్లింగ్ ఫాన్స్.

Related News

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Sekhar Bhashaa : జానీ మాస్టర్ కేసు పై సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ భాషా..?

Big Stories

×