EPAPER

Nagarjuna’s N Convention: నాగార్జున N కన్వెన్షన్ లో ఇంతమంది సెలబ్రిటీ ఫంక్షన్స్ జరిగాయా.. ?

Nagarjuna’s N Convention: నాగార్జున N కన్వెన్షన్ లో ఇంతమంది సెలబ్రిటీ ఫంక్షన్స్ జరిగాయా.. ?

Nagarjuna’s N Convention: అక్కినేని నాగార్జున .. ప్రస్తుతం సోషల్ మీడియాను మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేస్తున్నపేరు. దానికి కారణం నాగార్జున ఆస్తుల్లో ముఖ్యమైన N కన్వెన్షన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొట్టడమే. తుమ్ముడికుంట చెరువును ఆక్రమించి.. ఎన్ కన్వెన్షన్‍‍ను నిర్మించారనే ఆరోపణల నడుమ హైడ్రా.. ఈ కన్వెన్షన్ ను కూల్చివేసింది.  దీంతో ఒక్కసారిగా నాగార్జున పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది నాగ్ కు సపోర్ట్ చేస్తుండగా.. ఇంకొంతమంది నాగ్ కు ఇలానే జరగాలని చెప్పుకొస్తున్నారు.


ఇక ఇంకోపక్క నాగార్జున.. తాను ఒక్క అడుగు భూమిని కూడా కబ్జా చేయలేదని, అదంతా పట్టా భూమి అని చెప్పుకొచ్చాడు.”N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది.


ప్రస్తుతం , నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పు కి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను” అంటూ నాగ్ క్లారిటీ కూడా ఇచ్చాడు.

ఇక  N  కన్వెన్షన్ కూల్చివేతతో అసలు నాగ్ ఆస్తులు ఎన్ని.. ? N  కన్వెన్షన్ వలన నాగ్ కు వచ్చే ఆదాయం ఎంత అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. నిజం  చెప్పాలంటే..  నాగ్ ఆస్తులతో పోలిస్తే N  కన్వెన్షన్  నుంచి వచ్చే ఆదాయం చిన్న అమౌంట్ అనే చెప్పాలి. కానీ, దీనివలన నాగ్ కు వచ్చిన పేరు ఎక్కువ.

ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ చేయాలన్నా.. అందరు మొదట ఆలోచించే పేరు N  కన్వెన్షన్. 10 ఎకరాల స్థలం.. ఒకేసారి మూడు ఫంక్షన్స్ ఎలాంటి గందరగోళం జరగకుండా చేయగలిగేంత స్పేస్ N  కన్వెన్షన్ లో ఉంది.  ఏడాదికి రూ. 100 కోట్ల వరకు N  కన్వెన్షన్ నుంచి నాగ్ కు ఆదాయం అందుతుందని సమాచారం. అంతెందుకు.. హైదరాబాద్ లో ఎలాంటి సెలబ్రిటీ ఇంట్లో మ్యారేజ్ అయినా..  అది కచ్చితంగా N  కన్వెన్షన్ లోనే జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఈ కన్వెన్షన్ ను కూల్చివేయమని ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె పెళ్లి కూడా.. ఇదే కన్వెన్షన్ లో జరిగింది.

మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ మొదటి పెళ్లి రిసెప్షన్  ఈ కన్వెన్షన్ లోనే అంగరంగ వైభవంగా జరిగింది. ఇక నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య మొదటి పెళ్లి సమంతతో జరిగిన విషయం తెల్సిందే. పెళ్లి గోవాలో జరిగినా రిసెప్షన్ మాత్రం తమ కన్వెన్షన్ లోనే జరుపుకున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. అల్లరి నరేష్ పెళ్లి, వరుణ్ తేజ్- లావణ్య రిసెప్షన్, శర్వానంద్ రిసెప్షన్,  దిల్ రాజూ తమ్ముడు కొడుకు, హీరో ఆశిష్ రిసెప్షన్ కూడా ఇదే కన్వెన్షన్ లోనే జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఈ కన్వెన్షన్ లోనే రిసెప్షన్ జరుపుకున్నారు.

ఇక ఇదే కాదు.. ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. N  కన్వెన్షన్  కూల్చివేత  వలన .. ఇండస్ట్రీకి ఒక మంచి వేదిక మిస్ అయ్యిందనే చెప్పాలి.  మరి ఈ N  కన్వెన్షన్ ను నాగ్ మళ్లీ వెనక్కి తెస్తాడా.. ? లేక  కొత్త ప్లేస్ లో కొత్తగా స్టార్ట్ చేస్తాడా.. ? అనేది చూడాలి.

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×