EPAPER
Kirrak Couples Episode 1

Game Changer : గేమ్ ఛేంజ్ చేసేది హీరో కాదు… డైరెక్టరే..

Game Changer : గేమ్ ఛేంజ్ చేసేది హీరో కాదు… డైరెక్టరే..

Game Changer : ఇండస్ట్రీలో హీరోలు అంటే… మాట్లాడుకునేది రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు. వీళ్లే టాప్ ప్లేస్‌లో ఉంటారు. ఈ 6 గురు హీరోల నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే… బాక్సాఫీస్ వద్ద ఉండే హంగామా అంతా ఇంత కాదు. నిజానికి రిలీజ్ కి దాదాపు వారం ముందు నుంచే ఉంటుంది. అలా గత వారం, ఈ వారం జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవర గురించే అంతా నడిచింది. ఇప్పుడు రాబోతుంది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్…


దేవర నుంచి వచ్చిన పాఠాలు…

ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య మూవీలో రామ్ చరణ్ నటించినా అది సోలో హీరో మూవీ కాదు. ఇంకా చెప్పాలంటే అందులో చరణ్ అతిథి పాత్ర. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ మెయిన్ హీరోగా వచ్చే మూవీ ఈ గేమ్ ఛేంజర్. అలాగే ఆర్ఆర్ఆర్ లో మరో హీరోగా చేసిన తారక్ నుంచి వచ్చిన దేవర ఈ సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. మూవీలో తారక్ ఫర్మామెన్స్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పొచ్చు. అయినా, మూవీకి మిక్సిడ్ టాక్ వచ్చింది. కథ బాగానే ఉన్నా… ఓ వర్గం ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. దీనికి కారణం… కొరటాల శివ పైన ఉన్న వ్యతిరేకతే. ఆచార్య మూవీ తర్వాత కొరటాలపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు దేవర తర్వాత అవి మరింత పెరిగిపోయాయి. హీరో ఫర్మామెన్స్ బాగున్నా… కథ బాగున్నా.. మూవీపై ట్రోల్స్, నెగిటివిటీ రావడానికి కారణం కొరటాలే అని ఇప్పటికే తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి రామ్ చరణ్ కి రాబోతుంది.


మూవీకి శంకరే మైనస్…?

దేవరకు వచ్చిన పరిస్థితే డిసెంబర్‌లో రిలీజ్ కాబోయే గేమ్ ఛేంజర్ కి వచ్చే ఛాన్స్ లేకపోలేదు. శంకర్ నుంచి ఇటీవల వచ్చిన ఇండియన్ 2 డిజాస్టర్ అయింది. ఈ డిజాస్టర్ వల్ల శంకర్ పై చాలా నెగిటివిటీ వచ్చింది. కమల్ హాసన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా శంకర్ పై ఫైర్ అయ్యారు. శంకర్ పని అయిపోయింది అంటూ ట్రోల్స్ కూడా చేశారు. దీని ఎఫెక్ట్ ఇప్పుడు రాబోయే గేమ్ ఛేంజర్ పైన ఉండే ఛాన్స్ లేకపోలేదు.

గేమ్ ఛేంజ్ చేసేది డైరెక్టరే…

రామ్ చరణ్ ఫర్మామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు ట్రోల్స్ వచ్చినా… రంగస్థలం నుంచి యాక్టింగ్‌లో చరణ్ రాటు దేలాడు అంటూ ప్రతి మూవీకి క్రిటిక్స్ నుంచి వస్తూనే ఉంది. ఇప్పుడు రాబోయే గేమ్ ఛేంజర్ మూవీలో కూడా చరణ్ ఫర్మామెన్స్ ఆ రేంజ్‌లోనే ఉంటుందని ఎలాంటి డౌట్స్ లేకుండా చెప్పొచ్చు. ఇటీవల వచ్చిన రా మచ్చా సాంగ్‌లో చరణ్ డ్యాన్స్ పై సెలబ్రెటీల నుంచి ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే డౌట్స్ అన్ని ఇప్పుడు డైరెక్టర్ పైనే. దీనికా కారణం పైన చెప్పుకున్నట్టే… ఆయనపైన ఉన్న నెగిటివిటీ.

శంకర్ పైన ఉన్న నెగిటివిటీ సినిమాపై ప్రభావం చూపించోద్దు అంటే, సినిమా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పక్కాగా ఉండాలి. ఇటీవల వచ్చిన ఇండియన్ 2 మూవీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. అలాంటివి ఇప్పుడు గేమ్ ఛేంజర్ కి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత శంకర్ దే.

గేమ్ ఛేంజర్‌కి ఫస్ట్ టైం అలా…

శంకర్ డైరెక్షన్ కెరియర్‌లో ఇప్పటి వరకు హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు రామ్ చరణ్ కోసం ఇంట్రడక్షన్ సాంగ్ ఇచ్చాడు శంకర్. ఇది ఎంత వరకు ప్లస్ అవుతుందో తెలీదు కానీ, ఒక వేళ సెట్ అవ్వకపోతే, శంకర్ పై మరోసారి ట్రోల్స్ రావడం మాత్రం గ్యారంటీ.

Related News

Jacqueline Fernandez: జాక్వెలిన్ పాట హిట్టయితే గిఫ్ట్ గా 100 ఐఫోన్ ప్రోలు… ఇదెక్కడి రాక్షస ప్రేమరా సామీ!?

Priyanka Mohan: విడాకుల తీసుకున్న స్టార్ హీరోతో సీక్రెట్ గా ప్రియాంక మోహన్ ఎంగేజ్మెంట్.. ..?

Indian 3 : డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇండియన్3 మూవీ .. ఇదేం ట్విస్ట్ మామా..

Thalapathy 69: విజయ్ ఫ్యాన్స్‌కు పజిల్.. ‘దళపతి 69’ నుండి స్పెషల్ సర్‌ప్రైజ్ రివీల్

Samantha : సమంతను వెంటాడుతున్న అక్టోబర్ బ్యాడ్ లక్… డివోర్స్ నుంచి నేటి వరకు వరుస వివాదాలు

Mahesh Babu: ఇంత చీప్ గా ఎలా మాట్లాడతారు..కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన మహేష్ బాబు

Poonam Kaur: సెలబ్రిటీలపై పూనమ్ హాట్ కామెంట్.. పోసాని విషయంలో ఈ ఐక్యమత్యం ఏమైనట్టు..?

Big Stories

×