Jai Hanuman : ‘హనుమాన్’ (Hanuman) మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) నుంచి ఈ మూవీ సీక్వెస్ట్ ‘జై హనుమాన్’ (Jai Hanuman) ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఈ నేపథ్యంలోనే దీపావళి కానుకగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు ప్రశాంత్ వర్మ. అయితే ‘జై హనుమాన్’ (Jai Hanuman) ఫస్ట్ లుక్ పై ఓ వర్గం ప్రేక్షకులు సంతోషంగానే ఉన్నప్పటికీ, మరి కొంతమంది మాత్రం ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. హనుమాన్ గా రిషబ్ శెట్టి (Rishabh Shetty) లుక్ పై వస్తున్న ట్రోలింగ్ కు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆయన సమాధానం చెప్పారు.
ప్రశాంత్ వర్మ తన ఎక్స్ లో “జై హనుమాన్ (Jai Hanuman) ఫస్ట్ లుక్ కి వస్తున్న అపురూపమైన ప్రేమ, ఆదరణతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు రిషబ్ శెట్టికి హృదయపూర్వక ధన్యవాదాలు. హనుమాన్ పట్ల ఆయనకు ఉన్న భక్తి, సాటిలేని అంకితభావం నిజంగా ఈ పాత్రకు జీవం పోసాయి. అతడి అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితమైన పరిపూర్ణత తిరుగులేని నిబద్ధత ‘జై హనుమాన్’ (Jai Hanuman) సినిమాను నిజంగా అసాధారణమైనదిగా మార్చింది. కర్ణాటక నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులకు మరుపురాని అనుభవాన్ని అందించడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. ఈ ‘జై హనుమాన్’ (Jai Hanuman) ప్రయాణాన్ని మీతో ప్రారంభించినందుకు థాంక్స్. రిషబ్ శెట్టితో కలిసి పని చేయడం చాలా ఉత్సాహంగా ఉంది. జై హనుమాన్ జై జై హనుమాన్” అంటూ హనుమంతుడు పాత్రలో రిషబ్ శెట్టిని చూపించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రశాంత్ వర్మ.
Absolutely overwhelmed by the incredible love for the #JaiHanumanFirstLook 😊
A heartfelt thanks to the National Award Winning Actor @shetty_rishab sir, whose devotion to HANUMAN Ji and unmatched dedication have truly brought this vision to life 🔥
His incredible… pic.twitter.com/oxBTZEdPCy
— Prasanth Varma (@PrasanthVarma) November 1, 2024
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘జై హనుమాన్’ (Jai Hanuman) మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లో ఊచకోత కోసిన విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ పార్ట్ లో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమంతుడు పాత్రను సస్పెన్స్ లో ఉంచారు. ఇక మూవీ రిలీజ్ అయినప్పుడే సీక్వెల్ గా ‘జై హనుమాన్’ రాబోతోందని అందులో హనుమంతుడి పాత్రను రివీల్ చేస్తామని వెల్లడించారు. అయితే అప్పటినుంచి హనుమంతుడి పాత్రలోక నటించబోయే నటుడు ఎవరు అనేది హాట్ టాపిక్ గానే ఉంది.
అందులో భాగంగానే చిరంజీవి, రామ్ చరణ్ వంటి స్టార్స్ హనుమంతుడిగా నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. అలాగే రానా దగ్గుబాటి (Rana Daggubati) పేరు కూడా వినిపించింది. కానీ దీపావళి కానుకగా ‘జై హనుమాన్’ (Jai Hanuaan) మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక తెలుగు స్టార్స్ అందర్నీ పక్కనపెట్టి కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishabh Shetty)ని హనుమంతుడిగా ప్రశాంత్ వర్మ ఎంచుకోవడంపై విమర్శలు వినిపించాయి. పైగా హనుమంతుడిగా రిషబ్ శెట్టి లుక్ చాలా సాదాసీదాగా ఉంది అంటూ పెదవి విరుస్తున్నారు కొంతమంది. కానీ తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన పోస్ట్ చూస్తుంటే ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది.