EPAPER

Cannes Film Festival: 30 ఏళ్ల తర్వాత కేన్స్‌లో భారతీయ సినిమా.. చప్పట్లతో వెల్లువెత్తిన ప్రశంసలు.. డ్యాన్స్‌లతో హూరెత్తించిన మూవీ యూనిట్

Cannes Film Festival: 30 ఏళ్ల తర్వాత కేన్స్‌లో భారతీయ సినిమా.. చప్పట్లతో వెల్లువెత్తిన ప్రశంసలు.. డ్యాన్స్‌లతో హూరెత్తించిన మూవీ యూనిట్

Cannes Film Festival 2024 – All We Imagine as Light: ఎంతో ప్రతిష్మాత్మకంగా భావించే 77వ Cannes Film Festival 2024 ఫ్రాన్స్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ నెల అంటే మే 14న ప్రారంభమైన ఈ వేడుక ఇవాళ మే 25తో ముగియనుంది. అయితే ఈ వేడుకలో ఎంతో మంది తారలు తమ డ్రెస్సింగ్‌తో హుయలొలికించారు. అందమైన లుక్స్, వయ్యారపు ఒంపుసొంపులతో అక్కడున్నవారందరి దృష్టిని ఆకర్షించారు.


టాలీవుడ్ నుంచి మంచు మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవ వంటి హీరోలు కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేశారు. ఇందులో భాగంగానే మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను ప్రదర్శించారు. అయితే ఆ టీజర్‌పై అక్కడున్న వారంతా ప్రశంసలు కురిపించారని నటుడు విష్ణు ఇటీవల తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ వేడుకలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఓ భారతీయ సినిమా పోటీలో నిలిచింది. ఈ కేన్స్ ఉత్సవంలో ప్రధాన విభాగం అయిన ‘పామ్ డి ఓర్’ అనే అవార్డుల కేటగిరీలో ప్రముఖ మలయాళీ సినిమా కాంపిటీషన్‌లో ఉంది. ఆ సినిమా పేరు ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ (All We Imagine as Light). ఈ చిత్రాన్ని మే 23న ప్రదర్శించారు. అదే క్రమంలో ఈ మూవీ యూనిట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.


Also Read: కేన్స్ లో సత్తా చాటిన యువకులు.. రాజమౌళి ప్రశంసలు

All We Imagine as Light మూవీ దర్శకురాలు పాయల్ కపాడియాతో సహా ఇతర నటీ నటులు రెడ్ కార్పెట్‌పై సందడి చేస్తూ డాన్స్‌లతో అక్కడివారందరిని ఆకట్టుకున్నారు. ఒక మధ్య తరగతి యువతుల లైఫ్, వారి ఎమోషనల్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడంతో కేన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రెండు గంటల రన్ టైంతో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత కేన్స్‌లో ఉన్న వారంతా లేచి చప్పట్లతో ప్రశంసలు కురిపించారు.

అయితే దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒక భారతీయ సినిమా ఈ విధమైన ఘనత సాధించడం అంటే మామూలు విషయం కాదు. 1994లో స్వహం అనే సినిమా ‘పామ్ డి ఓర్’ కేటగిరీలో కాంపిటేషన్‌లో పాల్గొంది. అయితే ఇప్పుడు పాయల్ కపాడియా దర్శకత్వంలో తెరకెక్కిన All We Imagine as Light మూవీ ఈ కేన్స్‌లో నిలిచింది. అయితే ఈ సినిమాతో సహా మెగాలోపోలిస్, ఓహ్ కెనడా, యోర్గోస్ లాంతిమోస్, బర్డ్, అనోరా వంటి సినిమాలు ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీలో ఉన్నాయి. ఈ మూవీల విన్నర్‌లను ఇవాళ వెల్లడించనున్నారు.

Tags

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×