EPAPER

Anil Ravipudi : ఫన్ తో ఫ్రస్టేషన్ పోగొట్టే క్రేజీ డైరెక్టర్.. అనిల్ బర్త్ డే స్పెషల్..

Anil Ravipudi : ఫన్ తో ఫ్రస్టేషన్ పోగొట్టే క్రేజీ డైరెక్టర్.. అనిల్ బర్త్ డే  స్పెషల్..

Anil Ravipudi : యువతరం డైరెక్టర్స్ లో తనదైన వైవిధ్యమైన స్టైల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అనిల్ రావిపూడి. కామెడీ చిత్రాలతో కడుపుబ్బ నవ్వించడమే కాకుండా భారీ యాక్షన్ మూవీస్ గూస్ బంప్స్ కూడా తెప్పించగలడు ఈ డైరెక్టర్. చూడడానికి పక్కింటి కుర్రాడులా..చాలా సింపుల్ గా ఉండే అనిల్ రావిపూడి లో ఇంత టాలెంట్ ఉంది అన్న విషయం మొదట ఎవరికీ అర్థం కాలేదు. అయితే అతని చిత్రాలు అందించిన వినోదాల విందు అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చింది.


అనిల్ రావిపూడి నవంబర్ 23, 1982 లో జన్మించారు. ప్రకాశం జిల్లాలోని యద్దనపూడి మండలం చిలుకూరి వారిపాలెం ఆయన స్వస్థలం. బాల్యం నుంచి సినిమాల పై ఇంట్రెస్ట్ ఉన్న అనిల్.. స్కూల్ లో ఎన్నో కల్చరల్ ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేవాడు. బీటెక్ పూర్తి చేసిన అనిల్ కు సినిమా పై మక్కువ ఎక్కువ. బాబాయి పి.అరుణ్ ప్రసాద్ సహకారంతో చిత్ర సీమలో అడుగుపెట్టాడు. జంధ్యాల రచన అనిల్ కు ఇన్స్పిరేషన్.. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో అతనే స్వయంగా వెల్లడించాడు. రీసెంట్ గా బాలయ్య తో భగవంత్ కేసరి మూవీ చేసి.. క్లాస్ అయినా.. మాస్ అయినా , కామెడీ అయినా.. యాక్షన్ అయినా తగ్గేదే లేదని నిరూపించుకున్నాడు.

సౌర్యం, శంఖం, దరువు లాంటి చిత్రాలకు సంభాషణ అందించిన అనిల్ రావిపూడి.. 2015 లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్ చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ తనదైన మార్క్ కామెడీతో మూవీని పరిగెత్తించాడు. మూవీలో ఉన్న కామెడీ , పంచ్ డైలాగ్స్ కారణంగానే పటాస్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అతని నెక్స్ట్ మూవీ సుప్రీం లో కూడా మంచి పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు భారీ ఎమోషన్స్ ఉన్న సీన్స్ ను ఎంతో ఆసక్తిగా తెరకెక్కించాడు అనిల్.


ఇక రవితేజ కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ మూవీ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇట్స్ లాఫింగ్ టైం అంటూ.. ఆ మూవీలో చేసిన కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వారు. ఆ తర్వాత ఫన్ విత్ ఫ్రస్టేషన్ అంటూ ప్రేక్షకుల ముందుకి ఎఫ్2 రూపంలో వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అదే జోరు కంటిన్యూ చేస్తూ ఆ మూవీకి సీక్వెల్ గా ఎఫ్ 3 ని కూడా తెరకెక్కించారు. మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ తో అనిల్ మరింత పాపులర్ అయ్యాడు. భగవంత్ కేసరితో మాస్ చిత్రాలు కూడా బాగా తీయగలనని నిరూపించుకున్నాడు.  

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×